శ్రీహరికోట: ఆదిత్య ఎల్-1 మిషన్ సక్సెస్ - శూన్య కక్ష్యలోకి ప్రవేశించిన ఆదిత్య ఎల్-1 వ్యోమనౌక – 126 రోజుల పాటు ప్రయాణించిన ఆదిత్య ఎల్-1 – వచ్చే ఐదేళ్ల పాటు సూర్యుడిపై ఆదిత్య ఎల్-1 అధ్యయనం – సూర్యుడి వివవరాలను భూమికి పంపనున్న ఆదిత్య ఎల్-1
సూర్యుడిపై అధ్యయనాల కోసం ఇస్రో గతేడాది సెప్టెంబరు 2న నింగిలోకి పంపిన ఆదిత్య-ఎల్1ను శనివారం సాయంత్రం తుది కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. రాకెట్ నింగిలోకి వెళ్లాక నాలుగు విన్యాసాలు, ట్రాన్స్ లగ్రాంజియన్ పాయింట్-1 ఇన్సర్షన్ విన్యాసాలు విజయవంతంగా నిర్వహించారు. ఇది శనివారం 63 నిమిషాల 20 సెకన్లపాటు ప్రయాణించాక ఆదిత్య-ఎల్1 అంతరిక్ష నౌకను భూమి చుట్టూ 23519500 కి.మీ. దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
ఆదిత్య- ఎల్1 తన గమ్యస్థానాన్ని విజయవంతంగా చేరుకుంది. ఈ స్పేస్ క్రాప్ట్ను తుది కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) శనివారం చేపట్టిన కీలక విన్యాసం ఫలించింది. భూమి నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్ష్యలోకి దీన్ని పంపించారు. ఇక్కడి నుంచి ఇది నిరంతరం సూర్యుడిని పర్యవేక్షిస్తుంది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం 'ఆదిత్య-ఎల్1' లక్ష్యం. భారత్ తరఫున సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇదే. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇవి కీలకమైన సమాచారాన్ని అందించనున్నాయి.
ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ సహా పలువురు శాస్త్రవేత్తలు సాధించిన ఈ విజయాన్ని అభినందిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి