అంతరిక్షానికి అత్యంత దగ్గరగా ఏ దేశం ఉంది? నేపాల్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే!! Bulgaria: బల్గేరియాలో లెవ్‌కు గుడ్‌బై! 2026 జనవరి నుంచి కొత్త కరెన్సీ! కొత్త భయం.. తండ్రికి కరోనా సోకితే.. పుట్టబోయే పిల్లలపై తీవ్ర ప్రభావం.! ప్రజారోగ్యానికి పెను సవాల్! భారీ జీతంతో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో జాబ్స్ నవంబర్ 14 చివరి తేదీ.. పూర్తి వివరాలు ఇవే! వయసు పైబడిన వారికి గుడ్ న్యూస్.. కొత్త యాంటీబయాటిక్ - తక్కువ డోస్ తో ఎక్కువ ప్రభావం! అంతరిక్షానికి అత్యంత దగ్గరగా ఏ దేశం ఉంది? నేపాల్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే!! Bulgaria: బల్గేరియాలో లెవ్‌కు గుడ్‌బై! 2026 జనవరి నుంచి కొత్త కరెన్సీ! కొత్త భయం.. తండ్రికి కరోనా సోకితే.. పుట్టబోయే పిల్లలపై తీవ్ర ప్రభావం.! ప్రజారోగ్యానికి పెను సవాల్! భారీ జీతంతో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో జాబ్స్ నవంబర్ 14 చివరి తేదీ.. పూర్తి వివరాలు ఇవే! వయసు పైబడిన వారికి గుడ్ న్యూస్.. కొత్త యాంటీబయాటిక్ - తక్కువ డోస్ తో ఎక్కువ ప్రభావం!

Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..!

2025-11-05 15:40:00
Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..!

ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. రాజధాని మరియు పరిసర ఎన్‌సీఆర్ ప్రాంతాలు దట్టమైన పొగమంచుతో కమ్ముకుపోయి, ప్రజలు ఊపిరి పీల్చుకోలేని స్థితికి చేరుకున్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) గణాంకాల ప్రకారం అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి (AQI) 400 మార్కును దాటింది. ఇది ‘తీవ్ర ప్రమాదకర’ శ్రేణిగా పరిగణించబడుతుంది. ఈ నేపథ్యంలో భారత్‌కు సహాయం చేసేందుకు చైనా ముందుకొచ్చింది. భారత్‌లోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి యూజింగ్, సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌’ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు.

మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో...

యూజింగ్ పేర్కొన్నదేమిటంటే—ఒకప్పుడు చైనా కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నదని, అయితే ప్రభుత్వం తీసుకున్న సమగ్ర చర్యల వల్ల కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించగలిగిందని అన్నారు. “గాలి కాలుష్యం నియంత్రణలో మేము సాధించిన విజయాలు భారత్‌కు దోహదం అవుతాయి. మా అనుభవాలను పంచుకునేందుకు, సాంకేతిక సహాయం అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. భారత్ త్వరలోనే ఈ సంక్షోభం నుంచి బయటపడుతుందని విశ్వసిస్తున్నాం” అని యూజింగ్ పేర్కొన్నారు.

BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో..

చైనా గాలి నాణ్యతను మెరుగుపరచడంలో చేపట్టిన చర్యలు గమనించదగ్గవి. బీజింగ్‌తో పాటు పలు పారిశ్రామిక నగరాల్లో వాయు కాలుష్యం తీవ్రమైన స్థాయికి చేరుకున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం కఠిన నియంత్రణ విధానాలను అమలు చేసింది. కాలుష్య ఉద్గారాలపై పరిమితులు విధించి, నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై భారీ జరిమానాలు విధించింది. అదనంగా, పొగమంచు తీవ్రత పెరిగిన సమయాల్లో కొన్ని కర్మాగారాలను తాత్కాలికంగా మూసివేసి, కొన్ని పట్టణాల నుంచి దూరంగా తరలించింది. ఈ చర్యలతో నగరాల్లో గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడింది.

Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..!

పర్యావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం, భారత్ కూడా చైనా తరహా కఠిన చర్యలు తీసుకుంటే వాయు కాలుష్య సమస్యను కొంతమేర నియంత్రించవచ్చని సూచిస్తున్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచడం, విద్యుత్ వాహనాల ప్రోత్సాహం, సౌర, పవన శక్తి ఉత్పత్తిలో పెట్టుబడులు పెట్టడం వంటి మార్గాలు సమర్థవంతంగా పనిచేస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా వంటి ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, అనేక మంది మాస్కులు ధరించి బయటకు వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చైనా సహకారం భారత్‌కు ఒక కీలక మలుపు కావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రూ. 30కే 100 కి.మీ మైలేజ్.. EMIలో నెలకు రూ.1,700కే ఇంటికి తెచ్చుకోండి! ధర.. ఫీచర్లు ఇవే!
Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు!
చేనేత బ్రాండ్ ఆవిష్కరణ.. లోకేష్ చేతుల మీదుగా.. 70కి పైగా స్టాల్స్‌తో 'వసంతం-2025' ఎగ్జిబిషన్!
Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక!
ఏజెంట్లు లేకుండానే హజ్.. నుసుక్ హజ్ ద్వారా నేరుగా నమోదు చేసుకునే అవకాశం! సౌదీ అరేబియా సంచలన నిర్ణయం!
Movie Update: చీకటి గుహలో మీనాక్షి: ఎన్‌సీ 24 మిస్టరీ థ్రిల్లర్‌.. దక్ష ఏం కనిపెడుతోంది?

Spotlight

Read More →