ఏపీ ప్రజలకు మరో శుభవార్త! రూ.4,260 కోట్లతో అంతర్జాతీయ క్యాన్సర్ సెంటర్.. ఇక్కడే ఫిక్స్!

లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు అనేక అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా హిందూజా గ్రూప్‌ చైర్మన్‌ అశోక్‌ హిందూజా, యూరప్‌ వింగ్‌ చైర్మన్‌ ప్రకాశ్‌ హిందూజాలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమల విస్తరణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఫలితంగా రూ.20 వేల కోట్ల విలువైన పెట్టుబడులను రాష్ట్రంలో దశలవారీగా పెట్టాలని హిందూజా గ్రూప్‌ అంగీకరించింది.

గుడ్ న్యూస్.. మరో నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు! దేశవ్యాప్తంగా 164కి చేరిన సర్వీసులు!

ఈ ఒప్పందంలో భాగంగా విశాఖపట్నంలోని హిందూజా థర్మల్‌ ప్లాంట్‌ సామర్థ్యాన్ని 1,050 మెగావాట్ల నుంచి 2,650 మెగావాట్లకు పెంచనున్నారు. రెండు కొత్త యూనిట్లను ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యంతో స్థాపించనున్నారు. అలాగే రాయలసీమ ప్రాంతంలో భారీ స్థాయిలో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రం మరింత ప్రగతి సాధించనుంది. అదనంగా, కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాణిజ్య వాహనాల తయారీ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.

5 డాలర్ల జీతం నుంచి యజమాని స్థాయికి.. ఇండియన్-అమెరికన్ అమోల్ కోహ్లీ సక్సెస్ స్టోరీ! పాత్రలు కడిగిన చోటే.!

ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఈవీ చార్జింగ్ నెట్‌వర్క్ ఏర్పడనుంది. ఈ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల రంగానికి నూతన ఉత్సాహాన్ని ఇవ్వనున్నాయి. లండన్‌లో జరిగిన ఈ సమావేశంలో రోల్స్ రాయిస్, ఆక్టోపస్ ఎనర్జీ, శామ్కో హోల్డింగ్ సంస్థల ప్రతినిధులతోనూ సీఎం సమావేశమయ్యారు. ఈ సంస్థలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.

Bhagavad Gita: నేను దేహం కాదని తెలిపే పరమజ్ఞానమే నిజమైన ఆత్మసాక్షాత్కారం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -50!

రోల్స్ రాయిస్ సంస్థ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్లు, డీజిల్ ప్రొపెల్షన్ సిస్టమ్స్ తయారీకి సంబంధించి ఏపీలోని ఓర్వకల్లులో మిలటరీ ఎయిర్‌స్ట్రిప్‌, మెయింటెనెన్స్‌, రిపేర్‌, ఓవర్‌హాలింగ్ (MRO) యూనిట్ల స్థాపనపై చర్చించారు. విశాఖ, తిరుపతి ప్రాంతాల్లో గ్లోబల్ కేపబుల్ సెంటర్ల ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. ఈ చర్చలు ఏరోస్పేస్‌ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ కొత్త దశను ప్రారంభించనున్నాయి.

MoRTH: రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు మరో కీలక అడుగు.. MoRTH చర్యలు వేగం!

చివరగా, లండన్‌లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు టెక్నాలజీ రంగంలో రాష్ట్రం సాధిస్తున్న పురోగతిని వివరించారు. అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌, క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌ స్థాపన పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వివిధ వర్సిటీలతో భాగస్వామ్యంగా రేర్ మినరల్స్‌ వెలికితీత, డేటా అనలిటిక్స్‌, క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల అభివృద్ధిపై కూడా చర్చించారు. ఈ చర్యలు రాష్ట్రాన్ని టెక్నాలజీ, పరిశ్రమల, పునరుత్పాదక ఇంధన రంగాల్లో జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లనున్నాయి.

40 గంటల మ్యూజిక్ నాన్‌స్టాప్.. తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో లావా నెక్ బ్యాండ్!
అంతరిక్షానికి అత్యంత దగ్గరగా ఏ దేశం ఉంది? నేపాల్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే!!
యూఏఈ నివాసితులకు గుడ్‌న్యూస్.. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో యూఏఈ కొత్త అడుగు! బుర్జ్ ఖలీఫా వేదికగా..
రేపు టీడీపీ కేంద్ర కార్యాలయానికి మంత్రి లోకేష్! ప్రజావేదికలో...
TTd: ఇలా చేస్తే తిరుమలలో వేగంగా దర్శనం.. 1985లో ప్రారంభమైన ప్రత్యేక దర్శనం!