T20 cricket: టీ20 ప్రపంచకప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో సంచలనం: ఐవరీ కోస్ట్‌ను వణికించిన రువాండా రికార్డుల జాతర! IPL 2026: సీఎస్‌కే నెక్స్ట్ హెడ్ కోచ్ ఎంఎస్ ధోనీ?: అశ్విన్ 'ఎక్స్' పోస్ట్‌తో ఐపీఎల్‌లో మొదలైన కొత్త చర్చ! IPL 2026: కృనాల్ వింత బౌలింగ్‌కు కావ్య మారన్ షాక్.. స్టాండ్స్‌లో ఆమె రియాక్షన్ వైర‌ల్‌! Indian cricket team: రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ అనుమానాలు.. వరల్డ్‌ కప్‌నకు కష్టమేనా? Cricket Australia: భారత్‌లో బీబీఎల్ మ్యాచ్‌లు.. క్రికెట్ లవర్స్ కు పండగే! రెండో లేదా మూడో వారంలో... Hardik Pandya: ఒకపక్క వెన్నునొప్పి, మరోపక్క రెండో పెళ్లి వార్తలు.. సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా హల్‌చల్! IPL tickets: ఐపీఎల్ అభిమానుల‌కు అల‌ర్ట్‌.. నకిలీ ఐపీఎల్ వెబ్‌సైట్ల జోరు.. డబ్బు, డేటా రెండూ చోరీ! IPL 2026: పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానం కోసం పోరు.. టాస్ గెలిచిన హైదరాబాద్‌కు అడ్వాంటేజ్! IPL 2026: ఢిల్లీ గెలిచినా.. కెప్టెన్ అక్షర్ పటేల్‌కు మాత్రం షాక్! ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టుకు.. IPL 2026: ఐపీఎల్ లో నేడు ఢిల్లీతో పంజాబ్ ఢీ... టాస్ గెలిచి సరదా వ్యాఖ్య చేసిన అక్షర్ పటేల్! T20 cricket: టీ20 ప్రపంచకప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో సంచలనం: ఐవరీ కోస్ట్‌ను వణికించిన రువాండా రికార్డుల జాతర! IPL 2026: సీఎస్‌కే నెక్స్ట్ హెడ్ కోచ్ ఎంఎస్ ధోనీ?: అశ్విన్ 'ఎక్స్' పోస్ట్‌తో ఐపీఎల్‌లో మొదలైన కొత్త చర్చ! IPL 2026: కృనాల్ వింత బౌలింగ్‌కు కావ్య మారన్ షాక్.. స్టాండ్స్‌లో ఆమె రియాక్షన్ వైర‌ల్‌! Indian cricket team: రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ అనుమానాలు.. వరల్డ్‌ కప్‌నకు కష్టమేనా? Cricket Australia: భారత్‌లో బీబీఎల్ మ్యాచ్‌లు.. క్రికెట్ లవర్స్ కు పండగే! రెండో లేదా మూడో వారంలో... Hardik Pandya: ఒకపక్క వెన్నునొప్పి, మరోపక్క రెండో పెళ్లి వార్తలు.. సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా హల్‌చల్! IPL tickets: ఐపీఎల్ అభిమానుల‌కు అల‌ర్ట్‌.. నకిలీ ఐపీఎల్ వెబ్‌సైట్ల జోరు.. డబ్బు, డేటా రెండూ చోరీ! IPL 2026: పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానం కోసం పోరు.. టాస్ గెలిచిన హైదరాబాద్‌కు అడ్వాంటేజ్! IPL 2026: ఢిల్లీ గెలిచినా.. కెప్టెన్ అక్షర్ పటేల్‌కు మాత్రం షాక్! ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టుకు.. IPL 2026: ఐపీఎల్ లో నేడు ఢిల్లీతో పంజాబ్ ఢీ... టాస్ గెలిచి సరదా వ్యాఖ్య చేసిన అక్షర్ పటేల్!

డీఎస్పీ ఉద్యోగంతో పాటు రూ.3 కోట్ల నజరానా అందించిన సీఎం ఆదిత్యనాథ్...

భారత మహిళల క్రికెట్ జట్టులో కీలక ఆల్ రౌండర్ గా ఎదిగిన దీప్తి శర్మకు ప్రతిభకు తగిన ప్రతిఫలం దక్కింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీప్తి శర్మను డీఎస్పీగా నియమించింది.

Published : 2024-01-30 21:01:00

భారత మహిళల క్రికెట్ జట్టులో కీలక ఆల్ రౌండర్ గా ఎదిగిన దీప్తి శర్మకు ప్రతిభకు తగిన ప్రతిఫలం దక్కింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీప్తి శర్మను డీఎస్పీగా నియమించింది.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆమెకు డీఎస్పీ నియామకపత్రంతో పాటు రూ.3 కోట్ల నగదు నజరానా కూడా అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను దీప్తి శర్మ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 

ప్రస్తుతం దీప్తి శర్మ వయసు 26 ఏళ్లు. యూపీలోని ఆగ్రా దీప్తి శర్మ స్వస్థలం. 17 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన దీప్తి శర్మ టీమిండియాలో నమ్మదగిన ఆల్ రౌండర్ పేరుతెచ్చుకుంది.

అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ రాణిస్తోంది. 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇటీవల ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్ పోటీలు కూడా నిర్వహించగా, భారత జట్టే చాంపియన్ గా నిలిచింది. అందులో దీప్తి శర్మ ప్రతిభకు మెచ్చిన యూపీ సర్కారు డీఎస్పీ ఉద్యోగంతో పాటు, నగదు నజరానా ప్రకటించింది. 

సీఎం చేతుల మీదుగా నియామకపత్రం, నజరానా తాలూకు చెక్ అందుకున్న అనంతరం దీప్తి శర్మ సంతోషం వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తనపై చూపిస్తున్న ఆదరణను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని తెలిపింది. 

దీప్తి శర్మ కెరీర్ లో ఇప్పటివరకు 104 అంతర్జాతీయ టీ20లు ఆడి 1,015 పరుగులు చేసింది. అదే సమయంలో 113 వికెట్లు పడగొట్టింది.

86 వన్డేల్లో 1,982 పరుగులు చేసి, 100 వికెట్లు తీసింది. ఇప్పటివరకు 4 టెస్టుల్లో 317 పరుగులు చేసి, 16 వికెట్లు పడగొట్టింది. వన్డేల్లో ఒక సెంచరీ నమోదు చేసింది.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →