Telangana Welfare Schemes: తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే 'తులం బంగారం' పథకం అమలుపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన..!! Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లో స్పెషల్ ట్రైన్స్ అక్కడ వరకు పొడిగింపు! Amaravati Legality Bill: ఏపీ రాజధానిగా అమరావతి శాశ్వతం - నేడే రాష్ట్రపతి ఆమోద ముద్ర..! Kandula Durgesh: సేవా పథంలో అక్కడ సరికొత్త రికార్డు.. 21 నెలల్లో 781 మందికి రూ.5.66 కోట్ల లబ్ధి! Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? అయితే ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి! AP Govt Employees: అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు క్లాస్.. 'సూపర్ అచీవర్స్'కు అదిరిపోయే ఆఫర్! Home Minister Anita: చల్లపల్లి పేలుడు ఘటనపై హోం మంత్రి సమీక్ష.. ధైర్యంగా ఉండండి.. మేమున్నాం.! TV actress death: బుల్లితెరపై విషాదం.. టీవీ నటి ఆత్మహత్య.. వీడియో కాల్ వాగ్వాదమే కారణమా? Atchannaidu: రూ. 4,360 కోట్లతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మార్పు.. పోర్టు నిర్మాణ పనుల క్షేత్రస్థాయి పరిశీలన.. Minister Gottipati: మే 15 నాటికి పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ సిద్ధం.. అధికారులకు మంత్రి గొట్టిపాటి డెడ్ లైన్! Telangana Welfare Schemes: తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే 'తులం బంగారం' పథకం అమలుపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన..!! Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లో స్పెషల్ ట్రైన్స్ అక్కడ వరకు పొడిగింపు! Amaravati Legality Bill: ఏపీ రాజధానిగా అమరావతి శాశ్వతం - నేడే రాష్ట్రపతి ఆమోద ముద్ర..! Kandula Durgesh: సేవా పథంలో అక్కడ సరికొత్త రికార్డు.. 21 నెలల్లో 781 మందికి రూ.5.66 కోట్ల లబ్ధి! Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? అయితే ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి! AP Govt Employees: అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు క్లాస్.. 'సూపర్ అచీవర్స్'కు అదిరిపోయే ఆఫర్! Home Minister Anita: చల్లపల్లి పేలుడు ఘటనపై హోం మంత్రి సమీక్ష.. ధైర్యంగా ఉండండి.. మేమున్నాం.! TV actress death: బుల్లితెరపై విషాదం.. టీవీ నటి ఆత్మహత్య.. వీడియో కాల్ వాగ్వాదమే కారణమా? Atchannaidu: రూ. 4,360 కోట్లతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మార్పు.. పోర్టు నిర్మాణ పనుల క్షేత్రస్థాయి పరిశీలన.. Minister Gottipati: మే 15 నాటికి పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ సిద్ధం.. అధికారులకు మంత్రి గొట్టిపాటి డెడ్ లైన్!

Peddi Movie Update: రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తున్న 'పెద్ది'.. చరణ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓటీటీ బిజినెస్..!

Peddi Netflix OTT Deal: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. రూ. 150 కోట్ల మార్కును టచ్ చేస్తున్న ఈ క్రేజీ డీల్ వివరాలు సినిమా లేటెస్ట్ అప్‌డేట్స్..

Published : 2026-04-06 14:50:00

Peddi Netflix OTT Deal: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న 'పెద్ది' సినిమా గురించి సినీ ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నప్పటికీ, అప్పుడే రికార్డు స్థాయి బిజినెస్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా ఓటీటీ హక్కుల విషయంలో ఈ చిత్రం సౌత్ ఇండియాలోనే ఒక క్రేజీ డీల్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ 'పెద్ది' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ డీల్ సుమారు రూ. 130 కోట్లకు కుదిరింది. ఒకవేళ సినిమా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తే, నిర్మాతలకు అదనంగా మరో రూ. 20 కోట్లు బోనస్‌గా లభిస్తాయట. అంటే మొత్తం మీద ఈ ఒక్క సినిమా ఓటీటీ హక్కుల ద్వారానే రూ. 150 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం కనిపిస్తోంది.

దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. 'ఉప్పెన' వంటి భారీ విజయం తర్వాత ఆయన చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని విధంగా ఒక పవర్‌ఫుల్  రగ్గడ్ లుక్‌లో కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాలో ఆయన పహిల్వాన్‌గా, అలాగే క్రికెటర్‌గా రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నారు.

నటీనటుల విషయానికి వస్తే, ఇందులో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె 'అచ్చమ్మ' అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో అలరించనుంది. వీరితో పాటు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

అయితే, ఈ సినిమా విడుదల తేదీ విషయంలో అభిమానులకు కొంచెం నిరాశ కలిగే వార్త వినిపిస్తోంది. ముందుగా ఈ చిత్రాన్ని 2026 ఏప్రిల్ 30న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు  పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల విడుదల కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మేకర్స్ త్వరలోనే కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఏది ఏమైనా, 'పెద్ది' సినిమా చరణ్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

Spotlight

Read More →