Mrunal Thakur: సరిహద్దులు చెరిపేసే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నా.. మృణాల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.! Rajinikanth: "జైలర్ 2 షూటింగ్ పూర్తి": అభిమానులకు సూపర్ స్టార్ రజనీకాంత్ అదిరిపోయే అప్‌డేట్! Ranabali Movie Update: సీమ గడ్డపై ‘రణబాలి’ గర్జన.. భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ పీరియడ్ డ్రామా! Rashmika Mandanna: అంతర్జాతీయ వేదికపై నేషనల్ క్రష్ సరికొత్త చరిత్ర.. ఇండియా టు జపాన్..! OTT Updates: సస్పెన్స్ థ్రిల్లర్ ప్రియులకు పండగే.. ఇప్పుడు ఓటీటీలో రచ్చ! మొదటి భాగానికి మించిన ట్విస్టులు.. Prakash Raj: ప్రకాశ్ రాజ్ కుటుంబంలో తీవ్ర విషాదం.. కుమారుడి మరణం తర్వాత మరో తీరని లోటు! Dhurandhar: 'ధురంధర్' క్రేజ్.. సినిమాలో చిన్న పాత్రను కూడా వదలని నెటిజన్లు.. 30 ఏళ్ల నాటి గుట్టు రట్టు! Varun Tej: మెగా సంబరం.. వరుణ్ తేజ్ 'బరి' ప్రారంభం.. ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్! Senior NTR: కృష్ణుడంటే ఎన్టీఆరే.. మాయాబజార్‌తో మొదలైన ఒక నటుడి దైవత్వం.. అంతుచిక్కని రికార్డులు! ఆ రోజుల్లోనే.! Ram Charan: రామ్ చరణ్ వెల్లడించిన బిగ్ సీక్రెట్! డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న మెగా డాటర్... Mrunal Thakur: సరిహద్దులు చెరిపేసే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నా.. మృణాల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.! Rajinikanth: "జైలర్ 2 షూటింగ్ పూర్తి": అభిమానులకు సూపర్ స్టార్ రజనీకాంత్ అదిరిపోయే అప్‌డేట్! Ranabali Movie Update: సీమ గడ్డపై ‘రణబాలి’ గర్జన.. భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ పీరియడ్ డ్రామా! Rashmika Mandanna: అంతర్జాతీయ వేదికపై నేషనల్ క్రష్ సరికొత్త చరిత్ర.. ఇండియా టు జపాన్..! OTT Updates: సస్పెన్స్ థ్రిల్లర్ ప్రియులకు పండగే.. ఇప్పుడు ఓటీటీలో రచ్చ! మొదటి భాగానికి మించిన ట్విస్టులు.. Prakash Raj: ప్రకాశ్ రాజ్ కుటుంబంలో తీవ్ర విషాదం.. కుమారుడి మరణం తర్వాత మరో తీరని లోటు! Dhurandhar: 'ధురంధర్' క్రేజ్.. సినిమాలో చిన్న పాత్రను కూడా వదలని నెటిజన్లు.. 30 ఏళ్ల నాటి గుట్టు రట్టు! Varun Tej: మెగా సంబరం.. వరుణ్ తేజ్ 'బరి' ప్రారంభం.. ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్! Senior NTR: కృష్ణుడంటే ఎన్టీఆరే.. మాయాబజార్‌తో మొదలైన ఒక నటుడి దైవత్వం.. అంతుచిక్కని రికార్డులు! ఆ రోజుల్లోనే.! Ram Charan: రామ్ చరణ్ వెల్లడించిన బిగ్ సీక్రెట్! డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న మెగా డాటర్...

Ramayana: ‘రామాయణం’పై భారీ అంచనాలు.. రూ.700 కోట్ల ఓటీటీ ఆఫర్‌కు నో చెప్పిన నిర్మాత!

Ramayana Movie: దీపావళి 2026 కి విడుదలకు సిద్ధమవుతున్న రామాయణ చిత్రం. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ రూ.700 కోట్ల భారీ ఆఫర్. కానీ నో చెప్పిన ప్రొడ్యూసర్..

Published : 2026-04-05 14:58:00

దీపావళి 2026 కి విడుదలకు సిద్ధమవుతున్న రామాయణ చిత్రం.. 

డిజిటల్ హక్కుల కోసం రూ.1000 కోట్ల డీల్ లక్ష్యం.. 

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా ఉన్న ‘రామాయణం’ సినిమా గురించి ఆసక్తికరమైన వార్తలు వెలుగులోకి వచ్చాయి. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ చిత్రం దీపావళి 2026 కి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మహా ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. రెండో భాగం 2027 దీపావళి కి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్‌లో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా కనిపించడంతో దేశవ్యాప్తంగా భారీ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సినిమా ఓటీటీ హక్కులపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

సమాచారం ప్రకారం, ఈ చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రాకు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ రూ.700 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చిందట. అయితే ఈ ఆఫర్‌ను ఆయన తిరస్కరించినట్టు తెలుస్తోంది. సినిమా స్థాయి, ఖర్చు దృష్ట్యా ఇంకా ఎక్కువ మొత్తాన్ని ఆశిస్తున్నారని సమాచారం.

సమీప వర్గాల సమాచారం ప్రకారం, ఈ రెండు భాగాల డిజిటల్ హక్కుల కోసం రూ.1000 కోట్ల డీల్ లక్ష్యంగా పెట్టుకున్నారని తెలుస్తోంది. మిగిలిన రూ.3000 కోట్లను థియేట్రికల్, అంతర్జాతీయ మార్కెట్ల ద్వారా రాబట్టాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చెప్పబడుతోంది.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందే అవకాశముందని నిర్మాత విశ్వసిస్తున్నారు. అవసరమైతే మొదటి భాగం హక్కులను మాత్రమే ముందుగా అమ్మి, రెండో భాగాన్ని తరువాత విడుదల తర్వాత విక్రయించే వ్యూహాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం.

‘రామాయణం’ చిత్రంలో సీత పాత్రలో సాయి పల్లవి, రావణుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవీ దూబే నటిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్తో పాటు భారతీయ సంగీత దిగ్గజం ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.

ఇలా భారీ స్థాయిలో రూపొందుతున్న ‘రామాయణం’ చిత్రంపై రోజురోజుకీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. భారీ బడ్జెట్, అంతర్జాతీయ స్థాయి సాంకేతికత, ప్రముఖ నటీనటులతో ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో మరో మైలురాయిగా నిలిచే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Spotlight

Read More →