భవిష్యత్ అంతా పర్యాటకానిదే
ఆహ్లాదాన్ని కలిగించేది పర్యాటకం..అందుకు అనువైన ప్రాంతం ఆంధ్రదేశం
శాంతియుత పర్యాటకానికి పెద్దపీట.. పర్యాటకాంధ్రప్రదేశ్ కు బాటలు
ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్
రూ. 1,000 కోట్లతో రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి
మెగా టూరిజం హబ్ గా అమరావతి
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా, మన సాంస్కృతి ప్రతిబింబించేలా పర్యాటకం అభివృద్ధి
2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం
రాష్ట్రంలో నెలకొన్న శాంతియుత వాతావరణం, రాజకీయ చిత్తశుద్ధి కారణంగా వెల్లువలా పెట్టుబడులు
వరల్డ్ టూరిజం డే-2024 సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా మారుస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో "పర్యాటకం మరియు శాంతి" అనే థీమ్ తో నిర్వహించిన వరల్డ్ టూరిజం డే-2024 కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి దుర్గేష్ చేతుల మీదుగా 38 మందికి ఏపీ టూరిజం ఎక్స్ లెన్స్ అవార్డ్ లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ఔన్నత్యాన్ని కీర్తిస్తూ చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆహుతులను అలరించాయి. కళాక్షేత్రం బయట ఏర్పాటు చేసిన పర్యాటక స్టాళ్ళని మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా రూ. 100 కోట్లతో కర్నూల్ జిల్లా ఆదోని లో 250 మందికి ఉపాధి కల్పించే విమలా రిజెన్సీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ ప్రారంభించారు.. అదే విధంగా రూ. 6 కోట్లతో 15 మందికి ఉపాధి కల్పించే చంద్రగిరి పోర్ట్ సౌండ్ అండ్ లైట్ షో ని ప్రారంభించారు.. రూ. 7.32 కోట్లతో అనకాపల్లి జిల్లా బొజ్జన కొండ లో బౌద్ధ స్తూపం విశేషాలు తెలిపే బౌద్ధ రామాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రయాణీకులకు పర్యాటక రైల్ కమ్ రోడ్డు ప్యాకేజీ లు అందించే ఉద్దేశ్యంతో ఐఆర్ సీటీసీ, ఏపీ టీడీసీ సంయుక్తంగా ఒప్పందం చేసుకున్నాయి..
ఇంకా చదవండి: ఇందులో దళితులను ఎందుకు లాగుతావ్ జగన్! తప్పులు నువ్వు చేసి నీ స్వార్థం కోసం! సీఎం చంద్రబాబు ఆగ్రహం!
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. పర్యాటక రంగం ద్వారా శాంతిని నెలకొల్పాలన్న ఉద్దేశంతో పర్యాటక ఆంధ్రప్రదేశ్ కు శ్రీకారం చుడుతున్నామన్నారు. ఆహ్లాదాన్ని కలిగించేది పర్యాటకం అయితే అందుకు అనువైన ప్రాంతం ఆంధ్రదేశమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతర రంగాలతోపాటు పర్యాటక రంగానికి అందిస్తున్న సలహాలు, సూచనలతో త్వరలోనే రాష్ట్రంలో పర్యాటక రంగం విరాజిల్లుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన స్వదేశీ దర్శన్, ప్రసాద్, ఛాలెంజ్డ్ బేస్ట్ ప్రోగ్రామ్, శాసి ద్వారా ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం అభివృద్ధి చేస్తామన్నారు .. భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు..
రూ. 1,000 కోట్లతో రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధికి చర్యలు:
రూ. 1000 కోట్లతో రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.అందులో భాగంగా కేవలం అమరావతి రాజధానిలోనే మెగా టూరిజం పేరుతో రూ.500 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. శ్రీశైలం, అఖండ గోదావరి, సూర్య లంక బీచ్, సంగమేశ్వరం లాంటి ప్రాంతాలను ఐకానిక్ టూరిస్ట్ సెంటర్లుగా తీర్చిదిద్దుతామన్నారు.. అక్టోబర్ 15 నాటికి కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక(డీపీఆర్) సమర్పిస్తామన్నారు.. అనంతరం రెండేళ్లలో పర్యాటక ప్రాజెక్టులన్నింటిని పట్టాలెక్కిస్తామన్నారు.
రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు విదేశాల నుండి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ - వియత్నాం టూరిజం కాన్ క్లేవ్ నిర్వహించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.. ఆ కార్యక్రమం తర్వాత వియత్నాం నుండి విశాఖకు ఫ్లైట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతియుత వాతావరణం, రాజకీయ చిత్తశుద్ధి ఇందుకు కారణం అన్నారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రం నుండి పలువురు ఔత్సాహికులు ముందుకు రావాలని, పిపిపి విధానంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలన్నారు. అందరం కలిసి సమీకృతంగా పనిచేసి రాష్ట్రాన్ని స్వర్ణ మయంగా తీర్చిదిద్దుకుందామన్నారు..
ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చాకే రాష్ట్రంలో శాంతిని సాధించుకుంటున్నామన్నారు. శాంతి స్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు.. ఈ సందర్భంగా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నిర్విరామంగా కృషిచేసి పర్యాటకాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు మంత్రి వివరించారు.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గడచిన ఐదేళ్లలో పర్యాటక రంగం క్షీణించిందన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.
సుదీర్ఘ పరిపాలన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో, పేదల కంట కన్నీరు తుడవడమే లక్ష్యంగా పాటుపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో, వీరి పైనున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులతో రాష్ట్రం పర్యాటకంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి పర్యాటక రంగం అంటే మక్కువ అని తెలిపారు.. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో పర్యాటకం ఆకాశమే హద్దుగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు.. గత ఐదేళ్లలో అన్ని రంగాలు విధ్వంసం అయ్యాయని, ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పర్యాటక శాఖ సెక్రెటరీ, ఐఏఎస్ వినయ్ చంద్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పర్యాటకుల గమ్య స్థానంగా మార్చేందుకు చేస్తున్నామన్నారు. 2004 నాటికి పర్యాటక రంగం ద్వారా 10% ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. 1980 నుండి ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27వ తేదీన నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు.
కార్యక్రమంలో స్థానిక ఎంపీ, శాసనసభ్యులు గద్ద రామ్మోహన్ రావు, వసంత కృష్ణ ప్రసాద్, ఏపీటీడీసీ ఎండీ, ఐఏఎస్ అభిషిక్త్ కిశోర్, ఈడి పద్మావతి, టూర్ ఆపరేటర్లు, హోటల్ యజమానులు, చాంబర్ ఆఫ్ కామర్స్, పర్యాటక శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్ లెవల్ ఆఫీసర్స్ బదిలీ! ఎందుకో తెలుసా?
ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక రేషన్ టెన్షన్ లేనట్లే! ఇదే జరిగితే, ఏర్పాటు చేస్తే లబ్దిదారులకు!
పోలీస్ శాఖలో భారీగా ప్రక్షాళన.. 16 మంది IPS అధికారుల బదిలీ!
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి లోకేశ్ ఘాటు విమర్శలు! వైకాపా డ్రామాలకు బుద్ధి చెబుతాం!
అత్యాచారం కేసు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట!
నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం.. ఎంత దొంగలించారు? ఎవరు?
అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి! మరీ ఇంత దారుణమా - అసలు ఏమి జరిగింది అంటే!
విద్యార్థులకు సీఎం గుడ్ న్యూస్! పోస్టుల భర్తీ ప్రమాణాలు పెంచేలా చర్యలు!
విశాఖలో రెండ్రోజుల పాటు మంత్రి నారా లోకేశ్ పర్యటన! కొత్తగా నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన నేతలు!
ఏపీలో వైన్ షాపులకు రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్! గవర్నర్ రేపు ఆమోదముద్ర వేసే అవకాశం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: