గత ప్రభుత్వంలో పర్యాటక రంగంలో జరిగిన విధ్వంసం, అక్రమాలకు పాల్పడిన అధికారులు, ఉద్యోగులపై చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన విలువైన వస్తువులు అడ్డదారిలో మళ్లించినవారిని కాపాడుతున్నట్లే కనిపిస్తోంది. వైకాపా హయాంలో పర్యాటకరంగంలో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం ముగ్గురు సీనియర్ అధికారులతో విచారణ చేయించింది. వీరు విశాఖలో పర్యటించి రెండు నెలల క్రితం ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఫిర్యాదుల్లో పేర్కొన్న చాలా అంశాలు వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉన్నట్లుగా నిర్ధారించారు.
అక్రమాలు ఇలా.. రుషికొండపై హరిత రిసార్ట్ను కూలదోసిన సమయంలో విలువైన ఫర్నిచర్, ఏసీలు పర్యాటకాభివృద్ధి సంస్థలో అప్పట్లో అన్నీ తానై వ్యవహరించిన ఓ అధికారి ఆదేశాలపై సిబ్బంది తరలించారు. ఇతర ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, అలంకరణ వస్తువులు ఏమయ్యాయో రికార్డుల్లేవు. స్క్రాప్ కింద విక్రయించారా? అధికారులు తమ ఇళ్లలో పెట్టుకున్నారా? అనేది తెలియాలి.
• విశాఖలోని అప్పుఘర్లో యాత్రి నివాస్ హోటల్ ఆధునికీకరణ పనుల అంచనా వ్యయం రూ.8.60 కోట్ల నుంచి రూ.13.50 కోట్లకు చేరుకుంది. పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారి, మరో ఇంజినీర్ కలిసి ఇష్టారాజ్యంగా అంచనాలు పెంచేశారు. ఆధునికీకరణకు కొన్న వస్తువుల ధరలు భారీగా చూపించి బిల్లులు పెట్టారు. ఈ బాగోతంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఇంజినీర్ పై చర్యలు తీసుకోకపోగా... ఆయనకు మళ్లీ కీలకమైన అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఇంకా చదవండి: మరో ఫుడ్ పాయిజన్ ఘటన... రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం! విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ!
• రుషికొండ బ్లూఫ్లాగ్ బీచ్ నిర్వహణలోనూ అవకతవకలు జరిగినట్లు అధికారుల కమిటీ గుర్తించింది. పారిశుద్ధ్య నిర్వహణ, ఈతగాళ్ల నియామకం, వాహనాల పార్కింగ్లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు కమిటీ పరిశీలనలో వెల్లడైంది. బీచ్ నిర్వహణకు ఒక ప్రైవేటు సంస్థకు నెలకు రూ.10 లక్షల చొప్పున చెల్లించాలన్నది ఒప్పందం. ఇంత ఇస్తున్నా, ఒప్పందం ప్రకారం బీచ్లో సౌకర్యాలు కల్పించడం లేదు. పర్యాటకాభివృద్ధి సంస్థ విశాఖ ప్రాంతీయ మేనేజర్ ఒకరు గుత్తేదారు సంస్థకు సహకరించడంతో బీచ్లో లోపాలు అధికారుల కమిటీ విచారించే వరకూ వెలుగులోకి రాలేదు.
• సాగర్నగర్ సమీపంలో ఒక రిసార్ట్లో నిబంధనలకు విరుద్ధంగా కళాశాల నిర్వహిస్తున్నారు. కొన్నాళ్లు రిసార్ట్ నిర్వహించి దాన్ని కళాశాలగా మార్చేశారు. ఇన్ని అక్రమాలు జరిగినా.. బాధ్యులపై చర్యలు తీసుకోవలసిన అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు.
అసలైనవి వదిలేశారు: విశాఖలోని పర్యాటకాభివృద్ధి సంస్థ భూముల్లో చేపట్టిన భారీ ప్రాజెక్టులు వైకాపా ప్రభుత్వంలో చేతులు మారాయి. భూములు లీజుకు తీసుకుని వాటిలో వివిధ ప్రాజెక్టులు నిర్వహిస్తున్నవారిని వైకాపా పెద్దలు బెదిరించి స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారంలో వాటాలు గుంజుకున్నారు. వీటిలో భారీ హోటళ్లు, రిసార్ట్లు, బార్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. అధికారుల కమిటీ వీటి జోలికి వెళ్లలేదు. పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని ప్రాజెక్టుల పరిశీలనకే పరిమితమైంది. దీంతో వైకాపా నేతల చేతుల్లోనే ఇప్పటికీ విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి. వీటికి లీజులు, అద్దెలు కూడా సరిగా చెల్లించడం లేదు. అయినా అధికారులు జోక్యం చేసుకోవడం లేదు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!
చంద్రబాబు కీలక నిర్ణయం.. నాగబాబుకు కీలక పదవి - టీడీపీ రాజ్యసభ సభ్యుల ఖరారు!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెన్షన్లపై తాజా నిర్ణయం, సర్వే! వారికి కోత మార్గదర్శకాలు.!
46 ఏళ్ళకి ఘనంగా రెండో పెళ్లి చేసుకున్న నటుడు! పెళ్లికూతురు ఎవరో తెలుసా?
వైసిపికి మరొ షాక్! వైకాపా ఎంపీ పీఏ అరెస్ట్.. ఎందుకు అంటే.. కడప పోలీస్ స్టేషన్ లో...
ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం.. ఏపీలో ఈ 16 నగరాల్లో రోడ్లకు టోల్ ట్యాక్స్! ఇందులో భాగంగా అధికారులు..
లక్కీ ఛాన్స్.. ఐఫోన్ 15 ప్లస్‌పై భారీ తగ్గింపు ఆఫర్! కొనాలనుకుంటే చక్కటి అవకాశం!
పోలీస్ కస్టడీకి వైసీపీ నేత రౌడీ షీటర్! నిజాలు చెప్పేస్తా..? టెన్షన్ లో జగన్..
రాజకీయాలపై సినీనటి కస్తూరి కీలక వ్యాఖ్యలు! ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ!
ఏపీ ప్రజలకు ఒక పెద్ద ఊరట కలిగించే విషయం.. సంవత్సరం పాటు ఉచిత! ప్రభుత్వం కీలక నిర్ణయం!
శబరిమల దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! ఇంక పండగే పండగ! ప్రత్యేక రైలు సర్వీసులు!
ఒరేయ్ మీ దుంపలు తెగ.. 102 ఏళ్ల మహిళను పెళ్లాడిన 100 ఏళ్ల పెళ్లికొడుకు! ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..
రైల్వే స్టేషన్‌లో కోతుల ఫైట్ వల్ల ఆగిపోయిన రైళ్లు! అసలు ఏం జరిగిందంటే!
అప్డేట్.. ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రిటర్న్ రాలేదా? అయితే ఇలా చేయండి! రాష్ట్రంలో ఏ ఇతర పథకాల్లో..
దారుణం.. తిరుమల కొండపై కారు దగ్ధం! ఆ సమయంలో కారులో...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: