సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, పార్టీ నేతలు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావు.
సీబీఐ విచారణతోనే ఓట్ల దొంగలకు శిక్ష పడుతుంది
ఓటర్ల జాబితాలోని అవకతవకలు... ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఐప్యాక్ సిబ్బంది విధులు నిర్వహించడం... కులగణన పేరుతో వాలంటీర్లు సేకరిస్తున్న ప్రజల వ్యక్తిగత వివరాలు సహా... అనేక ఎన్నికల్లో గెలవడంకోసం జగన్ రెడ్డి అనుసరిస్తున్న తప్పుడు విధానాలపై సీబీఐ విచారణ జరిపించాలి : కింజరాపు అచ్చెన్నాయుడు (టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు)
ప్రధానంగా మూడు విషయాలపై నేడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధాకారికి వినతి పత్రాలు ఇచ్చాము. ఓటర్ల జాబితాలో అవకతవకలకు సంబంధించి, అధికారపార్టీ వ్యవహరిస్తున్న తీరు గురించి మొదట్నుంచీ జరుగుతున్న పరిణామాలను మరోసారి ఎన్నికల కమిషనర్ కు గుర్తుచేశాం. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలు, తనను.. తన ప్రభుత్వాన్ని సాగనంపడం ఖాయమని గ్రహించాకే జగన్ రెడ్డి ఓటర్ల జాబితాలో అవకతవకలకు తెరలేపాడు. వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని వినియోగించుకొంటూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని జగన్ రెడ్డి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాడు.
రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారని గతంలో ఇక్కడే అనేకసార్లు చెప్పాము. వాలంటీర్లను ఇంటింటికీ పంపి, ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారని, ఆఖరికి ఎవరు ఏ పార్టీ సానుభూతిపరులో కూడా సమాచారం సేకరిస్తున్నారని అలాంటివి జరక్కుండా చర్యలు తీసుకోవాలని కూడా గతంలో అనేకసార్లు ఎన్నికల సంఘాన్ని కోరాం. అదలా ఉంటే ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయంలోనే ఓట్ల దొంగలు ప్రవేశించారు. ఇలాంటి చర్యలు క్రిమినల్స్ కు తప్ప సామాన్యుల ఊహకు అందవు.
కులగణన పేరుతో వాలంటీర్లు ప్రజల వేలిముద్రలు సహా వ్యక్తిగత సమాచారం మొత్తం సేకరిస్తూ, టీడీపీ ఇతర పార్టీల సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారు.
సీఈవో (చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కార్యాలయం)లో నియమితులైన సిబ్బందిలో కొందరు ఐప్యాక్ విభాగం సిబ్బంది ఉన్నారు. జగన్ రెడ్డి కోసం పనిచేస్తున్న ఐప్యాక్ విభాగానికి చెందిన కొంతమందిని సీఈవోలో నియమించి, పూర్తి సమాచారం తీసుకొని తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నా రు. 15 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని అనుకుంటున్న సమయంలో ఈ ప్రభుత్వం బీసీ జనగణన పేరుతో వాలంటీర్ల ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించడం దుర్మార్గం.
ఆఖరికి వేలిముద్రలు కూడా తీసుకొని ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్నారు అని ఎన్నికల ప్రధానాధికారికి తెలియచేస్తే ఆయన కూడా ఒప్పుకున్నారు. ఇటీవల విడుదలైన ఓటర్ల జాబితాలో చనిపోయిన ఓటర్లను తొలగించలేదు. అలానే దొంగఓట్లపై, ఒకే డోర్ నంబర్ తో ఉన్న ఓట్లపై కూడా చర్యలు లేవు. కొన్నిచోట్ల డబల్ ఓట్లు ఉన్నాయి. అవన్నీ అలా ఉంటే జగన్ రెడ్డి కొత్తగా తన పార్టీ ఎమ్మెల్యేలను ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మారుస్తుంటే, ఆ విధంగా ట్రాన్స్ ఫర్ అయిన అభ్యర్థులు తమ పాత నియోజకవర్గాల్లోని ఓటర్లను కొత్త నియోజకవర్గాలకు బదిలీ చేయించ డానికి అధికారులకు దరఖాస్తులు పంపే పనిలో నిమగ్నమయ్యారు. ఇది ఎంత దుర్మార్గమో ఆలోచించండి. తనకు పడే ఓట్లను ఒక నియోజక వర్గం నుంచి మరో నియోజకవర్గానికి బదలాయించడంపై దృష్టిపెట్టాలని ఎన్నికల కమిషనర్ ను కోరాం. కానీ ఆయన వైఖరి మరోలా ఉంది.
ఐ ప్యాక్ సిబ్బంది ఏకంగా సీఈవో కార్యాలయంలోకి చొరబడి ఓటర్ల జాబితాను తస్కరించేపనిలో నిమగ్నమయ్యారు. ఓటర్లజాబితాలోని అవకతవకలు.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరాం మరోపక్క ఐ ప్యాక్ సిబ్బంది ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలోకే చొరబడి మొత్తం ఓటర్ల సమాచారం సేకరించి ఓటర్ల జాబితాను తారుమారు చేసే పనిలో నిమగ్నమైందని ప్రముఖ దినపత్రికల్లో కథనాలు వచ్చాయి. ఇలాంటి సందర్భంలో ఎన్నికల కమిషనర్ చెప్పే వాదన కాకుండా, తక్షణమే మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరాం.
మా పార్టీ ఎంపీలు కూడా ఢిల్లీ లో ఇదే అంశంపై కేంద్ర ఎన్నికల కమిషనర్ కు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఈ రోజు మేం కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదుచేశాం. ఇలానే జరిగితే రాష్ట్రంలో ప్రశాంతంగా స్వేఛ్చాయుత వాతావరణంలో ఎన్నికలు ఎలా జరుగుతా యో ఎన్నికల కమిషన్ కూడా ఆలోచించాలి. ఓటర్ల జాబితాలోని అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలన్న మా విజ్ఞప్తిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కూడా సానుకూలంగా స్పందించారు. అని అచ్చెన్నాయుడు తెలిపారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి 10వేల ఓట్లు బదిలీ చేయిస్తున్నారు. ఎన్నికల్లో గెలవడం కోసం వైసీపీ నేతలు ఇప్పటికే వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి బహుమతులు పంచుతున్నారు : బొండా ఉమామహేశ్వరరావు (టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు)
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
వైసీపీ ప్రభుత్వం ఏవిధంగా వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తోందో ప్రజలు గ్రహించాలి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీఅభ్యర్థిగా నియమింపబడిన వెల్లంపల్లి శ్రీనివాస్ వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి, పోలీసులకు బహుమతులు ఇస్తూ తన పనులు చేయించుకుంటున్నాడు. వైసీపీకి ఓట్లేయడానికి ఒప్పుకోకపోయినా, ప్రజలు తమ దారికి రాకపోయినా పథకాలు ఆపేస్తామని వారిని బహిరంగంగానే బెదిరిస్తున్నారు.
మాజీ మంత్రి వెల్లంపల్లి, అతని అనుచరులు, వాలంటీర్ల బెదిరింపులకు సంబంధించిన వివరాల్ని, ఫోటోల్ని ఎన్నికల కమిషనర్ ఎదుట ఉంచాం. అలానే మీడియాకు కూడా విడుదల చేస్తున్నాం. విజయవాడలో ఏ కల్యాణ మండపంలో చూసినా వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో జరుగుతున్న సమావేశాలే కనిపిస్తున్నా యి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్ నియోజకవర్గంలోకి 10వేల ఓట్లు బదిలీచేయడానికి దరఖాస్తులు పెట్టారు. దానిపై కూడా తాము ఆధారాలతో సహా ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశాం.
జనవరి 22న ఓటర్ల జాబితా విడుదలయ్యాక వెంటనే 10వేల మంది ఓటర్లు ఎక్కడ నుంచి వచ్చారో ఆలోచించరా? అధికారులు వాలంటీర్ల సాయంతో ఇష్టానుసారం దొంగఓట్లు చేరు స్తున్నారు. సచివాలయ సిబ్బంది వాలంటీర్లు బహుమతులు పంచుతున్నప్పు డే మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదుచేశాం. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.70కోట్ల డబ్బు సీజ్ చేసినట్టు అధికారులు గర్వంగా చెబుతున్నారు. మరి మేంఇచ్చిన ఫిర్యాదుపై ఎందుకు స్పందించలేదు? ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వ్యక్తులపై పాలకుల చర్యలపై ఏపీ ఎన్నికల సంఘం స్పందించపోతే కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎంతదూరమైనా వెళతాం...
వేల కొద్దీ దొంగ ఓట్లు చేరుస్తూ వైసీపీ నేతలు ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎన్నికల్లో గెలవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ప్రజలు స్వేఛ్చగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడంకోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం టీడీపీ ఎంతదూరమైనా వెళ్తుంది. బహుమతుల పంపిణీకి పోలీసుల్ని కాపలాగా నియమించడంపై కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నాం. విజయవాడ మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్లు, వారికి సహకరిస్తూ చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న అధికారులు కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలకు బాధ్యులు కాక తప్పదు.” అని బొండా ఉమామహేశ్వరరావు హెచ్చరించారు.
అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న జగన్ రెడ్డి అప్పుడే ప్రలోభాలకు తెరలేపాడు : వర్ల రామయ్య (టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు)
ముఖ్యమంత్రి జగన్ కు, వైసీపీ అభ్యర్థులకు ఓటమి భయం పట్టుకుంది. దాంతో ముందస్తుగా అభ్యర్థుల్ని ప్రకటించినట్టే, ముందే ప్రలోభాలకు తెరలేపాడు ఈ ముఖ్యమంత్రి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పోలీసుల సమక్షంలోనే బహుమతులు పంచుతుంటే వారేం చేస్తున్నారు? చాలా నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు ఓటర్ల జాబితాను ముందు పెట్టుకొని మరీ వివిధ రకాల బహుమతులు పంచుతున్నారు. అవినీతి సొమ్ము ఖర్చుపెట్టి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తు న్న ముఖ్యమంత్రికి, వైసీపీనేతలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి.
ఈ వ్యవహారం పై ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశాం. ఆయన కూడా జిల్లా కలెక్టర్లకు లేఖ రాసి వెంటనే చర్యలు తీసుకునేలా చూస్తానని చెప్పారు. ఇలానే వ్యవహరిస్తే ఎన్నికలు ఒక ఫార్స్ గా మారతాయి. ఈ వ్యవహారంపై అవసరమైతే న్యాయపోరా టం చేస్తాం. ఈసీలో దొంగలు పడ్డారని పత్రికల్లో కథనాలు వస్తే విచారణ జరిపించా ల్సిన బాధ్యత ఎన్నికల కమిషనర్ పై లేదా? అందుకే సీబీఐ విచారణ కోరుతు న్నాం. ఐప్యాక్ సిబ్బంది ఇలా అన్నింట్లో చొరబడితే ఎన్నికలు ఎలా సజావుగా, సక్రమంగా జరుగుతాయి?” అని రామయ్య ప్రశ్నించారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి