Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..?

కృష్ణానదీ యాజమాన్య బోర్డు కే.ఆర్.ఎం.బి కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయాలి..

కృష్ణానదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నం తరలించాలనే ప్రస్తుత వైసిపి ప్రభుత్వ ప్రతిపాదన పై కె.ఆర్.ఎం.బి విముఖత వ్యక్తం చేసిందని,తాజాగా కేంద్ర జల శక్తి

Published : 2024-02-05 21:47:00

కృష్ణానదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నం తరలించాలనే ప్రస్తుత వైసిపి ప్రభుత్వ ప్రతిపాదన పై కె.ఆర్.ఎం.బి విముఖత వ్యక్తం చేసిందని,తాజాగా కేంద్ర జల శక్తి శాఖ వద్ద జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనను కే.అర్.ఏం.బి చైర్మన్ శివ నందన్ కుమార్ వ్యతిరేకించారని,ఆంధ్రప్రదేశ్ లోని వివిధ పత్రికల్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో దీనివలన కృష్ణా బేసిన్ లోని రైతులకు,జల వనరుల శాఖ అధికారుల కు జరిగే నష్టం పై స్పందిస్తూ.. సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు నేతృత్వంలో ప్రతినిధి బృందం ఈరోజు ఉదయం హైదరాబాదు ఎర్రమంజిల్ లోని జల సౌదా లోని కే.ఆర్.ఎం.బి కార్యాలయంలో కే.ఆర్.ఎం.బి చైర్మన్ శివనందన్ కుమార్ ను కలిసి పూర్తి వివరాలతో వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా జల సౌధ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ ఎపెక్స్ కమిటీ మాజీ సభ్యులు,సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో అన్ని రకాల మానిటరింగ్ లు చేయడానికి కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఏర్పడిందని, దీని ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయడానికి కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి ఆదేశాలకు అనుగుణంగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2018 జనవరిలో ఆంధ్రప్రదేశ్ లోని ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయటానికి భవనాలను పరిశీలించటం జరిగిందని, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా జూన్ 2020లో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని విజయవాడలోనే కే.ఆర్.ఎం.బి కార్యాలయం ఏర్పాటు చేయడానికి కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి కి లేఖ రాస్తూ దాని ప్రతిని కే.ఆర్.ఎం.బి హైదరాబాద్ కు పంపటం జరిగిందని, ప్రస్తుత వైసిపి ప్రభుత్వంలో 2019 నవంబర్ లోనూ 2020 ఆగస్టులోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయవాడలోనే కే.ఆర్.ఎం.బి కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాయడం జరిగిందని తెలియజేశారు.

ఇది ఇలా ఉండగా వీటికి విరుద్ధముగా ప్రస్తుత వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయంలో భాగముగా కార్యనిర్వాహక రాజధాని నెపంతో కే.ఆర్.ఎం.బి కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని,నిర్ణయం తీసుకోవడం సహేతుకము కాదని కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేయవలసిన కే.ఆర్.ఎం.బి కార్యాలయాన్ని కృష్ణా బేసిన్ దాటి కృష్ణా డెల్టాకు 400 కిలోమీటర్లు ఎన్.ఎస్.పి కి 700 కిలోమీటర్లు శ్రీశైలానికి 800 కిలోమీటర్ల దూరంలో గోదావరి బేసిన్ దాటి అవతల ఉన్న విశాఖపట్నంలో ఎలా ఏర్పాటు చేస్తారు అని

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
గతంలో కేంద్ర జల శక్తి శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,తెలంగాణ ప్రభుత్వము మధ్య జరిగిన నిర్ణయాలను పరిగణలోకి తీసుకుని కృష్ణా నది మీద ఉన్న 30 లక్షలు ఎకరాల ఆయకట్టుకు నవ్యాంధ్రప్రదేశ్ లోని రైలు, రోడ్డు, ఎయిర్ కనెక్టివిటీ ఉన్న విజయవాడలోనే విజయవాడలోనే కే.ఆర్.ఎం.బి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కే.ఆర్.ఎం.బి చైర్మన్ శివ నందన్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు.
దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు అని "ఆళ్ళ" తెలియజేశారు.
అట్లాగే ఈ మధ్యన తెలంగాణ రాష్ట్రంలో గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసినటువంటి టీ.హరీష్ రావు, కె. తారక రామారావు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన కృష్ణా జలాలను 50-50 శాతం పెంచాలనే ప్రకటనలు

చేయటాన్ని ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు తీవ్రంగా ఖండించారు.
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 811 టిఎంసి లలో 2015 జూన్ లో కే.ఆర్.ఎం.బి దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు చర్చించుకుని ఆంధ్రప్రదేశ్ కు 512 టీఎంసీలు తెలంగాణకు 299 టిఎంసిలు తాత్కాలిక కేటాయింపులు చేసుకొని ఆంధ్రప్రదేశ్ కు 66 శాతం తెలంగాణకు 34 శాతం నీటి కేటాయింపులు చేసుకోవాలి అనే తాత్కాలిక నిర్ణయం తీసుకుని ఇప్పటి వరకు ఉమ్మడి నీటి ప్రాజెక్టులైన శ్రీశైలం,నాగార్జునసాగర్ లో అందుబాటులో ఉన్న నీటి నిల్వలతో కేటాయింపులు జరుపుకుంటున్నారని, తాజాగా బి. ఆర్.ఎస్ మాజీ మంత్రులు చేసిన 50-50 శాతం వాదలతో ఆంధ్రప్రదేశ్ అంగీకరిస్తే శ్రీశైలం దిగు భాగాన ఆంధ్రప్రదేశ్ లో ఎస్.అర్. బీ.సి కింద ఉన్న రెండు లక్షల ఎకరాలు నాగార్జునసాగర్ కుడి,ఎడమ కాలువల కింద ఉన్న 15 లక్షల ఎకరాలు కృష్ణ డెల్టా కింద ఉన్నటువంటి 13 లక్షల ఎకరాలు మొత్తం కూడా,వర్షాభావ పరిస్థితుల్లో చుక్క నీరు రాకుండా మొత్తం బీడుబారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

అట్లాగే కేంద్ర జల శక్తి శాఖ ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రకారం కృష్ణానదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి శ్రీశైలం,నాగార్జునసాగర్ ఉమ్మడి ప్రాజెక్టులు తీసుకోవాలని నిర్ణయానికి స్వాగతం పలుకుతూ.. నాగార్జునసాగర్ ఎడమ కాలువ తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం ఆయకట్టు లోని రెగ్యులేటర్ల పై సిఐఎస్ఎఫ్ కేంద్రబలగారు పహారా పెట్టి ఆంధ్రప్రదేశ్ లోని చివరి ఆయకట్టు ప్రాంతాలకు సాగునీరు అందటానికి చర్యలు తీసుకోవాలి అని కే.ఆర్.ఎం.బి చైర్మన్ కు విజ్ఞప్తి చేసినట్టు "ఆళ్ళ"తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ కార్యవర్గ సభ్యులు గుడిపూడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →