విజయనగరం జిల్లా రొంపల్లి పంచాయతీ పరిధిలోని గిరిజన ‘గూడెం’ గ్రామం ఇప్పుడు నిజమైన అభివృద్ధి వెలుగులోకి వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఈ పల్లె ప్రజలు విద్యుత్ కాంతులు చూశారు. ఈ చారిత్రాత్మక ఘట్టం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో సాధ్యమైంది.
గిరి శిఖరాల మధ్య ఉన్న ఈ చిన్న గ్రామంలో మొత్తం 17 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇప్పటివరకు వీరు అంధకారంలోనే జీవనం గడిపారు. రాత్రి సమయాల్లో కిరోసిన్ దీపాలతోనే రోజువారీ పనులు చేసుకునేవారు. పిల్లలు చదువు కొనసాగించడంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ సమస్యను గమనించి, విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి అవసరమైన పనులు వేగంగా పూర్తి చేయించారు.
కేంద్ర ప్రభుత్వ నిధులు మరియు రాష్ట్ర విద్యుత్ శాఖ సహకారంతో సుమారు 9.6 కిలోమీటర్ల దూరం వరకు 217 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. ప్రతీ ఇంటికి ఐదు బల్బులు, ఒక ఫ్యాన్ అమర్చడం ద్వారా గిరిజనుల జీవన విధానంలో వెలుగు నింపారు సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్.
గ్రామస్తులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన ఈ క్షణాన్ని వారు పండుగలా జరుపుకున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోకు పాలాభిషేకం చేస్తూ తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇంతవరకు అంధకారమే మా జీవితం. ఇప్పుడు మా పిల్లలు రాత్రిపూట కూడా చదువుకోవచ్చు. ఇది మాకు కొత్త దశ మొదలైనట్టే అని ఒక గ్రామస్తుడు ఆనందంతో చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన అదే విధంగా పవన్ కళ్యాణ్ సమయస్ఫూర్తితో మాకు ఈ సదుపాయాలు సమకూర్చారని గత ప్రభుత్వం మా గురించి ఏమి పట్టించుకోలేదు ఓట్ల కోసం మాత్రమే అది చేస్తాను అని చెప్పి ఏమి అభివృద్ధి చేయలేదని చెప్పుకొచ్చారు. మరోసారి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.