Earthquake: గజగజలాడిన ఉత్తర తెలంగాణ... రిక్టర్ స్కేలుపై 3.9 తీవ్రత! Air Quality: గాలి నాణ్యతలో భారీ క్షీణత! మంచు కాదు.. అది కాలుష్యపు పొగ.. అధికారుల హెచ్చరిక! Earthquake: ఆ రెండు నగరాలకు భూకంప ముప్పు.. ఐఐటీ పరిశోధనలో షాకింగ్ నిజాలు! Rain Alert: ఏపీలో వాతావరణ మార్పులు! ఒకవైపు భానుడి భగభగలు.. మరోవైపు అల్పపీడన జల్లులు! Weather Update: ఏపీ, తెలంగాణలో వాతావరణ మార్పు...! పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన! IMD Alert: వాతావరణ శాఖ హెచ్చరిక! రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు.. Weather Report: భానుడి భగభగలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు! రాబోయే 24 గంటల్లో వాతావరణం ఎలా ఉండబోతోంది?! Earth quake: పల్నాడు జిల్లాలో భూకంపం..! భయంతో రోడ్లపైకి పరుగులు తీసిన జనం! Sun Explosions: సూర్యుడిపై భారీ విస్ఫోటనాలు..! మానవాళికి పొంచి ఉన్న ముప్పు...! Rain Alert: ఏపీకి రెయిన్ అలర్ట్! బంగాళాఖాతంలో మరో అల్పపీడనం! వచ్చే మూడు రోజులు వానలే వానలు.. Earthquake: గజగజలాడిన ఉత్తర తెలంగాణ... రిక్టర్ స్కేలుపై 3.9 తీవ్రత! Air Quality: గాలి నాణ్యతలో భారీ క్షీణత! మంచు కాదు.. అది కాలుష్యపు పొగ.. అధికారుల హెచ్చరిక! Earthquake: ఆ రెండు నగరాలకు భూకంప ముప్పు.. ఐఐటీ పరిశోధనలో షాకింగ్ నిజాలు! Rain Alert: ఏపీలో వాతావరణ మార్పులు! ఒకవైపు భానుడి భగభగలు.. మరోవైపు అల్పపీడన జల్లులు! Weather Update: ఏపీ, తెలంగాణలో వాతావరణ మార్పు...! పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన! IMD Alert: వాతావరణ శాఖ హెచ్చరిక! రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు.. Weather Report: భానుడి భగభగలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు! రాబోయే 24 గంటల్లో వాతావరణం ఎలా ఉండబోతోంది?! Earth quake: పల్నాడు జిల్లాలో భూకంపం..! భయంతో రోడ్లపైకి పరుగులు తీసిన జనం! Sun Explosions: సూర్యుడిపై భారీ విస్ఫోటనాలు..! మానవాళికి పొంచి ఉన్న ముప్పు...! Rain Alert: ఏపీకి రెయిన్ అలర్ట్! బంగాళాఖాతంలో మరో అల్పపీడనం! వచ్చే మూడు రోజులు వానలే వానలు..

2026 Summer Alert: మార్చి టు మే.. ఏపీకి అత్యంత కీలకం - భానుడి భగభగలు.. విపత్తుల నిర్వహణ MD ప్రఖర్ జైన్ హెచ్చరిక.!

2026 Summer Alert: ఐఎండి సూచనల ప్రకారం ఈ 2026 వేసవిలో మార్చి నుంచి మే వరకు సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

Published : 2026-02-28 21:22:00
  • ఇంటిని చల్లగా ఉంచుకోండిలా: కూల్ రూఫ్ టెక్నాలజీ, వైట్ పెయింట్‌తో ఎండ వేడికి చెక్!
     
  • మార్చిలోనే మంటలు: రాయలసీమ, ఉత్తరాంధ్రలో పెరగనున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. ఐఎండి అంచనా..

2026 Summer Alert: ఐఎండి సూచనల ప్రకారం ఈ 2026 వేసవిలో మార్చి నుంచి మే వరకు సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అలాగే కనిష్ఠ ఉష్ణోగ్రతలు రాయలసీమ, ఉత్తరాంధ్ర కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మార్చి నెలలో సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. సెంట్రల్ ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే ఎక్కువ రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వివరించారు.

ఎండతీవ్రతకు, వడగాల్పులకు గురికాకుండా తీసుకోవాల్సిన ముఖ్యమైన కొన్ని ముందస్తు జాగ్రత్తలు రాష్ట్ర విపత్తుల నిర్వహణ  మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వివరించారు.

  • టోపి, కర్చీఫ్,  తెలుపు రంగు గల కాటన్ వస్త్రాలను సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా మీ కళ్ళ రక్షణ కోసం మంచి సన్ గ్లాసెస్ ఉపయోగించాలన్నారు.
  • ఇంటి వాతావరణం చల్లదనం కోసం ఇంటి పైకప్పులపై వైట్ పెయింట్, కూల్ రూఫ్ టెక్నాలజీ, క్రాస్ వెంటిలేషన్, థర్మోకోల్ ఇన్సులేషన్ ను వంటివి ఏర్పాటు చేసుకోవాలన్నారు.
  • మేడపైన మొక్కలు, ఇంట్లో ని  మొక్కలు (ఇండోర్ ప్లాంట్స్)  భవనాన్ని చల్లగా ఉంచుతాయి. అదేవిదంగా ఉష్ణతాపాన్ని తగ్గిస్తాయి. ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచుకోవాలన్నారు.
  • వంటగది తలుపులు, కిటికీలను తీసివుంచితే తగినంత గాలి వచ్చేవిదంగా చూసుకోవాలని సూచించారు.

Spotlight

Read More →