High blood pressure: హైబీపీ బాధితులకు బంపర్ ఆఫర్.. ఇక రోజుకు ఒక మాత్ర అక్కర్లేదు.. ఏడాదికి రెండు ఇంజెక్షన్లు చాలు! Middle East War: ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్లు హతం... భారత్‍కు చేరుకున్న 345 మంది మత్స్యకారులు...! AP Govt: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్.. ఇలా.! Mrunal Thakur: సరిహద్దులు చెరిపేసే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నా.. మృణాల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.! 108 Services: నిమిషాల్లోనే ఘటనా స్థలికి అంబులెన్స్.. ప్రాణాలు నిలిపిన 108 ఈఎమ్‌టి (EMT) బృందం.! Iran War: స్టాక్ మార్కెట్ దెబ్బ.. పసిడికి అబ్బ.. యుద్ధ సమయంలోనూ ధరలు తగ్గడానికి గల 5 ప్రధాన కారణాలు.! AP Energy Hub: ఏపీ ఇక ఇంధన హబ్.. బయటపడ్డ భారీ నిక్షేపాలు! మన కష్టాలు తీరినట్లేనా.... Third Telugu State: అండమాన్ లో తెలుగు జెండా: మూడో తెలుగు రాష్ట్రంగా అవతరిస్తుందా? YS Jagan: మీడియాపై జగన్ విషం... జర్నలిస్ట్ సంఘాల తీవ్ర ఆగ్రహం! India - Russia Deals: ప్రపంచ రాజకీయాల్లో సంచలనం.... గయానా డీల్ తో చైనా కు బిగ్ షాక్! High blood pressure: హైబీపీ బాధితులకు బంపర్ ఆఫర్.. ఇక రోజుకు ఒక మాత్ర అక్కర్లేదు.. ఏడాదికి రెండు ఇంజెక్షన్లు చాలు! Middle East War: ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్లు హతం... భారత్‍కు చేరుకున్న 345 మంది మత్స్యకారులు...! AP Govt: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్.. ఇలా.! Mrunal Thakur: సరిహద్దులు చెరిపేసే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నా.. మృణాల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.! 108 Services: నిమిషాల్లోనే ఘటనా స్థలికి అంబులెన్స్.. ప్రాణాలు నిలిపిన 108 ఈఎమ్‌టి (EMT) బృందం.! Iran War: స్టాక్ మార్కెట్ దెబ్బ.. పసిడికి అబ్బ.. యుద్ధ సమయంలోనూ ధరలు తగ్గడానికి గల 5 ప్రధాన కారణాలు.! AP Energy Hub: ఏపీ ఇక ఇంధన హబ్.. బయటపడ్డ భారీ నిక్షేపాలు! మన కష్టాలు తీరినట్లేనా.... Third Telugu State: అండమాన్ లో తెలుగు జెండా: మూడో తెలుగు రాష్ట్రంగా అవతరిస్తుందా? YS Jagan: మీడియాపై జగన్ విషం... జర్నలిస్ట్ సంఘాల తీవ్ర ఆగ్రహం! India - Russia Deals: ప్రపంచ రాజకీయాల్లో సంచలనం.... గయానా డీల్ తో చైనా కు బిగ్ షాక్!

Vijay Kumar: చదరపు అడుగుకు రూ.14 వేలా? ఎక్కడి లెక్కలివి? జగన్ స్క్రిప్ట్ రీడింగ్‌పై విజయ్ కుమార్ సెటైర్లు.!

Vijay Kumar: అమరావతిపై జగన్ రెడ్డి అబద్ధపు లెక్కలు వేస్తున్నాడని ఏపీ బయో డైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

Published : 2026-04-04 21:00:00
  • Politics: "గూగుల్ లేదా ఏఐ వాడి వాస్తవాలు తెలుసుకో జగన్": ప్రెస్ మీట్లపై నీలాయపాలెం చురకలు..
     
  • "దేశమంతా ఒకవైపు.. వైసీపీ ఒక్కటే మరోవైపు": అమరావతి బిల్లుపై వాకౌట్‌ను తప్పుబట్టిన కూటమి నేత..

Vijay Kumar: అమరావతిపై జగన్ రెడ్డి అబద్ధపు లెక్కలు వేస్తున్నాడని ఏపీ బయో డైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘అమరావతి మీద జగన్ రెడ్డి చేస్తున్న అబద్ధాపు ప్రచారం గురించి మనం మాట్లాడకపోతే పార్లమెంట్‌లో మన విజయం పూర్తి కాదు. పార్లమెంట్‌లో అమరావతి బిల్లు చర్చ జరుగుతున్న నేపధ్యంలో జగన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీశారు. అమరావతి పేరు మీద భయాంకర స్కాం జరుగుతుంది.. ఇంతకన్నా స్కాం మరొటి ఉండదంటూ వైసీపీ మాట్లాడినప్పటికి ఎవరూ కూడా పట్టించుకోలేదు. ఒకవైపు అమరావతి బిల్లు మీద చర్చ జరుగుతున్న నేపధ్యంలో జగన్ రెడ్డి మాత్రం విషప్రచారం మాత్రం అపలేదు. జగన్ రెడ్డికి ఎవరూ స్క్రీప్ట్ రాసి ఇస్తారో తెలియదు కానీ, మీడియా ముందుకు రాగానే అలవోకగా అబద్ధాలు ఆడేస్తాడు. 

ఒక మాజీ సీఎం, పార్టీకి అధినేత అయి ఉండి ఒక అబద్ధాపు ప్రచారాలు చేయడం సరికాదు కాదా..? రాజధాని అమరావతిని అవినీతి రాజధానిగా చేయాలని జగన్ రెడ్డి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తునే ఉన్నాడు. జగన్ రెడ్డి ప్రచారం చేస్తున్న చదరపు అడుగుకి రూ.14 వేలు ఖర్చు చేస్తున్నారని ప్రచారం చేస్తున్నప్పటికీ అందులో సగం కూడా కూటమి ప్రభుత్వం ఖర్చు చేయట్లేదు. జగన్ రెడ్డి ఈ రకంగా ప్రజలను మోసం చేసేందుకు అనేక రకాలుగా కుట్రలు పన్నుతూనే ఉన్నాడు. మీ పార్టీకి ఓట్లు వేయని వారిని పక్కన పెట్టండి.. మీ పార్టీకి ఓటు వేసిన వారిని కూడా మోసం చేస్తే ఎలా..? పార్లమెంట్ నిర్మాణానికి రూ.1200 కోట్లు అయితే.. 970 కోట్లు ఖర్చు అయిందని జగన్ రెడ్డి అబద్ధాపు లెక్కలు చెప్పాడు. దేశ పార్లమెంట్ విషయంలో కూడా అబద్ధం చెప్పిన ఏకైక పార్టీ వైసీపీనే. ఈ లెక్కలు ఏవి కూడా జగన్ రెడ్డికి తెలియదు కదా.. ఎవరో రాసి ఇచ్చిన స్క్రీప్ట్‌ను చదువుతాడు.. అబద్ధాలు మాత్రం చెప్పేస్తాడు. 

పక్క రాష్ట్రాలతో పొల్చుతూ అమరావతిని తిట్టడం తప్ప.. జగన్ రెడ్డికి వేరే పని ఏమి లేదు. అమరావతి రూ.4,890 కోట్లతో 70 లక్షల చదరపు అడుగుల్లో కట్టడాలు జరుగుతున్నాయి. ఒక్కొక్క చదరపు అడుగుకి రూ.6,985లు ఖర్చు అవుతుంది. జగన్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్‌లలో ఒకసారి రూ.12 వేలు, మరోసారి రూ.14 వేలు చెప్పాడు. జగన్ రెడ్డి దేనిని అధారంగా తీసుకుని చెప్పారో ప్రజలకు తెలియజేయాలి. పార్లమెంట్ ఒక బిల్డింగ్.. నాలుగు అంతస్తులు ఉంటాయి. తెలంగాణ సెక్రటేరియల్ దాదాపు 10 అంతస్తులు ఉంటాయి. అమరావతి సెక్రటేరియట్ మాత్రం 5 టవర్లు.. మొదటి 4 టవర్లో ఒక్కొక్కటి జీ+40 ఉంటాయి. 5 టవర్లో జీ+46 ఉంటాయి. అందులోనే సీఎం కార్యాలయం కూడా ఉంటుంది. జగన్ రెడ్డి ఇలాంటి బాగా గుర్తు పెట్టుకోవాలి.. ఎందుకంటే జగన్ రెడ్డి తన జీవితకాలంలో ఇలాంటి కట్టడాలు కట్టాలేరు కాబట్టి.. ఎందుకు అమరావతి మీద ద్వేషం ఎందుకు..? ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తారా..? జగన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ను నేలమట్టం చేయాలని చూస్తున్నారు. 

ఆయనకు విజన్ ఉండదు.. పైకి పోయే శక్తి ఉండదు.. ఆలోచన అంత కంటే ఉండదు. కానీ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్‌ను అకాశం అంత ఎత్తుకు తీసుకువెళ్లాలని చూస్తున్నారు. జగన్ రెడ్డి ఆలోచనలు కనీసం బేస్ మెంట్ కూడా దాటావు. కానీ, మా ఆలోచన మాత్రం 50వ అంతస్తులో ఉంటాయి. రాష్ట్ర ప్రజలు దయచేసి గమనించాలి.. జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మీద అనేక రకాలుగా విషప్రచారం చేస్తున్నారు. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్‌లో కొండను తవ్వేసి ‘‘రుషికొండ ఫ్యాలెస్’’ నిర్మాణం చేసుకున్నాడు. దీనికి ఒక్కొక్క చదరపు అడుగుకు రూ.35 వేలు ఖర్చు చేశాడు. కేవలం రూ.240 కోట్లు మాత్రమే ఖర్చు చేశానని పదిసార్లు చెప్పాడు. కానీ, కాగ్ మాత్రం రూ.500 కోట్లకు పైగా ఖర్చు చేశావని రిపోర్టు ఇచ్చింది వాస్తవం కాదా..? నువ్వు కూడా అమరావతిలో నిర్మాణాల ఖర్చు గురించి మాట్లాడుతున్నావా జగన్ రెడ్డి..? ఏదైనా ప్రెస్ మీట్ నిర్వహించే ముందుకు కాస్త గూగుల్ లేదా ఏఐలను వాడండి.. వాస్తవాలు తెలుస్తాయి. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణలో సెక్రటేరియట్ నిర్మాణాన్ని 2021 కోవిడ్ తరువాత మొదలుపెట్టి.. 2023 నాటికి పూర్తి చేశారు. 

మరి అప్పుడు మీ పాలన సమయంలో ఏమి చేశారో సమాధానం చెప్పాగలరా..? ఇప్పుడు వచ్చి ‘‘మవిగన్’’ అంటూ.. అప్పుడు అధికారంలో ఉండి ఏమి చేశావ్..? అది రాష్ట్ర ప్రజలు గమినించారు కాబట్టే మీరు 11 సీట్లు ఇచ్చారు. అధికారం దిగిపోయిన తరువాత ప్లాన్ బీ అంటున్నావ్.. అంటే అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న ప్లాన్ ఏ ఎందుకు పనికి రాదనే ఉద్దేశ్యమా..? ప్లాన్ బీ అని మాట్లాడే ముందు అమరావతి రైతులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పు మాట్లాడు.. మీ పార్టీ నాయకులే మిమ్మల్ని తిడుతుంటే ప్లాన్ బీ అంటే ఏముంది.? పార్లమెంట్ లో భారతదేశంలోని అన్ని పార్టీలు అమరావతికి మద్దతు పలికితే.. వైసీపీ మాత్రం వాకౌట్ చేసింది. దీనిబట్టి అర్ధం చేసుకోవాల్సింది ఏంటంటే.. దేశమంతా ఒకవైపు.. వైసీపీ ఒక్క వైపు ఉంది’’ అని అన్నారు.

Spotlight

Read More →