Renu Desai: రేణు దేశాయ్‌పై అసభ్యకర కామెంట్.. గుంటూరు వ్యక్తి అరెస్ట్! ట్రోలర్లకు గట్టి వార్నింగ్.. Krithi Shetty: నా జీవితంలోనూ ఒక బ్రేకప్ ఉంది": తన పర్సనల్ లైఫ్ గురించి షాకింగ్ నిజం చెప్పిన యువ కథానాయిక! Ram Gopal Varma: చావుకు మరో ఏడాది దగ్గరయ్యాను... నెట్టింట వైరల్‌గా మారిన వర్మ పోస్ట్! AA22 Movie Updates: బన్నీ ఫ్యాన్స్‌కు పూనకాలే.. అట్లీ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది! Tollywood: ఒకే ఒక్క సినిమా.. చెరగని ముద్ర.! చిన్నప్పుడే కాదు ఇప్పటీకీ అదే క్యూట్‌నెస్.. సోషల్ మీడియాలో వైరల్! Janhvi Kapoor: 15 ఏళ్లకే ఆ నరకం చూశాను.. అప్పుడు ఏడ్చాను.. ఇప్పుడు భయపడను! జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు! Peddi Movie Update: రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తున్న 'పెద్ది'.. చరణ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓటీటీ బిజినెస్..! Sharwanand: రాజశేఖర్ గారిపై నాకు జెలసీ.. జీవిత గారు ఆయన్ని చూసుకునే విధానంపై శర్వానంద్ కామెంట్స్! Mrunal Thakur: సరిహద్దులు చెరిపేసే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నా.. మృణాల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.! Mrunal Thakur: సరిహద్దులు చెరిపేసే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నా.. మృణాల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.! Renu Desai: రేణు దేశాయ్‌పై అసభ్యకర కామెంట్.. గుంటూరు వ్యక్తి అరెస్ట్! ట్రోలర్లకు గట్టి వార్నింగ్.. Krithi Shetty: నా జీవితంలోనూ ఒక బ్రేకప్ ఉంది": తన పర్సనల్ లైఫ్ గురించి షాకింగ్ నిజం చెప్పిన యువ కథానాయిక! Ram Gopal Varma: చావుకు మరో ఏడాది దగ్గరయ్యాను... నెట్టింట వైరల్‌గా మారిన వర్మ పోస్ట్! AA22 Movie Updates: బన్నీ ఫ్యాన్స్‌కు పూనకాలే.. అట్లీ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది! Tollywood: ఒకే ఒక్క సినిమా.. చెరగని ముద్ర.! చిన్నప్పుడే కాదు ఇప్పటీకీ అదే క్యూట్‌నెస్.. సోషల్ మీడియాలో వైరల్! Janhvi Kapoor: 15 ఏళ్లకే ఆ నరకం చూశాను.. అప్పుడు ఏడ్చాను.. ఇప్పుడు భయపడను! జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు! Peddi Movie Update: రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తున్న 'పెద్ది'.. చరణ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓటీటీ బిజినెస్..! Sharwanand: రాజశేఖర్ గారిపై నాకు జెలసీ.. జీవిత గారు ఆయన్ని చూసుకునే విధానంపై శర్వానంద్ కామెంట్స్! Mrunal Thakur: సరిహద్దులు చెరిపేసే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నా.. మృణాల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.! Mrunal Thakur: సరిహద్దులు చెరిపేసే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నా.. మృణాల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

LIK: ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’.. 2040లో ప్రేమకు టెక్నాలజీ సవాలు!

Love Insurance Kompany: 2040 సంవత్సరంలో జరిగే కథ. సోషల్ మీడియా అడిక్ట్స్ కోసం రిహాబిలిటేషన్ సెంటర్‌లు, యాప్ నిర్ణయించే ప్రేమ.

Published : 2026-04-05 15:23:00

‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK)’ సినిమా ట్రైలర్ విడుదల..

ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల..

యువ నటుడు ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK)’ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై మంచి స్పందన అందుకుంటోంది. ప్రముఖ దర్శకుడు విగ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 10న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో కొత్త తరహా కాన్సెప్ట్‌తో కథను చూపించడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా కథ 2040 సంవత్సరంలో జరుగుతుంది. ఇందులో ఎస్ జే సూర్య ఒక ఆధునిక మ్యాచ్మేకింగ్ సంస్థ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ స్థాపకుడిగా కనిపిస్తారు. ఈ సంస్థ టెక్నాలజీ ఆధారంగా జంటల మధ్య అనుకూలతను (compatibility) పరిశీలిస్తుంది. ఇందులో ప్రదీప్ ‘వైబ్ వాస్సే’ అనే పాత్రలో ఆ యాప్‌కు వాయిస్‌గా పనిచేస్తాడు.

ఈ క్రమంలో అతను కృతి శెట్టి నటించిన ‘ధీమా’ను ఒక ప్రత్యేక రిహాబిలిటేషన్ సెంటర్‌లో కలుస్తాడు. ఇది సాధారణ డ్రగ్ రిహాబ్ కాకుండా సోషల్ మీడియా అలవాట్ల నుంచి బయటపడేందుకు ఉపయోగించే కేంద్రం కావడం విశేషం. అక్కడే ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది.

అయితే కథలో ట్విస్ట్ ఏమిటంటే, LIK యాప్ వీరిద్దరికీ కంపాటబిలిటీ లేదు అని  ప్రకటిస్తుంది. దీంతో ఎస్ జే సూర్య పాత్ర, వారి ప్రేమను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంది. దీనికి ప్రతిగా ప్రదీప్ పాత్ర “ప్రేమను సాఫ్ట్‌వేర్ నిర్ణయించలేదని” నిరూపించేందుకు ప్రయత్నిస్తాడు.

ఈ చిత్రంలో యోగి బాబు, సీమన్, గౌరి కిషన్, షా రహ్, మాలవిక వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని రవి వర్మన్ నిర్వహిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలను పీటర్ హైన్ కంపోస్ చేశారు.

ట్రైలర్ విడుదల వెంటనే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. “ప్రదీప్ మళ్లీ వచ్చేశాడు”, “సేమ్ సేమ్ బట్ డిఫరెంట్” అంటూ కామెంట్లు వెల్లువెత్తాయి. కొందరు ఈ సినిమాను హాలీవుడ్ చిత్రాలతో పోలుస్తూ ప్రశంసించారు.

మొత్తానికి ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా ప్రేమ, టెక్నాలజీ, భావోద్వేగాల మధ్య ఉన్న సంబంధాన్ని కొత్త కోణంలో చూపించబోతోంది. వినూత్న కాన్సెప్ట్‌తో ప్రదీప్ మరోసారి ప్రేక్షకులను అలరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Spotlight

Read More →