విమాన ప్రయాణం అంటే పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమని అనుకుంటాం, ముఖ్యంగా అమెరికాలో. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA)లో మొత్తం 16,116 విమానాశ్రయాలు ఉన్నాయి. ఈ సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం. దేశం యొక్క విస్తారమైన భూభాగం, జనాభా వైవిధ్యం కారణంగా ఇంత పెద్ద విమాన నెట్వర్క్ సహజంగానే ఏర్పడింది. CIA.gov ప్రకారం, ఈ విమానాశ్రయాలు వాణిజ్య, ప్రైవేట్ మరియు సైనిక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
రెండవ స్థానంలో బ్రెజిల్ ఉంది. ఆ దేశంలో మొత్తం 5,297 విమానాశ్రయాలు ఉన్నాయి. బ్రెజిల్ విస్తారమైన భూభాగం మరియు పర్వతప్రాంతాలతో నిండిన భౌగోళిక నిర్మాణం కారణంగా, విమాన ప్రయాణం అక్కడ ప్రజల జీవనంలో ముఖ్యమైన భాగంగా మారింది. చిన్న గ్రామాలకు కూడా చేరుకునే చిన్న ఎయిర్‌స్ట్రిప్‌లు మరియు ప్రాంతీయ విమానాశ్రయాలు దేశంలోని అనేక ప్రాంతాలను కలుపుతున్నాయి.
మూడవ స్థానంలో ఆస్ట్రేలియా ఉంది, 2,257 విమానాశ్రయాలతో. జనాభా తక్కువగా ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియా భూభాగం చాలా విస్తారంగా ఉంటుంది. దూరప్రాంత గ్రామాలు, దీవులను కలుపుతూ విమాన రవాణా దేశానికి అత్యవసరం. ఇది కేవలం స్థానిక ప్రయాణాలకే కాకుండా పర్యాటక రంగానికి కూడా కీలకం.
మెక్సికో నాల్గవ స్థానంలో ఉంది, 1,580 విమానాశ్రయాలతో. వీటిలో చాలా తక్కువ సంఖ్యలోనే నియమిత వాణిజ్య విమానాలు నడుస్తున్నప్పటికీ, దేశం అంతటా ఉన్న అనేక ఎయిర్‌ఫీల్డ్‌లు ప్రాంతీయ కనెక్టివిటీకి బలాన్నిస్తాయి.
ఐదవ స్థానంలో కెనడా ఉంది, 1,459 విమానాశ్రయాలతో. అక్కడ విస్తారమైన భూభాగం ఉన్నా, కానీ జనాభా తక్కువగా ఉన్న ప్రాంతాలకు ఇవి జీవనాధారంలా పనిచేస్తాయి.
ఆరవ స్థానంలో ఫ్రాన్స్ ఉంది, 1,218 విమానాశ్రయాలతో. ఏడవ స్థానంలో యునైటెడ్ కింగ్డమ్ ఉంది, 1,057 విమానాశ్రయాలతో. ఇవి పారిస్, లండన్ వంటి నగరాల మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే, ఈ గణాంకాలు ప్రతి దేశం తమ భౌగోళిక మరియు సామాజిక అవసరాలకు అనుగుణంగా విమాన రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసుకున్నట్లు చూపిస్తున్నాయి. ప్రత్యేకంగా అమెరికా, విమానయాన రంగంలో ఉన్నత స్థాయి మౌలిక సదుపాయాలతో ప్రపంచానికి ఒక మోడల్‌గా నిలిచింది.