Ashu reddy: నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే.! కన్నీళ్లు పెట్టుకున్న అషు రెడ్డి... Cricket: వరల్డ్ కప్ తర్వాత కెనడా కీలక నిర్ణయం.. హెడ్ కోచ్‌గా అనుభవజ్ఞుడైన మాంటీ దేశాయ్ నియామకం. Flipkart Sale: ఏసీ ఫీలింగ్ ఇచ్చే హింద్‌వేర్ భారీ కూలర్.. ఇప్పుడు సగం ధరకే! ఎగబడుతున్న జనం.... Guntur Brigde: మరో కొద్ది రోజులే.. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనుల్లో వేగం- కేంద్ర మంత్రి పెమ్మసాని! Nara Rohit: తండ్రిగా ప్రమోషన్ పొందబోతున్న నారా రోహిత్.. నారా ఇంట్లో వెలగనున్న సరికొత్త వెలుగులు.! Balakrishna: రాజధాని నిర్మాణం హడావుడి కాదు.. ఓ దార్శనికత! అమరావతిపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. Phone Battery: యూజర్లకు అలర్ట్.. మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? కొత్త ఫోన్ కొనాల్సిన పని లేదు! ఈ టిప్స్ పాటిస్తే చాలు.. US Iran Conflict: 60 రోజుల డెడ్ లైన్... వైట్ హౌస్ ను వణికిస్తున్న కొత్త చట్టం! Nara Lokesh: తల్లీకొడుకుల అద్భుత విజయం - ఒకేసారి టెన్త్ పాస్.. ఫిదా అయిన మంత్రి నారా లోకేష్.! Chandrababu: ఆఫీసర్లు మారాలి.. లేదంటే ఇంటికే! ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం ఆఖరి వార్నింగ్! Ashu reddy: నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే.! కన్నీళ్లు పెట్టుకున్న అషు రెడ్డి... Cricket: వరల్డ్ కప్ తర్వాత కెనడా కీలక నిర్ణయం.. హెడ్ కోచ్‌గా అనుభవజ్ఞుడైన మాంటీ దేశాయ్ నియామకం. Flipkart Sale: ఏసీ ఫీలింగ్ ఇచ్చే హింద్‌వేర్ భారీ కూలర్.. ఇప్పుడు సగం ధరకే! ఎగబడుతున్న జనం.... Guntur Brigde: మరో కొద్ది రోజులే.. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనుల్లో వేగం- కేంద్ర మంత్రి పెమ్మసాని! Nara Rohit: తండ్రిగా ప్రమోషన్ పొందబోతున్న నారా రోహిత్.. నారా ఇంట్లో వెలగనున్న సరికొత్త వెలుగులు.! Balakrishna: రాజధాని నిర్మాణం హడావుడి కాదు.. ఓ దార్శనికత! అమరావతిపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. Phone Battery: యూజర్లకు అలర్ట్.. మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? కొత్త ఫోన్ కొనాల్సిన పని లేదు! ఈ టిప్స్ పాటిస్తే చాలు.. US Iran Conflict: 60 రోజుల డెడ్ లైన్... వైట్ హౌస్ ను వణికిస్తున్న కొత్త చట్టం! Nara Lokesh: తల్లీకొడుకుల అద్భుత విజయం - ఒకేసారి టెన్త్ పాస్.. ఫిదా అయిన మంత్రి నారా లోకేష్.! Chandrababu: ఆఫీసర్లు మారాలి.. లేదంటే ఇంటికే! ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం ఆఖరి వార్నింగ్!

Revanth Reddy: 46 ఏళ్లలో ఒక్క మహిళా అధ్యక్షురాలు లేకపోవడంపై రేవంత్ రెడ్డి ఫైర్! 15 మంది అధ్యక్షులు మారారు కానీ..

Revanth Reddy: బీజేపీ ఏర్పడి 46 సంవత్సరాలైనప్పటికీ ఇప్పటి వరకు అధ్యక్షురాలిగా మహిళను నియమించలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 1980 ఏప్రిల్ 6న బీజేపీ ఆవిర్భవించిందని, ఇప్పటి వరకు 15 మంది బీజేపీ అధ్యక్షుల నియామకం జరిగిందని అన్నారు. కానీ ఒక్కసారి కూడా మహిళకు అధ్యక్ష పదవి అప్పగించలేదని విమర్శించారు.

Published : 2026-04-13 20:20:00
  • బండి సంజయ్‌కు రేవంత్ సవాల్: మహిళా అధ్యక్షురాలిని నియమించాకే మహిళా సంక్షేమం గురించి మాట్లాడండి...
     
  • Politics: "బీజేపీ దృష్టిలో మహిళలు ద్వితీయ శ్రేణి పౌరులే": బీజేపీ వ్యవస్థాగత పదవులపై సీఎం సంచలన వ్యాఖ్యలు..

Revanth Reddy: భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 46 ఏళ్లు గడుస్తున్నా, ఇప్పటి వరకు ఒక్క మహిళను కూడా అధ్యక్షురాలిగా నియమించకపోవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 1980 ఏప్రిల్ 6న బీజేపీ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు 15 మంది అధ్యక్షులు మారినప్పటికీ, మహిళలకు ఆ పదవి దక్కలేదని ఆయన గుర్తు చేశారు. మహిళల పట్ల బీజేపీకి ఉన్న గౌరవం, చిత్తశుద్ధి కేవలం మాటలకే పరిమితమని ఈ పరిణామం స్పష్టం చేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ఇందిరా గాంధీ, సోనియా గాంధీ వంటి మహిళా మూర్తుల నాయకత్వంలో దశాబ్దాల కాలం పనిచేసిన కాంగ్రెస్ పార్టీ మహిళలకు అన్యాయం చేస్తుందనడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. బీజేపీ నేత బండి సంజయ్ మహిళా సంక్షేమం గురించి మాట్లాడే ముందు, తమ పార్టీకి మహిళా అధ్యక్షురాలిని నియమించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

బండి సంజయ్ వ్యాఖ్యలు దక్షిణాది రాష్ట్రాలలోని ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా వ్యతిరేక ధోరణిని ప్రతిబింబిస్తున్నాయని ముఖ్యమంత్రి ఆరోపించారు. బీజేపీలో మహిళలకు అధ్యక్ష పదవి కాదు కదా, కనీసం జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ వంటి కీలక బాధ్యతలు కూడా అప్పగించలేదని ఆయన విమర్శించారు. మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటమే బీజేపీ నైజమని, 60 ఏళ్ల పాలనలో మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందని వివరించారు. దేశానికి స్వాతంత్రం, రాజ్యాంగం మరియు మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్‌దేనని, ఇప్పుడు దేశాన్ని కాపాడుకునే బాధ్యతను కూడా తామే భుజాన వేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

రాబోయే నియోజకవర్గాల పునర్విభజన అంశంపై రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణను సాధించిన కాంగ్రెస్ ఎంపీలు, పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా పార్లమెంటులో పోరాడుతారని స్పష్టం చేశారు. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, పంజాబ్ వంటి చిన్న రాష్ట్రాలను ఏకం చేస్తామని, అందరికీ లేఖలు రాసి రాజకీయ పోరాటానికి సిద్ధం చేస్తామని వెల్లడించారు. జనాభా ప్రాతిపదికన సీట్ల పునర్విభజన జరిగితే దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గిపోతుందని, అప్పుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి నేతలు ఢిల్లీలో మోదీ నివాసం వద్ద నిస్సహాయంగా నిలబడాల్సి వస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. పార్లమెంటులో ఈ బిల్లును ఎలా ఆమోదిస్తారో తాము కూడా చూస్తామంటూ ఆయన కేంద్రానికి సవాల్ విసిరారు.

Spotlight

Read More →