Customs Rules: అమెరికా వెళ్లే తల్లిదండ్రులకు హెచ్చరిక... అవి లేకపోతే ఎయిర్‌పోర్టు నుండే వాపస్! TAGDV: డెలావేర్ వ్యాలీలో ఘనంగా సాగిన టిఎజిడివి ఉగాది వేడుకలు.. వెయ్యిమందికి పైగా తెలుగు వారి సందడి! Indian Cargo Ship: డ్రోన్ దాడితో చెలరేగిన మంటలు... సముద్ర గర్భంలోకి 'హాజీ అలీ' నౌక!! NATS: న్యూజెర్సీలో ఘనంగా జరగనున్న ‘నాట్స్ కల్చరల్ ఫెస్టివల్’! MATA: మే 31న ‘మాటా’ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ మెడికల్ విద్యా కార్యక్రమం! TAMPA: టంపాలో ఘనంగా అన్నమయ్య 618వ జయంతి ఆరాధనోత్సవాలు! తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం! Gun Shooting: కెనడా లో కాల్పుల కలకలం... ఇద్దరు భారతీయ సంతతి మృతి! Saudi Arabia: ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా ‘మినీ మహానాడు’.. పసుపుమయమైన దమ్మమ్‌లో టీడీపీ శ్రేణుల సందడి! Trump: డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన... ప్రపంచ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు! Strait Of Hormuz: హార్ముజ్ జలసంధిలో హై అలర్ట్... ఉపాధి కోసం వెళ్లి శవమై వస్తున్న భారతీయ నావికుడు!! Customs Rules: అమెరికా వెళ్లే తల్లిదండ్రులకు హెచ్చరిక... అవి లేకపోతే ఎయిర్‌పోర్టు నుండే వాపస్! TAGDV: డెలావేర్ వ్యాలీలో ఘనంగా సాగిన టిఎజిడివి ఉగాది వేడుకలు.. వెయ్యిమందికి పైగా తెలుగు వారి సందడి! Indian Cargo Ship: డ్రోన్ దాడితో చెలరేగిన మంటలు... సముద్ర గర్భంలోకి 'హాజీ అలీ' నౌక!! NATS: న్యూజెర్సీలో ఘనంగా జరగనున్న ‘నాట్స్ కల్చరల్ ఫెస్టివల్’! MATA: మే 31న ‘మాటా’ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ మెడికల్ విద్యా కార్యక్రమం! TAMPA: టంపాలో ఘనంగా అన్నమయ్య 618వ జయంతి ఆరాధనోత్సవాలు! తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం! Gun Shooting: కెనడా లో కాల్పుల కలకలం... ఇద్దరు భారతీయ సంతతి మృతి! Saudi Arabia: ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా ‘మినీ మహానాడు’.. పసుపుమయమైన దమ్మమ్‌లో టీడీపీ శ్రేణుల సందడి! Trump: డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన... ప్రపంచ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు! Strait Of Hormuz: హార్ముజ్ జలసంధిలో హై అలర్ట్... ఉపాధి కోసం వెళ్లి శవమై వస్తున్న భారతీయ నావికుడు!!

MATA: మే 31న ‘మాటా’ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ మెడికల్ విద్యా కార్యక్రమం!

MATA: మన అమెరికా తెలుగు సంఘం (MATA) మెడికల్ విభాగం ఆధ్వర్యంలో వైద్య రంగ నిపుణులు, విద్యార్థులు, హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్‌కు ఉపయోగపడేలా మే 31, 2026న ప్రత్యేక ఆన్‌లైన్ కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్ (CME) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

Published : 2026-05-14 10:47:44

విద్యార్థులకు రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం..

విద్యార్థులు, హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్‌కు ఉపయోగపడేలా..

మన అమెరికా తెలుగు సంఘం (MATA) మెడికల్ విభాగం ఆధ్వర్యంలో వైద్య రంగ నిపుణులు, విద్యార్థులు, హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్‌కు ఉపయోగపడేలా మే 31, 2026న ప్రత్యేక ఆన్‌లైన్ కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్ (CME) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జూమ్ వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో ప్రపంచ స్థాయి వైద్య నిపుణులు పాల్గొని తాజా వైద్య సాంకేతిక పరిజ్ఞానం, ఆరోగ్య రంగ అభివృద్ధులపై కీలక అంశాలను వివరించనున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్య శాస్త్రవేత్త, నోబెల్ ప్రైజ్ నామినీ డాక్టర్ ఎం.ఎస్. రెడ్డి ముఖ్య వక్తగా హాజరుకానున్నారు. 150కి పైగా అంతర్జాతీయ పేటెంట్లు సాధించిన ఆయన “అప్లికేషన్ ఆఫ్ ప్రోబయోటిక్స్” అంశంపై ప్రసంగించనున్నారు. ఆరోగ్య సంరక్షణలో ప్రోబయోటిక్స్ ప్రాముఖ్యత, భవిష్యత్తులో వాటి వినియోగంపై ఆయన వివరించనున్నారు.

అలాగే ప్రముఖ నిపుణుడు డాక్టర్ వి. “బాల” బాలసుబ్రమణియన్ “హెల్త్‌కేర్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అప్లికేషన్స్ మరియు వాటి నైతికత” అంశంపై ప్రసంగించనున్నారు. వైద్య రంగంలో AI వినియోగం ఎలా పెరుగుతోంది, దానికి సంబంధించిన సవాళ్లు, నైతిక అంశాలపై ఆయన సమగ్ర అవగాహన కల్పించనున్నారు.

మే 31న సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు (EST) ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. విద్యార్థులకు రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితంగా ఉండగా, హెల్త్‌కేర్ ప్రొవైడర్లు, నర్సులు, ఫార్మసిస్ట్‌లకు స్వల్ప రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి 2 CME క్రెడిట్స్ పొందే అవకాశం కూడా కల్పిస్తున్నారు.

కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను CME కమిటీ సభ్యులు కళ్యాణి బెల్లంకొండ, డాక్టర్ శాంతి ఎప్పనపల్లి, డాక్టర్ సంధ్య చినాల, డాక్టర్ రాజ్ కటార పర్యవేక్షిస్తున్నారు. ఆసక్తి గల వారు పోస్టర్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా లేదా tinyurl.com/OnlineCMEForHCP లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ‘మాటా’ ప్రతినిధులు తెలిపారు. మరిన్ని వివరాలకు +1 732-647-8716 నంబర్‌ను సంప్రదించవచ్చన్నారు.

Spotlight

Read More →