Love Marriage: పెళ్లిపీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్! అమ్మాయి ఎవరంటే? Allu Arjun: కష్టాల్లో ఉన్న పావలా శ్యామలకు బన్నీ అండ..! ప్రతి నెలా ఆర్థిక సాయం అందేలా ఏర్పాట్లు! YashToxic: 'టాక్సిక్' రిలీజ్ పోస్ట్‌పోన్...! కారణం ఏంటో తెలిసి షాక్ అవుతున్న ఫ్యాన్స్! Vijay-Rashmika: విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి.. కొద్ది గంటల్లోనే ముహూర్తమంటూ వైరల్! Bloody Romeo: గ్యాంగ్‌స్టర్‌గా నాని?.. ‘బ్లడీ రోమియో’ టీజర్ హింట్ Varalaxmi Sarathkumar: ఆయనే నాకు రెండో జన్మనిచ్చారు... నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ఎమోషనల్ కామెంట్స్! Allu Sirish Wedding: అల్లు శిరీష్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ! హాజరైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్! MaheshBabu: హీరో టూ సీఈఓ... టాలీవుడ్ బిజినెస్ మ్యాన్! మహేష్ బాబు బిజినెస్ సీక్రెట్స్! Vijay Rashmika Wedding: విజయ్-రష్మిక పెళ్లి ఫిక్స్... వెడ్డింగ్ కార్డ్ వైరల్! ఫ్యాన్స్ క్రియేషనా లేక నిజమా! Allu Sirish marriage: ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లి సందడి.. అల్లు శిరీష్ తొలి ఆహ్వానం చిరంజీవికి! Love Marriage: పెళ్లిపీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్! అమ్మాయి ఎవరంటే? Allu Arjun: కష్టాల్లో ఉన్న పావలా శ్యామలకు బన్నీ అండ..! ప్రతి నెలా ఆర్థిక సాయం అందేలా ఏర్పాట్లు! YashToxic: 'టాక్సిక్' రిలీజ్ పోస్ట్‌పోన్...! కారణం ఏంటో తెలిసి షాక్ అవుతున్న ఫ్యాన్స్! Vijay-Rashmika: విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి.. కొద్ది గంటల్లోనే ముహూర్తమంటూ వైరల్! Bloody Romeo: గ్యాంగ్‌స్టర్‌గా నాని?.. ‘బ్లడీ రోమియో’ టీజర్ హింట్ Varalaxmi Sarathkumar: ఆయనే నాకు రెండో జన్మనిచ్చారు... నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ఎమోషనల్ కామెంట్స్! Allu Sirish Wedding: అల్లు శిరీష్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ! హాజరైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్! MaheshBabu: హీరో టూ సీఈఓ... టాలీవుడ్ బిజినెస్ మ్యాన్! మహేష్ బాబు బిజినెస్ సీక్రెట్స్! Vijay Rashmika Wedding: విజయ్-రష్మిక పెళ్లి ఫిక్స్... వెడ్డింగ్ కార్డ్ వైరల్! ఫ్యాన్స్ క్రియేషనా లేక నిజమా! Allu Sirish marriage: ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లి సందడి.. అల్లు శిరీష్ తొలి ఆహ్వానం చిరంజీవికి!

Allu Arjun: ఒకే తేదీ.. రెండు వేడుకలు.. అన్నయ్య పెళ్లి రోజే ఒక ఇంటివాడవుతున్న తమ్ముడు అల్లు శిరీష్.!

wedding anniversary Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. నేడు (మార్చి 6) అల్లు అర్జున్, స్నేహారెడ్డి తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

Published : 2026-03-06 22:14:00
  • మా ప్రేమకు 15 ఏళ్లు: పిల్లలు, జ్ఞాపకాలతో కూడిన అందమైన జీవితం అంటూ స్నేహారెడ్డి భావోద్వేగం..
     
  • మార్చి 6న అల్లు వారి ఇంట పెళ్లి సందడి: నయనికా రెడ్డితో ఒక్కటవుతున్న అల్లు శిరీష్!

wedding anniversary Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. నేడు (మార్చి 6) అల్లు అర్జున్, స్నేహారెడ్డి తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకుంటూ ఎమోషనల్ పోస్టులు పెట్టారు. ఈ జంట పెళ్లి చేసుకుని నేటికి సరిగ్గా 15 ఏళ్లు పూర్తయింది.

స్పెషల్ డే సందర్భంగా స్నేహారెడ్డి తన భర్తతో ఉన్న ఫొటోలతో పాటు పిల్లలు అయాన్, అర్హలతో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. "15 ఏళ్ల తర్వాత.. మనం ప్రేమతో నిండిన జీవితాన్ని నిర్మించుకున్నాం. మన ఇద్దరు పిల్లలు, మన రెండు పెంపుడు కుక్కలే నాకు సర్వస్వం. ఎన్నో జ్ఞాపకాలు మన సొంతం. నా జీవితంలోని ప్రతి దశలోనూ నాకు తోడుగా ఉన్నందుకు ధన్యవాదాలు" అంటూ స్నేహ రాసుకొచ్చారు.

మరోవైపు అల్లు అర్జున్ కూడా భార్యకు శుభాకాంక్షలు చెబుతూ.. "హ్యాపీ యానివర్సరీ క్యూటీ.. 15 ఏళ్ల బంధం ఇది. నువ్వు లేకపోతే ఈ ప్రయాణం ఇంత అందంగా ఉండేది కాదు" అంటూ పోస్ట్ చేశారు. అలాగే నవ్వులు, స్నేహంతో నిండిన జీవితం అంటూ స్నేహతో ఉన్న మరో బ్లాక్ అండ్ వైట్ ఫొటోను కూడా పంచుకున్నారు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ స్నేహితులుగా మారి, అనంతరం ప్రేమించి, పెద్దలను ఒప్పించి 2011 మార్చిలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

మరో ఆసక్తికరమైన విశేషమేమిటంటే.. సరిగ్గా అన్నయ్య పెళ్లి రోజే తమ్ముడు అల్లు శిరీష్ ఓ ఇంటివాడు అవుతున్నాడు. నయనికా రెడ్డితో శిరీష్ వివాహం నేడే (మార్చి 6) జరుగుతుండటంతో అల్లు వారి ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. ఒకపక్క తమ వెడ్డింగ్ యానివర్సరీ, మరోపక్క తమ్ముడి పెళ్లి కావడంతో అల్లు అర్జున్ ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుతం అల్లు అర్జున్, స్నేహ ఇద్దరూ శిరీష్ పెళ్లి వేడుకల్లో సందడి చేస్తూ ఆ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు.

Spotlight

Read More →