Allu Sirish Wedding: అల్లు శిరీష్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ! హాజరైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్! MaheshBabu: హీరో టూ సీఈఓ... టాలీవుడ్ బిజినెస్ మ్యాన్! మహేష్ బాబు బిజినెస్ సీక్రెట్స్! Vijay Rashmika Wedding: విజయ్-రష్మిక పెళ్లి ఫిక్స్... వెడ్డింగ్ కార్డ్ వైరల్! ఫ్యాన్స్ క్రియేషనా లేక నిజమా! Allu Sirish marriage: ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లి సందడి.. అల్లు శిరీష్ తొలి ఆహ్వానం చిరంజీవికి! Sharwanand: శర్వానంద్‌కి జంటగా ‘డ్రాగన్’ బ్యూటీ... అంచనాలు పెంచుతున్న కొత్త క్రేజీ కాంబో! Mrunal Thakur Marriage: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్...! ఏమన్నారంటే...! Surya Jyothika: వాలెంటైన్స్ డే స్పెషల్.. సూర్య-జ్యోతిక ప్రేమకథలో ఆసక్తికర మలుపు! Twin Babies: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రామ్ చరణ్-ఉపాసన పిల్లల పేర్లు! చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయండోయ్... Valentines day Special Movie: రేపు 'కపుల్ ఫ్రెండ్లీ' ప్రీమియర్స్... మీ ఊరిలో థియేటర్ ఏది? టైమింగ్స్ ఇవే.! వాలెంటైన్స్ వీక్ ప్లాన్స్! Ott movies: ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. అర్ధరాత్రి ఓటీటీలోకి రెండు హిట్ సినిమాలు! Allu Sirish Wedding: అల్లు శిరీష్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ! హాజరైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్! MaheshBabu: హీరో టూ సీఈఓ... టాలీవుడ్ బిజినెస్ మ్యాన్! మహేష్ బాబు బిజినెస్ సీక్రెట్స్! Vijay Rashmika Wedding: విజయ్-రష్మిక పెళ్లి ఫిక్స్... వెడ్డింగ్ కార్డ్ వైరల్! ఫ్యాన్స్ క్రియేషనా లేక నిజమా! Allu Sirish marriage: ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లి సందడి.. అల్లు శిరీష్ తొలి ఆహ్వానం చిరంజీవికి! Sharwanand: శర్వానంద్‌కి జంటగా ‘డ్రాగన్’ బ్యూటీ... అంచనాలు పెంచుతున్న కొత్త క్రేజీ కాంబో! Mrunal Thakur Marriage: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్...! ఏమన్నారంటే...! Surya Jyothika: వాలెంటైన్స్ డే స్పెషల్.. సూర్య-జ్యోతిక ప్రేమకథలో ఆసక్తికర మలుపు! Twin Babies: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రామ్ చరణ్-ఉపాసన పిల్లల పేర్లు! చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయండోయ్... Valentines day Special Movie: రేపు 'కపుల్ ఫ్రెండ్లీ' ప్రీమియర్స్... మీ ఊరిలో థియేటర్ ఏది? టైమింగ్స్ ఇవే.! వాలెంటైన్స్ వీక్ ప్లాన్స్! Ott movies: ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. అర్ధరాత్రి ఓటీటీలోకి రెండు హిట్ సినిమాలు!

Allu Sirish: శిరీష్ పెళ్లికి బన్నీ గ్రాండ్ పార్టీ.. ప్రత్యేక ఆకర్షణగా రామ్ చరణ్ దంపతులు!

Allu family wedding: అల్లు వారింట్లో ఇప్పుడు పెళ్లి బాజాలు మోగుతున్నాయి. అల్లు అరవింద్ చిన్న కుమారుడు, యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతుండటంతో అల్లు మరియు కొణిదెల కుటుంబాల్లో సందడి నెలకొంది.

Published : 2026-02-21 21:11:00
  • తమ్ముడు శిరీష్ పెళ్లి సందర్భంగా గ్రాండ్ పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్..
     
  • మార్చి 6న అల్లు శిరీష్, నయనిక రెడ్డిల వివాహం..

Allu family wedding: అల్లు వారింట్లో ఇప్పుడు పెళ్లి బాజాలు మోగుతున్నాయి. అల్లు అరవింద్ చిన్న కుమారుడు, యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతుండటంతో అల్లు మరియు కొణిదెల కుటుంబాల్లో సందడి నెలకొంది. ఈ క్రమంలో శిరీష్ సోదరుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫామ్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన గ్రాండ్ ప్రీ-వెడ్డింగ్ పార్టీ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అల్లు శిరీష్ వివాహం మార్చి 6, 2026న జరగనుంది. పెళ్లికి ఇంకా కొద్దిరోజులే సమయం ఉండటంతో, అల్లు అర్జున్ తన అత్యంత సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల కోసం ఒక స్పెషల్ పార్టీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ శివార్లలోని బన్నీ ఫామ్‌హౌస్‌లో ఈ వేడుక జరిగింది. ఈ పార్టీలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చాలా కాలం తర్వాత చరణ్, బన్నీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో మెగా-అల్లు అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. వీరంతా బ్లాక్ కలర్ డ్రెస్ కోడ్‌లో స్టైలిష్‌గా మెరిసిపోయారు.

శిరీష్ మనసు గెలుచుకున్న అమ్మాయి నయనిక రెడ్డి. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. గతేడాది అక్టోబర్‌లో వీరి నిశ్చితార్థం అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. అల్లు శిరీష్ తన వివాహం కోసం మార్చి 6ను ఎంచుకోవడం వెనుక ఒక పెద్ద కారణం ఉంది. సరిగ్గా 15 ఏళ్ల క్రితం, అంటే 2011 మార్చి 6నే అల్లు అర్జున్ - స్నేహారెడ్డిల వివాహం జరిగింది. ఇప్పుడు అదే తేదీన తమ్ముడు కూడా పెళ్లి పీటలు ఎక్కుతుండటం విశేషం. పెళ్లి పనులు మొదలైన వెంటనే శిరీష్ తన పెద్దనాన్న, మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. సంప్రదాయం ప్రకారం, తన తల్లిదండ్రులు అల్లు అరవింద్, నిర్మలతో కలిసి చిరంజీవి-సురేఖ దంపతులకు శిరీష్ మొదటి పెళ్లి పత్రికను అందించారు. ఇటీవలే శిరీష్ తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి దుబాయ్‌లో ఒక లగ్జరీ యాచ్‌ (Yacht) మీద బ్యాచిలర్ పార్టీ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

మెగా మరియు అల్లు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయని గతంలో కొన్ని పుకార్లు వచ్చాయి. అయితే, రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఈ పార్టీకి హాజరవ్వడం, అందరూ కలిసి సరదాగా గడపడంతో ఆ వార్తలన్నీ ఉత్తివేనని తేలిపోయింది. ఈ వేడుకలో ఉపాసన, అల్లు స్నేహారెడ్డి కూడా ఎంతో క్లోజ్‌గా కనిపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. పెళ్లికి ముందు జరిగే 'పసుపు దంచే' వేడుకను కూడా అల్లు వారింట్లో ఎంతో వేడుకగా నిర్వహించారు. ఆ సమయంలో బన్నీ షూటింగ్‌లో ఉండి హాజరు కాలేకపోయినా, వీడియో కాల్ ద్వారా సందడి చేశారు. మార్చి 6న జరిగే ఈ వివాహ వేడుకకు టాలీవుడ్, కోలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఇరు కుటుంబాల ఆనందం చూస్తుంటే, ఈ పెళ్లి వేడుక కన్నుల పండుగగా జరగడం ఖాయమనిపిస్తోంది.

Spotlight

Read More →