High blood pressure: హైబీపీ బాధితులకు బంపర్ ఆఫర్.. ఇక రోజుకు ఒక మాత్ర అక్కర్లేదు.. ఏడాదికి రెండు ఇంజెక్షన్లు చాలు! Middle East War: ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్లు హతం... భారత్‍కు చేరుకున్న 345 మంది మత్స్యకారులు...! AP Govt: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్.. ఇలా.! Mrunal Thakur: సరిహద్దులు చెరిపేసే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నా.. మృణాల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.! 108 Services: నిమిషాల్లోనే ఘటనా స్థలికి అంబులెన్స్.. ప్రాణాలు నిలిపిన 108 ఈఎమ్‌టి (EMT) బృందం.! Iran War: స్టాక్ మార్కెట్ దెబ్బ.. పసిడికి అబ్బ.. యుద్ధ సమయంలోనూ ధరలు తగ్గడానికి గల 5 ప్రధాన కారణాలు.! AP Energy Hub: ఏపీ ఇక ఇంధన హబ్.. బయటపడ్డ భారీ నిక్షేపాలు! మన కష్టాలు తీరినట్లేనా.... Third Telugu State: అండమాన్ లో తెలుగు జెండా: మూడో తెలుగు రాష్ట్రంగా అవతరిస్తుందా? YS Jagan: మీడియాపై జగన్ విషం... జర్నలిస్ట్ సంఘాల తీవ్ర ఆగ్రహం! India - Russia Deals: ప్రపంచ రాజకీయాల్లో సంచలనం.... గయానా డీల్ తో చైనా కు బిగ్ షాక్! High blood pressure: హైబీపీ బాధితులకు బంపర్ ఆఫర్.. ఇక రోజుకు ఒక మాత్ర అక్కర్లేదు.. ఏడాదికి రెండు ఇంజెక్షన్లు చాలు! Middle East War: ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్లు హతం... భారత్‍కు చేరుకున్న 345 మంది మత్స్యకారులు...! AP Govt: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్.. ఇలా.! Mrunal Thakur: సరిహద్దులు చెరిపేసే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నా.. మృణాల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.! 108 Services: నిమిషాల్లోనే ఘటనా స్థలికి అంబులెన్స్.. ప్రాణాలు నిలిపిన 108 ఈఎమ్‌టి (EMT) బృందం.! Iran War: స్టాక్ మార్కెట్ దెబ్బ.. పసిడికి అబ్బ.. యుద్ధ సమయంలోనూ ధరలు తగ్గడానికి గల 5 ప్రధాన కారణాలు.! AP Energy Hub: ఏపీ ఇక ఇంధన హబ్.. బయటపడ్డ భారీ నిక్షేపాలు! మన కష్టాలు తీరినట్లేనా.... Third Telugu State: అండమాన్ లో తెలుగు జెండా: మూడో తెలుగు రాష్ట్రంగా అవతరిస్తుందా? YS Jagan: మీడియాపై జగన్ విషం... జర్నలిస్ట్ సంఘాల తీవ్ర ఆగ్రహం! India - Russia Deals: ప్రపంచ రాజకీయాల్లో సంచలనం.... గయానా డీల్ తో చైనా కు బిగ్ షాక్!

AP Ration Card Updates: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఇక మీసేవ కేంద్రాల్లోనే మార్పులు, చేర్పులు!

AP Ration Card Updates: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుదారులకు ఊరటనిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రేషన్ కార్డులో కొత్త సభ్యుల చేరిక, పేర్ల తొలగింపు, తప్పుల సవరణ వంటి 9 రకాల సేవలను మీసేవ కేంద్రాల్లోనే పొందవచ్చు.

Published : 2026-04-04 18:21:00

AP Ration Card Updates: రేషన్ కార్డు వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. ఇకపై కార్డులో పేర్లు మార్చుకోవాలన్నా, కొత్త సభ్యులను చేర్చుకోవాలన్నా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ ఇంటికి దగ్గరలో ఉండే 'మీసేవ' కేంద్రాల్లోనే ఈ పనులన్నీ చక్కబెట్టుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.

గత కొన్నేళ్లుగా రేషన్ కార్డుల్లో మార్పులు చేయాలంటే కేవలం సచివాలయాల ద్వారానే సాధ్యమయ్యేది. దీనివల్ల చాలామంది ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో సామాన్య ప్రజలకు పెద్ద ఉపశమనం లభించినట్లయింది. మొత్తం తొమ్మిది రకాల సేవలను మీసేవ కేంద్రాల పరిధిలోకి తీసుకువచ్చారు. దీనివల్ల పనుల వేగం పెరగడమే కాకుండా, ప్రజలకు సమయం కూడా ఆదా అవుతుంది.

ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన మహిళలు తమ పుట్టింటి కార్డు నుంచి పేరు తొలగించి, అత్తగారి ఇంటి కార్డులో పేరు చేర్చుకోవడానికి ఇప్పుడు మార్గం సుగమమైంది. అలాగే ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి పేరు తొలగించడం, ఆధార్ కార్డు లింక్ చేయడం, తప్పుగా ఉన్న వివరాలను సరిదిద్దడం వంటి పనులన్నీ మీసేవలో చేసుకోవచ్చు. అయితే కొత్త కార్డుల జారీ  కార్డు విభజన (స్ప్లిట్) వంటి సేవలు మాత్రం ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సేవలు పొందాలనుకునే వారు కొన్ని ముఖ్యమైన పత్రాలను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. కొత్త సభ్యులను చేర్చాలంటే ఆధార్ కార్డుతో పాటు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం లేదా పెళ్లి పత్రిక వంటివి అవసరమవుతాయి. వివరాల మార్పు కోసం విద్యా ధృవీకరణ పత్రాలు కూడా అడిగే అవకాశం ఉంది. మీ దగ్గర ఉన్న ఆధారాలను బట్టి మీసేవ నిర్వాహకులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అటు ప్రజలు, ఇటు మీసేవ కేంద్రాల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా నిలిచిపోయిన ఈ ప్రక్రియ మళ్ళీ అందుబాటులోకి రావడంతో లక్షలాది మందికి లబ్ధి చేకూరనుంది. మీకు కూడా రేషన్ కార్డులో ఏవైనా సవరణలు ఉంటే, వెంటనే మీ దగ్గరలోని మీసేవ కేంద్రాన్ని సంప్రదించి ఈ అవకాశాన్ని వాడుకోండి.

Spotlight

Read More →