మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా నుంచి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించబడింది. చికిరి అనే టైటిల్‌తో వస్తున్న ఈ పాటను నవంబర్ 7న 11.7 Am కి గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం ఇప్పటికే ఫస్ట్ లుక్, గ్లింప్స్‌తో ఊహలు రేపింది. ఇప్పుడు పాట ప్రోమో విడుదల కావడంతో సినిమా చుట్టూ హైప్ మరింత పెరిగింది. ప్రోమోలో రామ్ చరణ్ చేసిన మాస్ హుక్ స్టెప్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, రిధమ్ వినిపించగానే థియేటర్లలో ఈ పాట సెన్సేషన్‌గా మారబోతుందనే అంచనాలు మొదలయ్యాయి.
సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న జాన్వీ కపూర్‌ను చూసే ఆ క్షణంలో హీరోలో కలిగే ఫీలింగ్స్‌ను ఈ పాట ఎక్స్‌ప్రెస్ చేస్తుందట. గ్రామీణ ప్రేమ భావోద్వేగాలతో సాగుతున్న ఈ లిరికల్ సాంగ్‌లో అలంకరణ అక్కర్లేని అందం… అరుదైన చికిరిరా ఈ చికిరి అని వచ్చే లైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుందని సినిమా వర్గాల అంచనా.
అస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం ఈ ప్రాజెక్ట్‌పై మరింత దృష్టిని సారించించింది. రిహార్సల్స్ సమయంలో చికిరి అంటే ఏమిటి? అని రెహమాన్ ప్రశ్నించగా బుచ్చిబాబు — మా ఊర్లో అందంగా ఉండే అమ్మాయిని ప్రేమగా పిలిచే పదం అని చెప్పిన వెంటనే, ఆ పదానికే సాంగ్ నిర్మించాలని ఆయన నిర్ణయించుకున్నారట.
ప్రోమోలో రామ్ చరణ్ బీడీతో చేసే కిక్ తో కూడిన హుక్ మూమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఒక్క స్టెప్‌కి ఓపెనింగ్ డేలో థియేటర్లు షేక్ అవుతాయి అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడగా, ఇప్పుడు వచ్చిన సాంగ్ అప్డేట్ ఆ హైప్‌ను మరింత పెంచేసింది. వచ్చే ఏడాది మార్చిలో చిత్రం విడుదల కానుంది.