Dwacra Womens: ఏపీలో వారికి శుభవార్త... పూచీకత్తు లేకుండానే రూ.10 లక్షల రుణం! Nara Lokesh: జగన్ రెడ్డి వంకర బుద్ధికి ఇదే నిదర్శనం.. కిట్ల పంపిణీ వక్రీకరణపై నారా లోకేష్ ఫైర్! Palla Srinivasa Rao: “కాక్రోచ్ జనతా పార్టీ” ట్రెండ్‌పై పల్లా స్పందన! ఉద్యోగాలు, పెట్టుబడులే ఎన్డీయే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం! Labour Adda: శ్రామిక సంక్షేమంలో కూటమి ప్రభుత్వ విప్లవాత్మక అడుగులు! కార్మికుల గౌరవానికి లేబర్ అడ్డా! Minister Savitha: యాదవుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. మంత్రి సవిత హామీ! Vizag Tourism: ర్యాపిడో డ్రైవర్లే ఇక టూరిస్ట్ గైడ్స్.. ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన! Narayana: ఈసారి 'హైబ్రిడ్' విధానంలో టీడీపీ మహానాడు: కార్యకర్తలకు మాట్లాడే పూర్తి అవకాశం ఇస్తామన్న మంత్రి నారాయణ! TDP: వైఎస్ కుటుంబంపై కాల్వ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! పులివెందుల నుంచి హైదరాబాద్ వరకు నేర సామ్రాజ్యం! Top10 Cities India: దేశంలోనే టాప్-10 వృద్ధి నగరాల జాబితా విడుదల... తెలుగు రాష్ట్రాల జోరు! B.Tech Ravi: వైఎస్ కుటుంబానిది రక్తచరిత్ర.. ఆ కుటుంబం ఓటమి ఆనాడే మొదలైంది: బీటెక్ రవి Dwacra Womens: ఏపీలో వారికి శుభవార్త... పూచీకత్తు లేకుండానే రూ.10 లక్షల రుణం! Nara Lokesh: జగన్ రెడ్డి వంకర బుద్ధికి ఇదే నిదర్శనం.. కిట్ల పంపిణీ వక్రీకరణపై నారా లోకేష్ ఫైర్! Palla Srinivasa Rao: “కాక్రోచ్ జనతా పార్టీ” ట్రెండ్‌పై పల్లా స్పందన! ఉద్యోగాలు, పెట్టుబడులే ఎన్డీయే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం! Labour Adda: శ్రామిక సంక్షేమంలో కూటమి ప్రభుత్వ విప్లవాత్మక అడుగులు! కార్మికుల గౌరవానికి లేబర్ అడ్డా! Minister Savitha: యాదవుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. మంత్రి సవిత హామీ! Vizag Tourism: ర్యాపిడో డ్రైవర్లే ఇక టూరిస్ట్ గైడ్స్.. ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన! Narayana: ఈసారి 'హైబ్రిడ్' విధానంలో టీడీపీ మహానాడు: కార్యకర్తలకు మాట్లాడే పూర్తి అవకాశం ఇస్తామన్న మంత్రి నారాయణ! TDP: వైఎస్ కుటుంబంపై కాల్వ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! పులివెందుల నుంచి హైదరాబాద్ వరకు నేర సామ్రాజ్యం! Top10 Cities India: దేశంలోనే టాప్-10 వృద్ధి నగరాల జాబితా విడుదల... తెలుగు రాష్ట్రాల జోరు! B.Tech Ravi: వైఎస్ కుటుంబానిది రక్తచరిత్ర.. ఆ కుటుంబం ఓటమి ఆనాడే మొదలైంది: బీటెక్ రవి

ఖేల్ ఖతమ్ హ్యాపీగా దిగిపోతా అంటున్నాడు: చంద్రబాబు

మీ ఉత్సాహాన్ని చూశాడంటే జగన్‌ కు నిద్ర పట్టదు. ఆయనకు ఈ 74 రోజులు నిద్ర కరువయ్యేది ఖాయం. ఎక్కడ చూసినా జగన్ ను జనం ఛీ కొడుతున్నారు. జగనే ఆ పరిస్థితి కొని తెచ

Published : 2024-01-28 09:07:00

మీ ఉత్సాహాన్ని చూశాడంటే జగన్‌ కు నిద్ర పట్టదు. ఆయనకు ఈ 74 రోజులు నిద్ర కరువయ్యేది ఖాయం. ఎక్కడ చూసినా జగన్ ను జనం ఛీ కొడుతున్నారు. జగనే ఆ పరిస్థితి కొని తెచ్చుకున్నాడని’ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో నిర్వహించిన రా! కదలి రా! సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రమంతా తెలుగుదేశం, జనసేన గాలి వీస్తోంది. ఇటీవల జగన్ ఇదే ప్రాంతంలో సభ పెట్టారు. ఇందుకు సాక్ష్యం ఇక్కడున్న పోలీసులే అని చంద్రబాబు అన్నారు.

ఇక్కడికి వచ్చిన జనం స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలే. జగన్ సభలకు తరలించిన జనం కాదన్నారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14కి14 నియోజకవర్గాలు గెలిచి చరిత్ర సృష్టించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
‘ఇటీవలే జగన్ తన ఓటమిని అంగీకరించాడు. జగన్ కు తాను ఓడిపోతున్నట్లు అర్థమైపోయింది. ఆయన ఓడిపోతున్నాడని సర్వేలు సైతం వచ్చాయి. జగన్ కు ఉన్న గర్వమంతా ప్రస్తుతం పూర్తిగా తగ్గిపోయింది. 2021లో ఎవరూ కూడా నా వెంట్రుక పీకలేడన్నాడు. అప్పుడు మనిషిలో అహంభావం పూర్తిగా ఉండేది. 2022లో ప్లీస్ నన్ను నమ్మండి ప్లీస్ నన్ను నమ్మండి అన్నాడు. 2023లో నాకు ఎవరి మీద నమ్మకం లేదు, నేను మిమ్మల్నే నమ్ముకున్నాను అని అన్నాడు. 2024లో నేను హ్యాపీగా దిగిపోతా అంటున్నాడు. జగన్ ఖేల్ ఖతమ్ అని ఆయనే ధృవీకరించుకున్నాడు’ అన్నారు చంద్రబాబు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

‘అనంతపురంలో కియా మోటార్ పరిశ్రమ పెట్టి 12 లక్షల కార్లు ఉత్పత్తి చేశాం. ఇక్కడ తయారైన కార్లు ప్రపంచ వ్యాప్తంగా తిరుగుతున్నాయి. వైసీపీ అమర్ రాజాను తరిమేశారు. మేం రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తెచ్చాం. వైసీపీ పరిశ్రమలను తరిమేశారు. మళ్లీ ఉద్యాగాలు కావాలా? వద్దా? జాబు రావాలంటే బాబు రావాలి. బాబు రావాలంటే సైకిలెక్కండి, యువతకు హామీ ఇస్తున్నా. 4 లక్షల ఉద్యోగాలు 25వేల ఉద్యోగాలిస్తాం. కంపెనీలు తీసుకొస్తాం. పరిశ్రమలు వస్తాయి. వర్క్ ఫ్రం హోం కు శ్రీకారం చుడతాం. ఉద్యోగాలే మీ డోర్ కొట్టేలా చేస్తాను. హామి ఇస్తాం. అమ్మా నాన్న పైన ఆధార పడాల్సిన అవసరంలేదు. నేనున్నప్పుడు కరెంటు కోత ఉండేదా? కరెంటు చార్జీలు తగ్గిస్తాము గాని పెంచము. వైసీపీని నమ్మి ఓటేశారు. నిండా మునిగారు’ అన్నారు.

జగన్ కు బుద్ది లేదు, రైతులకు ఇచ్చిన ఇక్యుప్ మెంట్ ల వల్ల 30 కోట్లు వృధా అయిందని.. జగన్ చేస్తున్న పనుల పట్ల నిరసన తెలియజేయాలన్నారు. ఆలుగడ్డకు, ఉల్లి గడ్డకు తేడా తెలియదు. అందుకే బీమా పథకాన్ని తీసేశాడని సెటైర్లు వేశారు. మళ్లీ బీమా పథకం తెచ్చే బాద్యత టీడీపీ, జనసేన ది. ఎక్కడ పోయినా జనం ఉత్సాహం, అభిమానం చూపిస్తున్నారు. వైసీపిని భూస్థాపితం చేయాలి. డీఎస్సీ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఒక్క ఉద్యోగం లేదు, ఇంకా ఎవరిని మోసం చేస్తారు? అని ప్రశ్నించారు.

జగన్ అడ్డుతగలేకపోతే ఇరిగేషన్ ఎంతో అభివృద్ది జరిగి ఉండేదన్నారు చంద్రబాబు. 50 వేల ఎకరాల్లో ఇరిగేషన్ అభివృద్ది చెంది ఉంటే అనంతపురం జిల్లాలో ప్రతి రైతు బాగుపడేవాడు. ఒకప్పుడు దేశానికి కూరగాయలు సరఫరా చేసిన ఏకైక జిల్లా అనంతపురం జిల్లా అన్నారు. వైసీపీ మాయ మాటలు నమ్మొద్దు, టీడీపీ అధికారంలో ఉన్నప్పపుడు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. ఇక్యూమెంట్లను పంపిణీ చేశామని... జగన్ వచ్చి వాటన్నింటిని నాశనం చేశారంటూ మండిపడ్డారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →