Google Maps: గూగుల్ మ్యాప్స్ అదిరిపోయే సరికొత్త ఫీచర్! మీరు అసలు ఊహించలేరు... ఒక లుక్కేయండి! ఏపీలో మరో దిగ్గజ ఐటీ సంస్థ! రూ.1,772 కోట్లతో... ఆ ప్రాంతానికి మహర్దశ! AIIMS eye survey2025: దేశంలో ప్రతి 65 వేల మందికి ఒక్క కంటి వైద్యుడు మాత్రమే – ఎయిమ్స్ అధ్యయనంలో ఆందోళనకర వివరాలు!! Gemini AI Google Maps :గూగుల్ మ్యాప్స్‌లో జెమినీ ఏఐ.. స్మార్ట్ ట్రావెల్ కొత్త యుగం ప్రారంభం! Rajasaab event : క్రిస్మస్‌కి అమెరికాలో రాజాసాబ్ ఈవెంట్.. న్యూ ఇయర్‌కి ట్రైలర్ బహుమతి! Wildlife: ఒంటరి ఆడ సింహి vs ఏడు సింహాలు: సిర్గా ప్రాణాలు ఎలా దక్కాయి? Job Opportunities: క్రీడాకారులకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగం! Visa: ఈ వీసా ఉంటే… ఆ 27 దేశాలు మీ చేతిలో ఉన్నట్టే! ఎలా అప్లై చేయాలి అనే పూర్తి సమాచారం మీ కోసమే!! Suspended: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! 26మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్! TTD Tokens: తిరుమల భక్తులకు కీలక ప్రకటన! ఇకనుండి ఆ టోకెన్లు పాత పద్ధతిలోనే.... Google Maps: గూగుల్ మ్యాప్స్ అదిరిపోయే సరికొత్త ఫీచర్! మీరు అసలు ఊహించలేరు... ఒక లుక్కేయండి! ఏపీలో మరో దిగ్గజ ఐటీ సంస్థ! రూ.1,772 కోట్లతో... ఆ ప్రాంతానికి మహర్దశ! AIIMS eye survey2025: దేశంలో ప్రతి 65 వేల మందికి ఒక్క కంటి వైద్యుడు మాత్రమే – ఎయిమ్స్ అధ్యయనంలో ఆందోళనకర వివరాలు!! Gemini AI Google Maps :గూగుల్ మ్యాప్స్‌లో జెమినీ ఏఐ.. స్మార్ట్ ట్రావెల్ కొత్త యుగం ప్రారంభం! Rajasaab event : క్రిస్మస్‌కి అమెరికాలో రాజాసాబ్ ఈవెంట్.. న్యూ ఇయర్‌కి ట్రైలర్ బహుమతి! Wildlife: ఒంటరి ఆడ సింహి vs ఏడు సింహాలు: సిర్గా ప్రాణాలు ఎలా దక్కాయి? Job Opportunities: క్రీడాకారులకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగం! Visa: ఈ వీసా ఉంటే… ఆ 27 దేశాలు మీ చేతిలో ఉన్నట్టే! ఎలా అప్లై చేయాలి అనే పూర్తి సమాచారం మీ కోసమే!! Suspended: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! 26మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్! TTD Tokens: తిరుమల భక్తులకు కీలక ప్రకటన! ఇకనుండి ఆ టోకెన్లు పాత పద్ధతిలోనే....

Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!!

2025-11-06 14:32:00

రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి తానేటి  అనిత  మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “నేటి యువతే రేపటి ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు. అందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువత రక్షణ, భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు” అని తెలిపారు.

డ్రగ్స్‌ సమస్యపై ప్రభుత్వం సున్నా సహనం విధానాన్ని అవలంబించిందని ఆమె చెప్పారు. ఈగల్‌ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, రాష్ట్రవ్యాప్తంగా గంజాయి సాగును దాదాపు జీరో స్థాయికి తగ్గించామని వివరించారు. “డ్రగ్స్ వద్దు బ్రో” అనే నినాదాన్ని పాఠశాల స్థాయికి తీసుకెళ్లి, 50 వేల స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

“ఒక తల్లి తన కుమార్తెను రక్షించండి అని వేడుకున్న సందర్భం నాకెప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ ఘటన తర్వాతే డ్రగ్స్‌ను రాష్ట్రం నుంచి పూర్తిగా తుడిచిపెట్టాలని సంకల్పించాం,” అని అనిత గారు చెప్పారు.

వైసీపీ పాలనలో డ్రగ్స్‌ దందా విస్తరించిందని ఆమె తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వం యువతకు చెడు అలవాట్లు దూరం చేయాలని ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అంటుంటే, వైసీపీ మాత్రం ‘డ్రగ్స్ తీసుకో బ్రో’ అన్నట్టుగా ప్రవర్తిస్తోంది. జగన్‌మోహన్ రెడ్డి పాలనలో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ ను గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయింది, అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ పాలనలో దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్‌కే దారి తీసేవని అనిత గారు తెలిపారు. “జగన్ ఐదేళ్ల పాలనలో డ్రగ్స్‌పై ఒక్క సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేదు. అయితే ప్రస్తుతం మా ప్రభుత్వం ఆరుగురు మంత్రులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేసి, ఈగల్‌, టాస్క్‌ఫోర్స్‌, రైల్వే పోలీస్‌లతో సమన్వయంగా పనిచేస్తోంది” అని వివరించారు.

యువత భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రగతి కోసం డ్రగ్స్‌ వ్యసనాన్ని పూర్తిగా అంతమొందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని హోం మంత్రి అనిత  స్పష్టం చేశారు.

Spotlight

Read More →