ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ మీదుగా ఛత్తీస్ గడ్కు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని భద్రాచలంలో అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. వివరాలివి.. భద్రాచలం గోదావరి బ్రిడ్జివద్ద చెక్పోస్టు సిబ్బంది సోమవారం ఉదయం తనిఖీలు చేస్తూ సారపాక వైపు నుంచి వస్తున్న ఓ లారీని ఆపేందుకు ప్రయత్నించినా డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. దీంతో ఆ వాహనాన్ని వెంబడించిన సిబ్బంది స్థానిక కూనవరం రోడ్డులో అడ్డగించి పట్టుకున్నారు. తనిఖీ చేయగా అందులో 570 బస్తాల్లో 285 క్వింటాళ్ల బియ్యాన్ని గుర్తించారు. రవాణాకు సంబంధించిన పత్రాలూ లేవు. వాటిని ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ బియ్యంగా అధికారులు గుర్తించారు. పట్టుబడిన లారీ ఛత్తీస్గడ్కు చెందింది కాగా విజయవాడ చుట్టుపక్కల చౌక దుకాణాల బియ్యాన్ని కొందరు సేకరించి బస్తాల్లో నింపి సరిహద్దులు దాటిస్తున్నట్లు పౌర సరఫరాల అధికారులు అంచనాకు వచ్చారు.
ఇంకా చదవండి: చంద్రబాబు కీలక నిర్ణయం.. నాగబాబుకు కీలక పదవి - టీడీపీ రాజ్యసభ సభ్యుల ఖరారు!
పట్టుబడిన బియ్యాన్ని స్థానిక జీసీసీ గోదాముకు తరలించారు. బియ్యం విలువ రూ.10.62 లక్షలు కాగా లారీతో కలిపి మొత్తంగా రూ.30 లక్షల సొత్తును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పౌర సరఫరాల డీటీ శ్రీనివాసులు తెలిపారు.
రూటు మార్చిన అక్రమార్కులు
ఏపీలోని కాకినాడ ఓడరేవుకు ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెళ్లి అధికారులను అప్రమత్తం చేయడంతో ఏపీ ప్రభుత్వం అక్రమ బియ్యం తరలింపు అంశంపై నిఘాను ముమ్మరం చేసింది. దీంతో బియ్యం దందా చేస్తున్న అక్రమార్కులు రూటుమార్చి అంతర్రాష్ట్ర మార్గాలపై దృష్టిపెట్టినట్లు భావిస్తున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెన్షన్లపై తాజా నిర్ణయం, సర్వే! వారికి కోత మార్గదర్శకాలు.!
46 ఏళ్ళకి ఘనంగా రెండో పెళ్లి చేసుకున్న నటుడు! పెళ్లికూతురు ఎవరో తెలుసా?
వైసిపికి మరొ షాక్! వైకాపా ఎంపీ పీఏ అరెస్ట్.. ఎందుకు అంటే.. కడప పోలీస్ స్టేషన్ లో...
ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం.. ఏపీలో ఈ 16 నగరాల్లో రోడ్లకు టోల్ ట్యాక్స్! ఇందులో భాగంగా అధికారులు..
లక్కీ ఛాన్స్.. ఐఫోన్ 15 ప్లస్‌పై భారీ తగ్గింపు ఆఫర్! కొనాలనుకుంటే చక్కటి అవకాశం!
పోలీస్ కస్టడీకి వైసీపీ నేత రౌడీ షీటర్! నిజాలు చెప్పేస్తా..? టెన్షన్ లో జగన్..
రాజకీయాలపై సినీనటి కస్తూరి కీలక వ్యాఖ్యలు! ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ!
ఏపీ ప్రజలకు ఒక పెద్ద ఊరట కలిగించే విషయం.. సంవత్సరం పాటు ఉచిత! ప్రభుత్వం కీలక నిర్ణయం!
శబరిమల దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! ఇంక పండగే పండగ! ప్రత్యేక రైలు సర్వీసులు!
ఒరేయ్ మీ దుంపలు తెగ.. 102 ఏళ్ల మహిళను పెళ్లాడిన 100 ఏళ్ల పెళ్లికొడుకు! ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..
రైల్వే స్టేషన్‌లో కోతుల ఫైట్ వల్ల ఆగిపోయిన రైళ్లు! అసలు ఏం జరిగిందంటే!
అప్డేట్.. ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రిటర్న్ రాలేదా? అయితే ఇలా చేయండి! రాష్ట్రంలో ఏ ఇతర పథకాల్లో..
దారుణం.. తిరుమల కొండపై కారు దగ్ధం! ఆ సమయంలో కారులో...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: