జిమ్‌కి ప్రతిరోజూ వెళ్లి బరువులు ఎత్తుతూ కష్టపడటం చాలామందికి ఫిట్‌నెస్ సాధనలో భాగమే. కానీ, సరైన టెక్నిక్ లేకుండా చేసే వ్యాయామాలు మీ శరీరానికి మేలు కంటే చెడు ఎక్కువ చేస్తాయి అని ఫిట్నెస్ ట్రైనర్స హెచ్చరిస్తున్నారు.
నేషనల్ అకాడమీ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ (NASM) సర్టిఫైడ్ ట్రైనర్ అలెక్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వీడియోలో జాయింట్లను పాడుచేసే ఎనిమిది ప్రధాన వర్కౌట్ తప్పిదాలుగురించి వివరించారు అవి ఈ క్రింది విధంగా వివరించబడినది.
అప్రైట్ రోస్
ఈ వ్యాయామం చేయడం మొదట బాగానే అనిపించినా కాలక్రమేణా భుజాలు క్లిక్ అవడం లేదా నొప్పి రావడం ప్రారంభమవుతుంది. అంతర్గత రోటేషన్‌తో బరువులు ఎత్తడం భుజాలకు ప్రమాదకరం అని ఆయన హెచ్చరించారు.
బెంచ్ ప్రెస్
బెంచ్ ప్రెస్ సమయంలో చేతులను ఎక్కువగా బయటకు తిప్పడం వల్ల భుజాలపై ఒత్తిడి పెరుగుతుంది. అలెక్స్ సూచన – మోచేతులను లోపలికి తిప్పండి, వెన్నుని సెట్ చేసుకోండి, బార్‌ను నియంత్రించండి. లేకపోతే గాయం తప్పదు అని తెలిపారు.
బిహైండ్ ది నెక్ ప్రెస్
ఈ వ్యాయామం భుజాల కదలికలకు అనుకూలం కాదని అలెక్స్ చెబుతున్నారు. బార్‌ను తల వెనుక నుంచి కాకుండా ముందుంచి లిఫ్ట్ చేయండి. దీని వల్ల భుజాలపై ఒత్తిడి తగ్గుతుంది అన్నారు.
స్మిత్ మెషీన్ స్క్వాట్స్
స్మిత్ మెషీన్‌లో ఫిక్స్‌డ్ బార్‌తో స్క్వాట్స్ చేయడం మోకాళ్లకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ట్రైనర్ హెచ్చరించారు. ఫ్రీ బార్‌తో నేర్చుకోవడం మంచిది లేనిపక్షంలో మీ జాయింట్లు ముందే రిటైర్ అవుతాయి అని ఆయన హాస్యంగా అన్నారు.
గుడ్ మార్నింగ్
గుడ్ మార్నింగ్ ఎక్సర్సైజ్‌లో అధిక బరువు ఉపయోగించడం వెన్నుపూసకు ప్రమాదకరం. హ్యామ్‌స్ట్రింగ్‌లను ఫీలవ్వడం లేదు, వెన్ను వంచి ప్రార్థిస్తున్నట్టు ఉన్నారు అని ఆయన వ్యాఖ్యానించారు.
కిప్పింగ్ పుల్-అప్స్
అలెక్స్ ప్రకారం ఇవి అసలు పుల్‌అప్స్ కావు. ఇవి నియంత్రణ లేకుండా చేసే ఊగుడు కదలికలు మాత్రమే. పూర్తి నియంత్రణతో చేసే పుల్‌అప్స్‌నే నిజమైన వ్యాయామం అన్నారు.
లెగ్ ప్రెస్‌లో
లెగ్ ప్రెస్ చేసేప్పుడు చేతులతో మోకాళ్లను తోసుకోవడం వర్కౌట్‌కి ఉపయోగం లేకుండా మోకాళ్లను పాడుచేస్తుంది. ఇది మోకాళ్లను దుమ్ముగా మార్చేస్తుంది అని ఆయన హెచ్చరించారు.
హెవీ శ్రగ్స్
చాలామంది శ్రగ్స్ చేయడం సమయంలో భుజాలను చుట్టే కదలికలు చేస్తారు. కానీ ఇది ట్రాప్ మసిల్స్‌ను అభివృద్ధి చేయదు. “భుజాలను పైకి నేరుగా ఎత్తండి, నియంత్రణలో ఉంచండి,” అని అలెక్స్ చెప్పారు.
జిమ్‌లో కష్టపడటం మంచిదే, కానీ అజ్ఞానంగా చేయడం కాదు. సరైన టెక్నిక్ నేర్చుకుంటేనే ఫలితాలు వస్తాయి.తప్పుడు ఫార్మ్ లేదా ఇగో లిఫ్టింగ్ కారణంగా కండరాలు పెరగడం కాకుండా గాయాలు, జాయింట్ డ్యామేజ్ వంటి సమస్యలు వస్తాయి. చిన్న వయసులోనే భుజాలు, మోకాళ్లు లేదా వెన్నుపూస నొప్పులు మొదలైతే, దీర్ఘకాలంలో శారీరకంగా దెబ్బతింటారు.ఇలాంటి వ్యాయామ తప్పిదాల నుంచి దూరంగా ఉంటే, ఆరోగ్యకరమైన శరీరం, బలమైన జాయింట్లు చాలా కాలం పాటు మీతో ఉంటాయి.
ఈ సమాచారం కేవలం అవగాహనకు మాత్రమే ముందుగా మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీ డాక్టర్ సలహా లు అదేవిధంగా సరైన వ్యాయామ పద్ధతులు మరియు సర్టిఫైడ్ ట్రైనర్‌ను సంప్రదించండి.