Fatty Liver: మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా? అయినా జాగ్రత్త.. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఇదే! Donald Trump: ఇస్లామాబాద్‌ వేదికగా ప్రపంచశాంతి చర్చలు.. ఇరాన్‌తో ఒప్పందం కోసం ట్రంప్ భారీ ప్లాన్! AP CRDA: అమరావతి నిర్మాణంలో వేగం... ఏపీసీఆర్‌డీఏకి ముగ్గురు అదనపు కమిషనర్ల నియామకం! Chandrababu: వికసిత్ భారత్ నిర్మాణంలో మీరే కీలకం.. అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Sai Pallavi: నాలుగేళ్ల నాటి ముచ్చట.. ఇప్పుడు రచ్చ.. సాయి పల్లవి ఐడెంటిటీపై సోషల్ మీడియాలో చర్చ.. Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..? Fatty Liver: మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా? అయినా జాగ్రత్త.. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఇదే! Donald Trump: ఇస్లామాబాద్‌ వేదికగా ప్రపంచశాంతి చర్చలు.. ఇరాన్‌తో ఒప్పందం కోసం ట్రంప్ భారీ ప్లాన్! AP CRDA: అమరావతి నిర్మాణంలో వేగం... ఏపీసీఆర్‌డీఏకి ముగ్గురు అదనపు కమిషనర్ల నియామకం! Chandrababu: వికసిత్ భారత్ నిర్మాణంలో మీరే కీలకం.. అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Sai Pallavi: నాలుగేళ్ల నాటి ముచ్చట.. ఇప్పుడు రచ్చ.. సాయి పల్లవి ఐడెంటిటీపై సోషల్ మీడియాలో చర్చ.. Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..?

TTS: నాష్‌విల్లేలో తెలుగు సమితి వాలీబాల్ టోర్నమెంట్ ఘనవిజయం!

Tennessee Telugu Samithi (TTS): అమెరికాలోని నాష్‌విల్లే నగరంలో తెలుగు కమ్యూనిటీని ఒకే తాటిపైకి తీసుకొస్తూ టెన్నెస్సీ తెలుగు సమితి (TTS) నిర్వహించిన పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ అత్యంత ఉత్సాహభరితంగా ముగిసింది.

Published : 2026-04-17 10:23:00

12 జట్ల మధ్య పోటీ..

సెమీ ఫైనల్స్‌లో ఉత్కంఠ..

అమెరికాలోని నాష్‌విల్లే నగరంలో తెలుగు కమ్యూనిటీని ఒకే తాటిపైకి తీసుకొస్తూ టెన్నెస్సీ తెలుగు సమితి (TTS) నిర్వహించిన పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ అత్యంత ఉత్సాహభరితంగా ముగిసింది. క్రీడాకారుల నైపుణ్యం, అంకితభావం, క్రీడాస్ఫూర్తి ఈ పోటీలను ఆద్యంతం ఆకట్టుకున్నాయి.

ఈ టోర్నమెంట్‌లో మొత్తం 12 జట్లు పాల్గొని టైటిల్ కోసం పోటీపడ్డాయి. జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.

గ్రూప్-A: స్మాష్ చాంప్స్, G.O.A.T, టైగర్స్, హోలీ వాలీ, ఫ్రాంక్లిన్ ఫ్లయర్స్, ఫైర్ బాల్
గ్రూప్-B: హిట్‌మెన్, స్పైకింగ్స్, డెత్ వాలీ, అమిగోస్, MJ బ్లాకర్స్, కరాసునో

సెమీ ఫైనల్స్‌లో హోరాహోరీ పోరు నెలకొంది. ‘G.O.A.T’ జట్టుపై ‘హిట్‌మెన్’ విజయం సాధించగా, ‘స్పైకింగ్స్’పై ‘స్మాష్ చాంప్స్’ గెలిచి ఫైనల్‌కు చేరుకున్నాయి.

గ్రాండ్ ఫైనల్లో ‘హిట్‌మెన్’ మరియు ‘స్మాష్ చాంప్స్’ జట్ల మధ్య పోరు సాగింది. చివరికి అద్భుత ప్రదర్శనతో ‘హిట్‌మెన్’ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ‘స్మాష్ చాంప్స్’ రన్నరప్‌గా నిలిచి మంచి పోటీ ఇచ్చింది.

ఈ టోర్నమెంట్‌ను విజయవంతం చేసిన నిర్వాహకులు, వాలంటీర్లు, అంపైర్లు, రెఫరీలకు నిర్వాహక బృందం తరఫున హారిక కనగాల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాకారుల ఉత్సాహం ఈ పోటీలను మరింత ప్రత్యేకంగా మార్చిందని అన్నారు.

నాష్‌విల్లే తెలుగు కమ్యూనిటీ మద్దతుతోనే ఈ కార్యక్రమం ఘనంగా జరిగిందని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో మరింత పెద్ద స్థాయిలో టోర్నమెంట్లు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు.

క్రీడల ద్వారా కమ్యూనిటీని ఒకే వేదికపైకి తీసుకువచ్చిన ఈ టోర్నమెంట్, నాష్‌విల్లే తెలుగు ప్రజల్లో ఐక్యతను మరింత బలపరిచింది. పాల్గొన్న ప్రతి జట్టు, ప్రతి క్రీడాకారుడు ఈ క్రీడా వేడుకను చిరస్మరణీయంగా మార్చారు.

Spotlight

Read More →