Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!! మద్యం కొనాలంటే ఇక నుండి ఇది తప్పనిసరి! ప్రభుత్వం కీలక నిర్ణయం! Spider Web: ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు గూడు.. 106 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భయంకర నిర్మాణం!! Minister Nara Lokesh: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ప్రచారం చేయనున్న మంత్రి నారా లోకేశ్.. తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో! Revanths birthday: రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ అభిమానుల్లో పండుగ వాతావరణం.. పుట్టినరోజు సందర్భంగా మోదీ, చంద్రబాబు శుభాకాంక్షలు! Samanthas: రాజ్ నిడిమోరుతో సమంత ఫొటో వైరల్.. రెండో పెళ్లి చర్చ ఊపందుకుంది! ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా! ఒక్కొక్కరికి రూ.4 లక్షల వరకు.. అకౌంట్ లో జమ! Maharajas Express: ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన రైలు.. సౌకర్యాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. కానీ టికెట్ ధర మాత్రం అడగొద్దు!! Google: గూగుల్‌ మ్యాప్స్‌ కొత్త ఫీచర్‌..! ఇక రూట్‌ మాత్రమే కాదు, బస్‌ టికెట్‌ కూడా బుక్‌ చేసుకోండి! UKG classes: ప్రభుత్వ పాఠశాలల్లో UKG తరగతులు.. తెలంగాణ సర్కార్ భారీ నిర్ణయం! Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!! మద్యం కొనాలంటే ఇక నుండి ఇది తప్పనిసరి! ప్రభుత్వం కీలక నిర్ణయం! Spider Web: ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు గూడు.. 106 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భయంకర నిర్మాణం!! Minister Nara Lokesh: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ప్రచారం చేయనున్న మంత్రి నారా లోకేశ్.. తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో! Revanths birthday: రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ అభిమానుల్లో పండుగ వాతావరణం.. పుట్టినరోజు సందర్భంగా మోదీ, చంద్రబాబు శుభాకాంక్షలు! Samanthas: రాజ్ నిడిమోరుతో సమంత ఫొటో వైరల్.. రెండో పెళ్లి చర్చ ఊపందుకుంది! ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా! ఒక్కొక్కరికి రూ.4 లక్షల వరకు.. అకౌంట్ లో జమ! Maharajas Express: ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన రైలు.. సౌకర్యాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. కానీ టికెట్ ధర మాత్రం అడగొద్దు!! Google: గూగుల్‌ మ్యాప్స్‌ కొత్త ఫీచర్‌..! ఇక రూట్‌ మాత్రమే కాదు, బస్‌ టికెట్‌ కూడా బుక్‌ చేసుకోండి! UKG classes: ప్రభుత్వ పాఠశాలల్లో UKG తరగతులు.. తెలంగాణ సర్కార్ భారీ నిర్ణయం!

Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..!

2025-11-07 20:25:00
జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా..

దేశవ్యాప్తంగా వీధికుక్కలు, రహదారులపై తిరిగే పశువుల నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఆసుపత్రులు వంటి ప్రజాస్థలాల్లో కుక్కకాటు ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇలాంటి ప్రాంగణాలను పూర్తిగా వీధికుక్కల రహిత ప్రాంతాలుగా మార్చాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు ఈ సమస్యపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించింది. డ్రైవ్‌ పురోగతిపై 8 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని సూచించింది. వీధికుక్కలను పట్టుకున్న తర్వాత వాటిని తిరిగి వదిలివేయకూడదని, వాటి సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..!

ఈ ఏడాది ఆగస్టు 11న జస్టిస్ పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ నేతృత్వంలోని బెంచ్ కుక్కల దాడులపై సీరియస్‌గా స్పందించింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్‌ ప్రాంతాల్లో వీధికుక్కలను షెల్టర్ హోమ్స్‌కే పరిమితం చేయాలని ఆదేశించింది. అయితే, జంతు ప్రేమికులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాన న్యాయమూర్తి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దాంతో జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియా నేతృత్వంలోని కొత్త ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రజా ప్రాంగణాల్లో, సంస్థాగత ప్రాంతాల్లో కుక్కకాటు కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త ఆదేశాలు వెలువరించింది.

Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు!

అదేవిధంగా, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై విచ్చలవిడిగా తిరుగుతున్న పశువుల వల్ల ప్రమాదాలు అధికమవుతున్నాయని సుప్రీం వ్యాఖ్యానించింది. రోడ్లపై ఉన్న పశువులను పట్టుకుని షెల్టర్ హోమ్స్‌కు తరలించాలని, వాటి సంరక్షణ, ఆహారం, వసతి వంటి అంశాలను ప్రభుత్వం పర్యవేక్షించాలంటూ స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (NHAI) తప్పనిసరిగా అమలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..!

కుక్కకాట్ల కారణంగా భారతదేశం అంతర్జాతీయంగా ప్రతిష్ట కోల్పోతోందని సుప్రీం విచారం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకూ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించాయని విమర్శిస్తూ, ఇకపై అలాంటి నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించింది. ప్రజల భద్రత అత్యంత ప్రాధాన్యమని గుర్తుచేసిన కోర్టు, 8 వారాల్లో దేశవ్యాప్తంగా వీధికుక్కల సమస్యపై పూర్తి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన గడువు విధించింది. ఈ స్పెషల్ డ్రైవ్ విజయవంతమైతే, రాబోయే రోజుల్లో వీధికుక్కలు, రోడ్లపై తిరిగే పశువుల సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?
Modi ji: మోదీ జీ మీ స్కిన్‌కేర్ రహస్యం ఏంటి.. హర్లీన్ ప్రశ్నకు స్నేహ్ రాణా స్మార్ట్ సమాధానం!
Team meets President: రాష్ట్రపతిని కలిసిన WWC విజేత భారత మహిళల జట్టు.. భారత గర్వం మీరు అంటూ ముర్ము ప్రశంస!
World Cup winner: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన శ్రీ చరణి ఘన సత్కారం – సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కోట్ల బహుమతి, స్థలం, ఉద్యోగం!
Jobs: గ్రామీణ యువతకు బంగారు అవకాశమిది..! ప్రభుత్వ రాయితీలతో స్వయం ఉపాధి కల!
Indigo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కలకలం! భారీ ఫారెక్స్‌ నష్టం.. వ్యవస్థాపకుడు వైదొలిక..!

Spotlight

Read More →