భారత క్రికెట్ అభిమానులకు ఇది తీవ్ర నిరాశను కలిగించే వార్త. ఇంగ్లాండ్ తో సొంత గడ్డపై జరుగుతున్న టెస్ట్ సిరీస్ చివరి మూడు టెస్టులకు స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ దూరంగా ఉంటున్నాడు. ఈ టెస్టులకు దూరంగా ఉండాలని కోహ్లీ నిర్ణయం తీసుకున్నాడు. కోహ్లీ నిర్ణయంపై బీసీసీఐ సెక్రటరీ జే షా స్పందిస్తూ.... కోహ్లీ నిర్ణయాన్ని బీసీసీఐ గౌరవిస్తుందని చెప్పారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
టెస్ట్ సిరీస్ లో జట్టులోని ఇతర ఆటగాళ్ల సమర్థ్యాలపై టీమ్ మేనేజ్ మెంట్ కు, బోర్డుకు నమ్మకం ఉందని తెలిపారు. కోహ్లీ నుంచి క్లారిటీ రాకపోవడం వల్లే చివరి మూడు టెస్టులకు జట్టు ప్రకటన ఆలస్యమయింది. ఇప్పుడు కోహ్లీ తన నిర్ణయాన్ని తెలియజేయడంతో జట్టును ప్రకటించే అవకాశం ఉంది. జడేజా, కేఎల్ రాహుల్ ఫిట్ నెస్ కు సంబంధించి జాతీయ క్రికెట్ అకాడెమీ నుంచి నివేదికలు రావాల్సి ఉంది. గాయం బారిన పడిన శ్రేయస్ అయ్యర్ కి కూడా జట్టులో స్థానం దక్కక పోవచ్చు. సర్ఫరాజ్ ఖాన్ కు అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి