Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు!

ROB: ఏపీలో ఆ ప్రాంతంలో కొత్త ఆర్వోబీ..! 17 కోట్ల ప్రాజెక్టు మళ్లీ ట్రాక్‌లోకి..! తీరనున్న ట్రాఫిక్ కష్టాలు..!

 గుంటూరు వాసుల ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెరపడింది. నందివెలుగు రైల్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ నుంచి నందివెలు

Published : 2025-08-25 16:01:00

గుంటూరు వాసుల ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెరపడింది. నందివెలుగు రైల్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ నుంచి నందివెలుగు రహదారిపై ఈ వంతెన నిర్మాణం జరుగుతోంది. 2018లో టీడీపీ ప్రభుత్వం ఈ పనులు మొదలుపెట్టింది. కానీ వైసీపీ పాలనలో నిధుల సమస్యల కారణంగా ప్రాజెక్టు నిలిచిపోయింది.

ఇప్పుడు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక చొరవతో, కేంద్ర నిధులు మంజూరవడంతో కాంట్రాక్టర్ పనులు మళ్లీ మొదలుపెట్టారు. ఇప్పటికే వంతెనపై నిలిచిపోయిన పిల్లర్ల నిర్మాణం కొనసాగుతోంది. ఇన్నేళ్ల తర్వాత పనులు పునఃప్రారంభం కావడంతో స్థానికులు, వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా వంతెన పూర్తయి అందుబాటులోకి రావాలని కోరుతున్నారు.

ఈ ఆర్వోబీ నిర్మాణానికి 2014లో అనుమతి లభించగా, 2018లో రూ.17 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో కేంద్రం రూ.6 కోట్లు, రాష్ట్రం రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే రాష్ట్రం నుంచి నిధులు సమయానికి రాకపోవటంతో ప్రాజెక్టు సగం వద్దే ఆగిపోయింది.

ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే టెండర్లు ఖరారు చేసి పనులు వేగవంతం చేస్తోంది. 850 మీటర్ల పొడవు, 7.5 మీటర్ల వెడల్పుతో రెండు వరుసలుగా వంతెన నిర్మించబడనుంది. రెండు వైపులా నడకదారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఏడాదిలోగా పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గుంటూరు – తెనాలి మార్గంలో రైళ్ల రాకపోకలు పెరిగిన నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు ఈ ఆర్వోబీ కీలకం కానుంది.

Spotlight

Read More →