ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదు
మరింత గొప్పగా ప్రజలకి సేవ చేయడం
మంగళగిరి ప్రజాహృదయ విజేత నారా లోకేష్
ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదు, నియోజకవర్గాన్ని వీడిపోవడం కాదు. నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో పోటీచేసి 5 వేల ఓట్లతో ఓడిపోయారు. ఎవరైనా అయితే ఓడిపోయాను, మళ్లీ ఎన్నికలు వచ్చేటప్పుడు నియోజకవర్గానికి వెళ్దాంలే అనుకుంటారు. నారా లోకేష్ అలా కాదు. ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థలో గెలుపు ఓటములు సహజం. ప్రజల సమస్యలు తీర్చాలంటే, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలంటే, కష్టాలు తొలగించి-కన్నీళ్లు తుడవాలంటే పదవే అక్కర్లేదు. అధికారంతో పనిలేదని సేవాప్రస్థానాన్ని ఆరంభించారు.
మంగళగిరి నియోజకవర్గంలో ఏ పల్లెకెళ్లినా, ఏ వీధిలో చూసినా నారా లోకేష్ కల్పించిన ఉపాధి కాంతులు ప్రసరిస్తూనే ఉంటాయి. కాసేపు సేద తీరుతామంటే సిమెంటు బల్లలై ఆహ్వానిస్తారు లోకేష్. దాహం వేస్తే జలధార అయి గొంతు తడుపుతారు. తమ కాళ్ల మీద తాము నిలబడతామంటే..బడ్డీలు, ఇస్త్రీ బండ్లు, కూరగాయల బండ్లు, వెల్డింగ్ మిషన్లు, కుట్టు మిషన్లు, రాట్నాలు, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు..ఉపాధికి ఊతంగా నిలుస్తున్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
పెళ్లిళ్లకు కానుకలు, పండగలకు కానుకలు, ఆటలకు అండ..విద్యకు సాయం.. ఉపాధికి శిక్షణ..ఇదీ లోకేష్ ప్రజాసేవా ప్రస్థానం. కార్మిక, కర్షక, మహిళా, విద్యార్థి లోకానికి ఇప్పుడు నారా లోకేష్ అండగా నిలిచారు. ఆసరా అవుతున్నారు. జయహో లోకేష్ అని నినదిస్తున్నారు జనం. చేనేతలు, స్వర్ణకారుల సంక్షేమమే తన లక్ష్యంగా పనిచేస్తున్న మన లోకేష్..మన మంగళగిరి ప్రజాహృదయవిజేతగా నిలిచారు.
1
చేనేతకు చేయూత
చేనేత కార్మికులకు
చేయూతనందించే
రాట్నాల పంపిణీ
2
ఉపాధికి ఊతం
చిరు వ్యాపారుల కోసం
తోపుడు బళ్లు అందజేత
3
దివ్యాంగులకు ఆసరా
దివ్యాంగులకు ఆసరాగా
ట్రై సైకిళ్ల పంపిణీ
4
స్త్రీ శక్తి
స్త్రీలకు టైలరింగ్ శిక్షణ ఇచ్చి
ఉపాధికి కుట్టు మిషన్లు అందజేత
5
పెళ్లికానుక
నూతన వధూవరులను
ఆశీర్వదిస్తూ పెళ్లి కానుక
6
జలధార
నియోజకవర్గంలో వాటర్ ట్యాంకర్లు,
వాటర్ ప్లాంట్ల ద్వారా మంచినీటి సరఫరా
7
పండగల కానుకలు
అర్చకులకు ఉగాది కానుక
ఇమామ్ /మౌజమ్‌లకు రంజాన్ కానుక
క్రిస్టమస్ కానుక ప్రతి ఏటా అందజేత
8
ఆరోగ్యమే మహాభాగ్యం
అందరికీ ఆరోగ్యం లక్ష్యంగా
సంజీవని ఆరోగ్య కేంద్రాలు 2, ఆరోగ్య రథం ద్వారా
ఉచిత వైద్యసేవలు, పరీక్షలు, మందుల పంపిణీ
9
ఆకలి తీర్చే క్యాంటీన్లు
ఆకలి తీర్చే అన్నా కాంటీన్
పేదలకు మధ్యాహ్న భోజనం
10
క్రీడా వికాసం
యువత శారీరక, మానసిక వికాసానికి
నారా లోకేష్ క్రీడాప్రాంగణాలు ఏర్పాటు
క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్ల నిర్వహణ
ప్లేయర్లకి ఫ్రీగా వాలీబాల్, క్రికెట్ కిట్లు
11
బంగారు భవిత కోసం
స్వర్ణకారుల సంక్షేమం లక్ష్యంగా ఏర్పాటైన
లక్ష్మీనరసింహ గోల్డ్ స్మిత్ సొసైటీ ద్వారా
ఆరోగ్య బీమా సౌకర్యం, పనిముట్లు అందజేత
12
నాయీబ్రాహ్మణులకు నజరానా
పేద నాయీ బ్రాహ్మణుల ఉపాధికి
సెలూన్ ఛైర్లు ఉచితంగా పంపిణీ
13
`యువ`తరంగం
యువతకు సాఫ్ట్‌వేర్, డిజిటల్ మార్కెటింగ్‌లో
శిక్షణ ఇచ్చి..ఉపాధి అవకాశాలు కల్పించడం
14
రజకులకు సాయం
పేద రజకుల స్వయం ఉపాధికి
ఇస్త్రీ బళ్లు, ఇస్త్రీ పెట్టెలు పంపిణీ
15
స్వయంకృషికి చేదోడు
వెల్డింగ్ ద్వారా ఉపాధి పొందేందుకు
కార్మికులకు వెల్డింగ్ మెషీన్లు అందజేత
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి