Prajavedhika: లక్షకు పదివేల ఆశ.. కట్ చేస్తే రూ. 47 లక్షలు మాయం! 16 గజాల కోసం... 14 నెలలుగా పోలీసులకు చిక్కని ఆ 'గోడ' రహస్యం! AndhraPradesh: ఏపీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా... ఎందుకంటే! Ayush Centers: ఏపీలో ఆ ప్రాంతాల ప్రజలకు శుభవార్త! రూ.44 కోట్లతో 150 కేంద్రాలు... రెండు నెలల్లో అందుబాటులోకి... YCP: పార్లమెంటులో ఇంట్రెస్టింగ్ సీన్! చేదు జ్ఞాపకాలు వద్దు.. 11వ రూమ్ తాళం వద్దన్న వైసీపీ నేతలు! Jal Jeevan Mission 2.0: 2028 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి.. జేజేఎం 2.0పై కేంద్ర, ఏపీ సర్కార్ ఒప్పందం! PMAY Scheme: ఏపీలో పేదల ఇళ్లకు లైన్ క్లియర్.... పీఎంఏవై లబ్ధిదారుల తుది జాబితా! FCRA Renewal: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు... ఆర్‌డీటీకి గ్రీన్ సిగ్నల్! నిధుల కొరతకు ఇక చెక్! LPG Vessels: హర్మూజ్ జలసంధి వద్ద టెన్షన్... గల్ఫ్‌లో నిలిచిపోయిన ఆరు భారీ ఎల్‌పీజీ నౌకలు! US vs Iran: పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్ రహస్య చర్చలు? వైట్ హౌస్ సంచలన ప్రకటన! Nara Bhuvaneshwari: కుప్పంలో నారా భువనేశ్వరి నాలుగు రోజుల పర్యటన ప్రారంభం! Prajavedhika: లక్షకు పదివేల ఆశ.. కట్ చేస్తే రూ. 47 లక్షలు మాయం! 16 గజాల కోసం... 14 నెలలుగా పోలీసులకు చిక్కని ఆ 'గోడ' రహస్యం! AndhraPradesh: ఏపీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా... ఎందుకంటే! Ayush Centers: ఏపీలో ఆ ప్రాంతాల ప్రజలకు శుభవార్త! రూ.44 కోట్లతో 150 కేంద్రాలు... రెండు నెలల్లో అందుబాటులోకి... YCP: పార్లమెంటులో ఇంట్రెస్టింగ్ సీన్! చేదు జ్ఞాపకాలు వద్దు.. 11వ రూమ్ తాళం వద్దన్న వైసీపీ నేతలు! Jal Jeevan Mission 2.0: 2028 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి.. జేజేఎం 2.0పై కేంద్ర, ఏపీ సర్కార్ ఒప్పందం! PMAY Scheme: ఏపీలో పేదల ఇళ్లకు లైన్ క్లియర్.... పీఎంఏవై లబ్ధిదారుల తుది జాబితా! FCRA Renewal: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు... ఆర్‌డీటీకి గ్రీన్ సిగ్నల్! నిధుల కొరతకు ఇక చెక్! LPG Vessels: హర్మూజ్ జలసంధి వద్ద టెన్షన్... గల్ఫ్‌లో నిలిచిపోయిన ఆరు భారీ ఎల్‌పీజీ నౌకలు! US vs Iran: పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్ రహస్య చర్చలు? వైట్ హౌస్ సంచలన ప్రకటన! Nara Bhuvaneshwari: కుప్పంలో నారా భువనేశ్వరి నాలుగు రోజుల పర్యటన ప్రారంభం!

Canada: కెనడా సూపర్ వీసా నిబంధనల్లో మార్పులు… భారతీయులకు భారీ ఊరట!

Canada Super Visa: కెనడా లో ఉన్న భారతీయులు సహా అనేక దేశాల వలసదారులకు కెనడా ప్రభుత్వం తీపికబురు. కొత్త మార్పులు 2026 మార్చి 31 నుంచి అమల్లోకి..

Published : 2026-03-24 14:48:00

సూపర్ వీసా నిబంధనల్లో సడలింపులు.. 

కొత్త మార్పులు 2026 మార్చి 31 నుంచి అమల్లోకి.. 

అవసరమైన డాక్యుమెంట్ లు ఇవే.. 

కెనడా లో ఉన్న భారతీయులు సహా అనేక దేశాల వలసదారులకు కెనడా ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులు, తాతమ్మల కోసం ఇచ్చే సూపర్ వీసా నిబంధనల్లో సడలింపులు ప్రకటించింది. ఈ కొత్త మార్పులు 2026 మార్చి 31 నుంచి అమల్లోకి రానున్నాయి.

సూపర్ వీసా అంటే ఏమిటి? 
కెనడాలో సూపర్ వీసా ద్వారా తల్లిదండ్రులు(Parents), అమ్మమ్మ తాతయ్యాలు (Grand Parents) తమ పిల్లలను కలుసుకోవచ్చు. ఈ వీసా 10 సంవత్సరాల వరకు మల్టిపుల్ ఎంట్రీ సౌకర్యాన్ని ఇస్తుంది. ఒక్కసారి వెళ్లినప్పుడు గరిష్టంగా 5 సంవత్సరాల వరకు అక్కడ ఉండే అవకాశం ఉంటుంది.

ఆదాయ నిబంధనల్లో కొత్త మార్పులు 
ఇప్పటి వరకు సూపర్ వీసాకు స్పాన్సర్ చేసే వ్యక్తి (హోస్ట్) ఒకే ఏడాది ఆదాయాన్ని చూపించి కనీస ఆదాయ ప్రమాణాలను (Low Income Cut-Off) చేరుకోవాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వం రెండు కొత్త మార్గాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

1. రెండు సంవత్సరాల ఆదాయం పరిగణనలోకి
ఇకపై హోస్ట్ గత రెండు పన్ను సంవత్సరాల్లో ఏదైనా ఒక సంవత్సరంలో కనీస ఆదాయాన్ని చేరుకుంటే సరిపోతుంది. ఈ నిర్ణయం చాలామందికి పెద్ద ఊరటగా మారింది.

2. తల్లిదండ్రుల ఆదాయం కూడా కలుపుకునే అవకాశం 
కొత్త నిబంధనల ప్రకారం, హోస్ట్ ఆదాయానికి తోడు సందర్శనకు వచ్చే తల్లిదండ్రులు లేదా అమ్మమ్మ తాతల ఆదాయంలో కొంత భాగాన్ని కూడా కలుపుకోవచ్చు. అయితే ముందుగా హోస్ట్, కో-సైనర్ కనీస స్థాయి ఆదాయం చూపాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన భాగాన్ని తల్లిదండ్రుల ఆదాయంతో పూర్తి చేయవచ్చు.

ఎవరికి వర్తిస్తాయి?
2026 మార్చి 31 తర్వాత దాఖలు చేసే దరఖాస్తులతో పాటు, ఇప్పటికే పరిశీలనలో ఉన్న అప్లికేషన్లకూ ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఇప్పటికే అర్హత సాధించిన వారు కూడా ఈ మార్పులతో కొనసాగవచ్చు.

అవసరమైన డాక్యుమెంట్స్ 
కొత్త విధానాల ప్రకారం అప్లై చేయాలంటే ఆదాయం నిరూపించే డాక్యుమెంట్లు తప్పనిసరి. వీటిలో ట్యాక్స్ అసెస్‌మెంట్లు, సాలరీ స్లిప్స్, ఎంప్లాయర్ లెటర్ లు, ఇతర ఆదాయ ఆధారాలు ఉంటాయి.

ఇతర అర్హతలు
* కుటుంబ పరిమాణం ఆధారంగా కనీస ఆదాయం ఉండాలి (ఒక వ్యక్తి కుటుంబానికి సుమారు CA $30,526 నుంచి ప్రారంభం అవుతుంది)
* దరఖాస్తు కెనడా వెలుపల నుంచి చేయాలి
* మెడికల్ పరీక్ష తప్పనిసరి
* కనీసం ఒక సంవత్సరం చెల్లుబాటు అయ్యే ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి

సూపర్ వీసా ప్రస్తుతం తల్లిదండ్రులు, తాతమ్మల ప్రోగ్రామ్‌కు ప్రత్యామ్నాయంగా మారింది. ఆ ప్రోగ్రామ్ 2020 నుంచి కొత్త అప్లికేషన్లను తీసుకోలేదు. దీంతో ఈ మార్పులు కీలకంగా మారాయి.

కొత్త సడలింపులతో కెనడాలో ఉన్న కుటుంబాలకు తల్లిదండ్రులను దగ్గరగా ఉంచుకోవడం మరింత సులభం కానుంది. ఒకవైపు ఆర్థిక ప్రమాణాలను కాపాడుతూ, మరోవైపు కుటుంబ బంధాలను బలపరచే ప్రయత్నంగా ఈ నిర్ణయం కనిపిస్తోంది.
 

Spotlight

Read More →