Yogandhra: ఘనంగా యోగాంధ్ర-2026 నిర్వహణకు ఏపీ ప్రభుత్వం సిద్ధం! Art Of Living: ఘనంగా ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ 45 ఏళ్ల వేడుకలు... తరలివచ్చిన దేశ విదేశీ ప్రముఖులు! Recycle Plastic: ప్లాస్టిక్ వ్యర్థాలే ఇప్పుడు పచ్చని తోటలు... యువత చేస్తున్న అద్భుతం! Quality Of Life: డబ్బు కంటే ప్రశాంతతే మిన్న... రూ. 38 లక్షల ఆఫర్‌ను వదులుకుని హైదరాబాద్‌లోనే చేరిన టెక్కీ! AC Safety: ఏసీలో మంటలు, పేలుళ్లకు కారణాలు ఇవే! ఈ టిప్స్ ఫాలో అవ్వండి! Roof Cooling: మండే ఎండల నుంచి ఇంటికి రక్షణ... రూఫ్ కూలింగ్ చిట్కాలతో ఏసీ లేకపోయినా చల్లగా ఉండొచ్చు! Yogandhra: ఘనంగా యోగాంధ్ర-2026 నిర్వహణకు ఏపీ ప్రభుత్వం సిద్ధం! Art Of Living: ఘనంగా ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ 45 ఏళ్ల వేడుకలు... తరలివచ్చిన దేశ విదేశీ ప్రముఖులు! Recycle Plastic: ప్లాస్టిక్ వ్యర్థాలే ఇప్పుడు పచ్చని తోటలు... యువత చేస్తున్న అద్భుతం! Quality Of Life: డబ్బు కంటే ప్రశాంతతే మిన్న... రూ. 38 లక్షల ఆఫర్‌ను వదులుకుని హైదరాబాద్‌లోనే చేరిన టెక్కీ! AC Safety: ఏసీలో మంటలు, పేలుళ్లకు కారణాలు ఇవే! ఈ టిప్స్ ఫాలో అవ్వండి! Roof Cooling: మండే ఎండల నుంచి ఇంటికి రక్షణ... రూఫ్ కూలింగ్ చిట్కాలతో ఏసీ లేకపోయినా చల్లగా ఉండొచ్చు!

Yogandhra: ఘనంగా యోగాంధ్ర-2026 నిర్వహణకు ఏపీ ప్రభుత్వం సిద్ధం!

Yogandhra: యోగాని ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ స్థాయిలో “యోగాంధ్ర-2026” కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

Published : 2026-05-31 09:38:00

కోటి మందితో యోగాంధ్ర కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు కార్యాచరణ..

అమరావతిలో 25 వేల మందితో భారీ యోగా కార్యక్రమం..

యోగాని ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ స్థాయిలో “యోగాంధ్ర-2026” కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది మందిని భాగస్వామ్యం చేసేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఈ కార్యక్రమంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

జూన్ 7 నుంచి 21 వరకు మొత్తం 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా “యోగాంధ్ర-2026” కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలని సీఎం సూచించారు. మొత్తం కోటి మంది పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

రాజధాని అమరావతిలో జరిగే రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యక్రమంలో 25 వేల మంది పాల్గొననున్నారు. కృష్ణా నదిపై నిర్మించిన వెస్ట్ బైపాస్ బ్రిడ్జిపై ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించనుండటం విశేషం. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొంటారు.

అదే రోజు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో వెయ్యి మందితో భారీ యోగా ఈవెంట్లు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొంటారు. “ఒక జిల్లా – ఒక థీమ్” అనే విధానంతో 14 రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాల వారీగా కార్యక్రమాల నిర్వహణకు రూ.25 లక్షల చొప్పున నిధులు కేటాయించారు.

యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆరోగ్య, మానవ వనరులు, మునిసిపల్, పంచాయతీరాజ్, దేవాదాయ, ఐటీ శాఖలు కలిసి పనిచేయనున్నాయి. రాష్ట్రంలోని 56 ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక యోగా సెషన్లు నిర్వహించనున్నారు. ప్రతి రోజు రెండు జిల్లాల్లో 500 మందితో యోగా కార్యక్రమాలు జరుగుతాయి.

పార్కులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డుల్లో కూడా యోగా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉత్తమంగా నిర్వహించిన యోగాంధ్ర ఈవెంట్లకు అవార్డులు కూడా అందించనున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 1.5 లక్షల యోగా ట్రైనర్లతో పాటు మరో లక్ష మందికి శిక్షణ ఇచ్చి యోగా బోధనలో భాగస్వామ్యం చేయనున్నారు. దీంతో ప్రతి ప్రాంతంలో ప్రజలకు యోగా శిక్షణ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ యోగా, నాచురోపతి విభాగ సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు రూపొందించిన యోగాంధ్ర పోస్టర్‌ను సీఎం ఆవిష్కరించారు. యోగాపై అవగాహన పెంచేందుకు 90 యోగాసనాల వీడియోలు, 21 ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఆసనాలు, ప్రాణాయామం, రోజువారీ సాధన, ప్రశ్నలు-సమాధానాల రూపంలో వీడియోలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు.

ఈ వీడియోలను సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. 8142404888 నంబర్‌కు “హాయ్” అని మెసేజ్ పంపడం లేదా క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు పొంగురు నారాయణ, వై సత్య కుమార్, ఆనం రామ్ నారాయణ రెడ్డి, కందుల దుర్గేష్ తో పాటు సీఎస్ సాయి ప్రసాద్, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, కమిషనర్ వీర పాండియన్ తదితరులు పాల్గొన్నారు.

Spotlight

Read More →