WhatsApp Privacy Tips: మీ వాట్సాప్ మెసేజ్‌లు ఎవరూ చూడకూడదా? ఈ సెట్టింగ్ వెంటనే ఆన్ చేసుకోండి..!! NASA: సోషల్ మీడియాలో నాసా ఫోటో హల్చల్.. అంతరిక్షం నుంచి భూమి అద్భుత చిత్రాన్ని విడుదల.. Iran Israel War 2026: సముద్ర గర్భంలో యుద్ధ జ్వాలలు.. భారత్‌లో నెట్ సేవలు నిలిచిపోనున్నాయా? Whatsapp New Feature: స్పామ్ మెసేజ్‌లతో ఇబ్బంది పడుతున్నారా... వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్! Instagram Update: ఇన్‌స్టాగ్రామ్ క్రేజీ అప్‌డేట్... ఇప్పుడు మీ వాయిస్ మెసేజ్ లకు ఏఐ ఎఫెక్ట్స్! Save Power: వేసవిలో కరెంట్ బిల్లు టెన్షన్ వద్దు..! ఏసీ వాడకంలో ఈ చిట్కాలు పాటించండి! Slow WiFi: మీ వైఫై స్పీడ్ రాకెట్‌లా దూసుకెళ్లాలంటే.. ఈ టిప్స్ పాటించండి! Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో అదిరిపోయే ఫీచర్..! మీ పర్సనల్ ట్రావెల్ గైడ్ రెడీ! AI Services: ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ విప్లవం... పేదలకు చేరువకానున్న కార్పొరేట్ వైద్యం! Google CEO: గూగుల్ సీఈఓ రికార్డ్ సాలరీ..! గంటకు ఆయన సంపాదన ఎంతో తెలుసా? WhatsApp Privacy Tips: మీ వాట్సాప్ మెసేజ్‌లు ఎవరూ చూడకూడదా? ఈ సెట్టింగ్ వెంటనే ఆన్ చేసుకోండి..!! NASA: సోషల్ మీడియాలో నాసా ఫోటో హల్చల్.. అంతరిక్షం నుంచి భూమి అద్భుత చిత్రాన్ని విడుదల.. Iran Israel War 2026: సముద్ర గర్భంలో యుద్ధ జ్వాలలు.. భారత్‌లో నెట్ సేవలు నిలిచిపోనున్నాయా? Whatsapp New Feature: స్పామ్ మెసేజ్‌లతో ఇబ్బంది పడుతున్నారా... వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్! Instagram Update: ఇన్‌స్టాగ్రామ్ క్రేజీ అప్‌డేట్... ఇప్పుడు మీ వాయిస్ మెసేజ్ లకు ఏఐ ఎఫెక్ట్స్! Save Power: వేసవిలో కరెంట్ బిల్లు టెన్షన్ వద్దు..! ఏసీ వాడకంలో ఈ చిట్కాలు పాటించండి! Slow WiFi: మీ వైఫై స్పీడ్ రాకెట్‌లా దూసుకెళ్లాలంటే.. ఈ టిప్స్ పాటించండి! Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో అదిరిపోయే ఫీచర్..! మీ పర్సనల్ ట్రావెల్ గైడ్ రెడీ! AI Services: ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ విప్లవం... పేదలకు చేరువకానున్న కార్పొరేట్ వైద్యం! Google CEO: గూగుల్ సీఈఓ రికార్డ్ సాలరీ..! గంటకు ఆయన సంపాదన ఎంతో తెలుసా?

Perplexity Model : ఒకే వేదికపై మూడు ఏఐ మోడల్స్.. సమాచార ఖచ్చితత్వం కోసం పర్ప్లెక్సిటీ కొత్త ప్లాన్.!!

Perplexity Model Council Feature Compare GPT Gemini Claude Answers

Published : 2026-02-09 17:44:00

మూడు ఏఐల డేటాను పోల్చి చూసే సులభమైన పద్ధతి.

ఇన్వెస్టర్లు, నిపుణుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫీచర్.

గూగుల్ సెర్చ్‌కు ప్రత్యామ్నాయంగా పర్ప్లెక్సిటీ ఎదుగుదల.

కృత్రిమ మేధ  రంగంలో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న చాట్‌జీపీటీ, జెమిని, క్లాడ్ వంటి ఏఐ మోడల్స్‌లో ఏది అత్యుత్తమ సమాచారాన్ని ఇస్తుందనే విషయంలో వినియోగదారుల్లో ఎప్పుడూ ఒక సందిగ్ధత ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రముఖ ఏఐ ఆన్సర్ ఇంజిన్ సంస్థ 'పర్ప్లెక్సిటీ'  ఒక సంచలన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనికి 'మోడల్ కౌన్సిల్'  అని పేరు పెట్టింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు తాము అడిగే ఒక్క ప్రశ్నకు, మూడు వేర్వేరు ఏఐ మోడల్స్ ఇచ్చే సమాధానాలను ఒకే చోట చూసి, సరిపోల్చుకునే అవకాశం లభిస్తుంది.

ఏమిటి ఈ 'మోడల్ కౌన్సిల్'?

సాధారణంగా మనం ఏదైనా క్లిష్టమైన విషయం గురించి తెలుసుకోవాలంటే ఒక్కో ఏఐ బాట్‌ను విడివిడిగా అడగాల్సి ఉంటుంది. కానీ పర్ప్లెక్సిటీ తెచ్చిన ఈ కొత్త మోడ్ ద్వారా, ఒకే విండోలో మూడు విభిన్న మోడల్స్  నుండి సమాధానాలను పొందవచ్చు. ఆయా మోడల్స్ ఇచ్చే సమాచారంలో ఎక్కడ ఏకీభవిస్తున్నాయి, ఎక్కడ విభేదిస్తున్నాయి అనే అంశాలను పర్ప్లెక్సిటీ తన ఇన్‌బిల్ట్ సింథసైజర్ ద్వారా విశ్లేషించి ఒక టేబుల్ రూపంలో వినియోగదారులకు అందిస్తుంది. దీనివల్ల సమాచారం యొక్క ఖచ్చితత్వాన్ని  నిర్ధారించుకోవడం సులభతరం అవుతుంది.

ప్రస్తుతం ఉన్న ఏఐ మోడల్స్ కొన్నిసార్లు తప్పుడు సమాచారాన్ని ఇచ్చే ప్రమాదం ఉంది.  దీనినే సాంకేతిక భాషలో 'బ్లైండ్ స్పాట్స్' అంటారు. ఒక మోడల్ ఇచ్చిన సమాచారం తప్పయితే, మిగిలిన రెండు మోడల్స్ ఇచ్చే డేటాతో దానిని క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ చేసే వారికి, క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన నిపుణులకు మరియు కొత్త ఆలోచనల కోసం బ్రెయిన్ స్టార్మింగ్ చేసే వారికి ఈ ఫీచర్ ఒక వరమని పర్ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ పేర్కొన్నారు.

ఎవరికి అందుబాటులో ఉంటుంది?

ప్రస్తుతానికి ఈ 'మోడల్ కౌన్సిల్' ఫీచర్ కేవలం పర్ప్లెక్సిటీ మ్యాక్స్ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే భవిష్యత్తులో దీనిని 'ప్రో' యూజర్లకు కూడా పరిమిత వినియోగం  కింద అందుబాటులోకి తెచ్చే ఆలోచన ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. ఒకేసారి మూడు శక్తివంతమైన మోడల్స్ రన్ చేయడం వల్ల నిర్వహణ ఖర్చు  భారీగా ఉంటుందని, అందుకే దీనిని ప్రీమియం ఫీచర్‌గా ఉంచినట్లు అరవింద్ శ్రీనివాస్ స్పష్టం చేశారు.

టెక్ ప్రపంచంలో పెనుమార్పులు

శామ్‌సంగ్ తన కొత్త గెలాక్సీ ఫోన్లలోని 'బిక్స్బీ ఫీచర్ల కోసం ఇప్పటికే పర్ప్లెక్సిటీతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ 'మోడల్ కౌన్సిల్' రాకతో గూగుల్ మరియు ఓపెన్ ఏఐ వంటి దిగ్గజ సంస్థలకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. సమాచారాన్ని వెతకడం మాత్రమే కాకుండా, వివిధ కోణాల్లో దానిని విశ్లేషించి అందించడం వల్ల సెర్చ్ ఇంజిన్ల భవిష్యత్తు పూర్తిగా మారిపోనుంది

Spotlight

Read More →