Guntur Brigde: మరో కొద్ది రోజులే.. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనుల్లో వేగం- కేంద్ర మంత్రి పెమ్మసాని! Balakrishna: రాజధాని నిర్మాణం హడావుడి కాదు.. ఓ దార్శనికత! అమరావతిపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. Phone Battery: యూజర్లకు అలర్ట్.. మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? కొత్త ఫోన్ కొనాల్సిన పని లేదు! ఈ టిప్స్ పాటిస్తే చాలు.. US Iran Conflict: 60 రోజుల డెడ్ లైన్... వైట్ హౌస్ ను వణికిస్తున్న కొత్త చట్టం! Nara Lokesh: తల్లీకొడుకుల అద్భుత విజయం - ఒకేసారి టెన్త్ పాస్.. ఫిదా అయిన మంత్రి నారా లోకేష్.! Chandrababu: ఆఫీసర్లు మారాలి.. లేదంటే ఇంటికే! ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం ఆఖరి వార్నింగ్! RBI: లండన్ నుంచి భారత్‌కు 100 టన్నుల బంగారం... ఆర్బీఐ మాస్టర్ ప్లాన్! Rashmi: వైసీపీ నేతలపై యాంకర్ రష్మి ఫైర్.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్! నిరసన పేరుతో క్రూరత్వమా? Donald Trump: ట్రంప్‌పై హత్యాప్రయత్నం.. ఉలిక్కిపడే వీడియో విడుదల! 355 అడుగుల దూరంలోనే.. Special Trains: ఏపీ మీదుగా బెంగళూరుకు ప్రత్యేక రైలు - హాల్ట్ స్టేషన్లు ఇవే! Guntur Brigde: మరో కొద్ది రోజులే.. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనుల్లో వేగం- కేంద్ర మంత్రి పెమ్మసాని! Balakrishna: రాజధాని నిర్మాణం హడావుడి కాదు.. ఓ దార్శనికత! అమరావతిపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. Phone Battery: యూజర్లకు అలర్ట్.. మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? కొత్త ఫోన్ కొనాల్సిన పని లేదు! ఈ టిప్స్ పాటిస్తే చాలు.. US Iran Conflict: 60 రోజుల డెడ్ లైన్... వైట్ హౌస్ ను వణికిస్తున్న కొత్త చట్టం! Nara Lokesh: తల్లీకొడుకుల అద్భుత విజయం - ఒకేసారి టెన్త్ పాస్.. ఫిదా అయిన మంత్రి నారా లోకేష్.! Chandrababu: ఆఫీసర్లు మారాలి.. లేదంటే ఇంటికే! ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం ఆఖరి వార్నింగ్! RBI: లండన్ నుంచి భారత్‌కు 100 టన్నుల బంగారం... ఆర్బీఐ మాస్టర్ ప్లాన్! Rashmi: వైసీపీ నేతలపై యాంకర్ రష్మి ఫైర్.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్! నిరసన పేరుతో క్రూరత్వమా? Donald Trump: ట్రంప్‌పై హత్యాప్రయత్నం.. ఉలిక్కిపడే వీడియో విడుదల! 355 అడుగుల దూరంలోనే.. Special Trains: ఏపీ మీదుగా బెంగళూరుకు ప్రత్యేక రైలు - హాల్ట్ స్టేషన్లు ఇవే!

Thiruchanuru: వైభవంగా ప్రారంభమైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు!

Thiruchanuru: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు గురువారం భక్తి పరవశంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.

Published : 2026-04-30 20:22:00

శేషాచలాన్ని తలపించిన శుక్ర‌వార‌పుతోట‌..

మే  1న స్వర్ణరథోత్సవం..

తిరుపతి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు గురువారం భక్తి పరవశంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. మే 1న ఉదయం 9.30 గంటలకు స్వర్ణరథోత్సవం కన్నులపండువగా జరగనుండటం విశేషం.

వసంత ఋతువులో సూర్యుడు మేషరాశిలో అధిక ప్రభావంతో ప్రకాశిస్తాడని, ఈ సమయంలో వచ్చే వేడి వల్ల మనుషులకు అనేక శారీరక ఇబ్బందులు కలుగుతాయని భావిస్తారు. ఈ నేపథ్యంలో అమ్మవారిని వసంతోత్సవాల ద్వారా ఆరాధిస్తే భక్తులకు శారీరక, మానసిక శాంతి లభిస్తుందని విశ్వాసం.

ఉత్సవాల తొలి రోజున ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేసి అమ్మవారిని అలంకరించారు. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు.

ఈసారి శుక్రవారపు తోటను శేషాచలం అడవిని తలపించేలా ప్రత్యేకంగా అలంకరించారు. టీటీడీ ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పచ్చని చెట్లు, రంగురంగుల పుష్పాలు, జంతువుల ఆకృతులతో తోటను అందంగా తీర్చిదిద్దారు. ఆవు, దూడ, కోతి, నెమలి, హంసలు, చిలుకల రూపాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

ఈ అలంకరణ కోసం సుమారు 300 కేజీల వట్టి వేరు, 500 కేజీల సంప్రదాయ పుష్పాలు, 15 వేల కట్ ఫ్లవర్స్ వినియోగించారు. బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన నిపుణులతో పాటు టీటీడీ సిబ్బంది కలిసి ఈ అందమైన వాతావరణాన్ని సృష్టించారు. ఇదే సమయంలో అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు కూడా భక్తులను అలరించాయి.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యురాలు పణబాక లక్ష్మీ, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈవో దేవరాజులు, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్లు ముని చెంగల్రాయులు, రమేష్, సురేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ చలపతి తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి కటాక్షాలను పొందారు.

Spotlight

Read More →