Agriculture News: అన్నదాతలకు సర్కార్ కానుక.. రెండో విడత రైతు భరోసా డేట్ ఫిక్స్. 2026 New Cars: ఇక పెద్ద ఫ్యామిలీలకు పండగే.. 2026లో 10 కొత్త 7-సీటర్ కార్లు వస్తున్నాయ్! Kuttu Dahi Bhalla: చిటికెలో సిద్ధమయ్యే స్నాక్: కుట్టు పిండితో దహీ భల్లా.. తయారీ విధానం చాలా సులభం, ఆరోగ్యం కూడా.! AA22 Movie Updates: బన్నీ ఫ్యాన్స్‌కు పూనకాలే.. అట్లీ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది! Special Trains: నరసాపురం & అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వారికి సీట్ల లభ్యత పెంపు.. Tollywood: ఒకే ఒక్క సినిమా.. చెరగని ముద్ర.! చిన్నప్పుడే కాదు ఇప్పటీకీ అదే క్యూట్‌నెస్.. సోషల్ మీడియాలో వైరల్! AP Government Schemes: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అంగన్‌వాడీల్లో ఇక ఇండక్షన్ స్టవ్‌లతోనే వంట.! Jio New Plan: నెలవారీ రీఛార్జ్ టెన్షన్‌కు జియో చెక్: రూ. 339 ప్లాన్ పూర్తి వివరాలు! Mango Pulihora: "ఆహా ఏమి రుచి": ఈ వేసవిలో పచ్చి మామిడికాయ పులిహోర.. ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది! 90 నిమిషాల్లో అమరావతి టు హైదరాబాద్.. హైస్పీడ్ రైల్ కారిడార్ డ్రాఫ్ట్ ప్లాన్ సిద్ధం! Agriculture News: అన్నదాతలకు సర్కార్ కానుక.. రెండో విడత రైతు భరోసా డేట్ ఫిక్స్. 2026 New Cars: ఇక పెద్ద ఫ్యామిలీలకు పండగే.. 2026లో 10 కొత్త 7-సీటర్ కార్లు వస్తున్నాయ్! Kuttu Dahi Bhalla: చిటికెలో సిద్ధమయ్యే స్నాక్: కుట్టు పిండితో దహీ భల్లా.. తయారీ విధానం చాలా సులభం, ఆరోగ్యం కూడా.! AA22 Movie Updates: బన్నీ ఫ్యాన్స్‌కు పూనకాలే.. అట్లీ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది! Special Trains: నరసాపురం & అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వారికి సీట్ల లభ్యత పెంపు.. Tollywood: ఒకే ఒక్క సినిమా.. చెరగని ముద్ర.! చిన్నప్పుడే కాదు ఇప్పటీకీ అదే క్యూట్‌నెస్.. సోషల్ మీడియాలో వైరల్! AP Government Schemes: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అంగన్‌వాడీల్లో ఇక ఇండక్షన్ స్టవ్‌లతోనే వంట.! Jio New Plan: నెలవారీ రీఛార్జ్ టెన్షన్‌కు జియో చెక్: రూ. 339 ప్లాన్ పూర్తి వివరాలు! Mango Pulihora: "ఆహా ఏమి రుచి": ఈ వేసవిలో పచ్చి మామిడికాయ పులిహోర.. ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది! 90 నిమిషాల్లో అమరావతి టు హైదరాబాద్.. హైస్పీడ్ రైల్ కారిడార్ డ్రాఫ్ట్ ప్లాన్ సిద్ధం!

Mrunal Thakur: సరిహద్దులు చెరిపేసే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నా.. మృణాల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Mrunal Thakur: 'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి మృణాల్ ఠాకూర్, తన ప్రేమ అభిప్రాయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హద్దులు దాటేంత పిచ్చి ప్రేమలో పడాలనుందని, తన కోసం అన్ని సరిహద్దులు చెరిపేసే వ్యక్తి ఇంకా తన జీవితంలోకి రాలేదని ఆమె అన్నారు.

Published : 2026-04-05 23:00:00
  • "అన్ని హద్దులు దాటి ప్రేమిస్తా": అడివి శేష్ మూవీ ప్రమోషన్లలో మృణాల్ సెన్సేషనల్ వ్యాఖ్యలు..
     
  • Cinema: "ప్రేమలో పడితే నేనే చెబుతా": రూమర్ రాయుళ్లకు మృణాల్ ఠాకూర్ స్ట్రాంగ్ కౌంటర్..

Mrunal Thakur: 'సీతారామం' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో 'సీతమ్మ'గా సుస్థిర స్థానం సంపాదించుకున్న నటి మృణాల్ ఠాకూర్, తన వ్యక్తిగత జీవితం మరియు ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముంబైలో అడివి శేష్‌తో కలిసి నటిస్తున్న 'డెకాయిట్' (Decoit) చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె, తన మనసులోని మాటను బయటపెట్టారు. హద్దులు దాటేంత పిచ్చి ప్రేమలో పడాలని తనకు ఉందని, తన కోసం అన్ని సరిహద్దులను చెరిపేసే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అటువంటి వ్యక్తి తన జీవితంలోకి ఇంకా రాలేదని, ఒకవేళ భవిష్యత్తులో అలాంటి వాడు వస్తే ఆ విషయాన్ని తానే స్వయంగా అందరికీ చెబుతానని మృణాల్ నవ్వుతూ సమాధానమిచ్చారు.

టెలివిజన్ రంగం నుంచి వెండితెరకు పరిచయమైన మృణాల్, 'కుంకుమ్ భాగ్య' సీరియల్ ద్వారా కెరీర్ ప్రారంభించి 'సూపర్ 30', 'జెర్సీ' వంటి హిందీ చిత్రాలతో గుర్తింపు పొందారు. అయితే 'సీతారామం'లో ఆమె పోషించిన సీత పాత్ర ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న 'డెకాయిట్' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. షానీల్ డియో దర్శకత్వంలో, సువిన్ ఎస్. సోమశేఖర్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా ఏప్రిల్ 10న (ఏప్రిల్ 2026) థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా మృణాల్ చేసిన ఈ 'ప్రేమ' వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరోవైపు, గత కొంతకాలంగా మృణాల్ ఠాకూర్ వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్‌తో ఆమె డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇటీవలే ఒక బహిరంగ కార్యక్రమంలో వీరిద్దరూ జంటగా కనిపించడంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. అయితే, తన తాజా ఇంటర్వ్యూలో "ప్రేమించే వ్యక్తి ఇంకా రాలేదు" అని మృణాల్ అనడంతో, ధనుష్‌తో వస్తున్న వార్తలు కేవలం పుకార్లేనని పరోక్షంగా స్పష్టం చేసినట్లయింది. ఇప్పటివరకు ఈ అంశంపై అటు మృణాల్ గానీ, ఇటు ధనుష్ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Spotlight

Read More →