Chandrababu: చంద్రబాబు ఢిల్లీ పర్యటన సక్సెస్... అమరావతికి EY ఎంట్రీ! Joseph Vijay: నేడే విజయ్‌ బలపరీక్ష... తమిళ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్!! Bullet Train: హైదరాబాద్ టు అమరావతి బుల్లెట్ ట్రైన్ కొత్త రూట్ ఫిక్స్! Nara Lokesh: పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో తెలుసా? సోషల్ మీడియాలో లోకేష్ టీజర్ ట్వీట్ వైరల్! Prajavedhika: వైన్ షాపుల పేరుతో భారీ మోసం.. కోటి నలభై లక్షలు వసూలు! ర్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్.. Minister Savitha: బీసీ విద్యాసంస్థల్లో కొత్త వెలుగు.. ఫలితాల్లో రాష్ట్రంలో నెంబర్‌ వన్‌గా బీసీ వెల్ఫేర్! Vangalapudi Anitha: జైళ్ల సంస్కరణలపై హోం మంత్రి అనిత సమీక్ష.. ఖైదీల సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి! Kollu Ravindra: జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.. అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ కట్టుబాటు! AP Panchayat Raj: అభివృద్ధిలో ఏపీ పంచాయతీల జోరు.. జాతీయ అవార్డులతో కేంద్రం సత్కారం! TallikiVandanam: 'తల్లికి వందనం'పై ఏపీ సర్కార్ క్లారిటీ... ఈ సారి వారి ఖాతాల్లో జమ..! Chandrababu: చంద్రబాబు ఢిల్లీ పర్యటన సక్సెస్... అమరావతికి EY ఎంట్రీ! Joseph Vijay: నేడే విజయ్‌ బలపరీక్ష... తమిళ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్!! Bullet Train: హైదరాబాద్ టు అమరావతి బుల్లెట్ ట్రైన్ కొత్త రూట్ ఫిక్స్! Nara Lokesh: పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో తెలుసా? సోషల్ మీడియాలో లోకేష్ టీజర్ ట్వీట్ వైరల్! Prajavedhika: వైన్ షాపుల పేరుతో భారీ మోసం.. కోటి నలభై లక్షలు వసూలు! ర్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్.. Minister Savitha: బీసీ విద్యాసంస్థల్లో కొత్త వెలుగు.. ఫలితాల్లో రాష్ట్రంలో నెంబర్‌ వన్‌గా బీసీ వెల్ఫేర్! Vangalapudi Anitha: జైళ్ల సంస్కరణలపై హోం మంత్రి అనిత సమీక్ష.. ఖైదీల సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి! Kollu Ravindra: జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.. అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ కట్టుబాటు! AP Panchayat Raj: అభివృద్ధిలో ఏపీ పంచాయతీల జోరు.. జాతీయ అవార్డులతో కేంద్రం సత్కారం! TallikiVandanam: 'తల్లికి వందనం'పై ఏపీ సర్కార్ క్లారిటీ... ఈ సారి వారి ఖాతాల్లో జమ..!

మరీ ఇంత దారుణమా!! పై అధికారుల ముందే ప్రభుత్వ ఉద్యోగిపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దాడి...

కాకినాడలో ప్రభుత్వ ఉద్యోగిపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చిన్నారావు దాడి చేశాడు. ఉప్పాడ సచివాలయం-3 మత్స్యకార సహాయకుడు పరుశురామ్ పై అనుచరులతో కలిసి చిన్నారావు దాడి

Published : 2024-01-30 15:14:00

కాకినాడలో ప్రభుత్వ ఉద్యోగిపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చిన్నారావు దాడి చేశాడు. ఉప్పాడ సచివాలయం-3 మత్స్యకార సహాయకుడు పరుశురామ్ పై అనుచరులతో కలిసి చిన్నారావు దాడికి తెగబడ్డాడు. చిన్నారావు రొయ్యల చెరువులకు విద్యుత్ రాయితీ రాకపోవడంతోనే దాడి చేసినట్లు తెలుస్తోంది.

ఇదే మండలంలోని కోనపాపపేట పైపులైన్ల వ్యవహారంపై కలెక్టర్ నియమించిన విచారణ కమిటీ సభ్యులు సోమవారం మధ్యాహ్నం తహసీల్దారు కార్యాలయానికి వచ్చారు. సమీక్ష అనంతరం కార్యాలయం నుంచి బయటకు వస్తున్న క్రమంలో మత్స్యశాఖ, కర్మాగారాలశాఖ, కాలుష్య నియంత్రణ మండలి, అటవీ శాఖల జిల్లా అధికారుల సమక్షంలోనే వైకాపా నాయకుడు, ఆయన అనుచరులు మత్స్యశాఖ సహాయకుడిపై దాడికి పాల్పడ్డారు.

అతని చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లార ఆయనను కొట్టవద్దని, వదిలేయాలని జిల్లా మత్స్యశాఖ అధికారి పి.వి.సత్యనారాయణ వారిస్తూ.. ఏమైనా ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని చెబుతున్నా చిన్నారావు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా దాడి చేయాలని అనుచరులను ఉసిగొల్పారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ చొక్కా పట్టుకుని ఈడ్చుకెళుతుంటే.. అనుచరులు పిడిగుద్దులు బాదారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

బాధిత ఉద్యోగి ఫిర్యాదును పోలీసుస్టేషన్లో తీసుకోలేదు. కేసు కూడా నమోదు చేయకుండా కాలయాపన చేసినట్లు సమాచారం.. . అధికారపక్ష నాయకులతో నీకు గొడవెందుకు అంటూ కొందరు నాయకులు బాధితుడిని బెదిరించడం గమనార్హం.

ఎలా బతుకుతావో చూస్తా.. నువ్వు ఇక్కడికి వచ్చి ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తా.. నిన్ను చంపేస్తా అంటూ వైకాపా నాయకుడు చిన్నారావు నన్ను బెదిరించారు. మా ఉన్నతాధికారులు చూస్తుండగానే నన్ను కొట్టారు. నా సెల్ఫోన్ లాక్కున్నారు. దుర్భాషలాడారు. ప్రభుత్వ ఉద్యోగిపై ఇంత దారుణంగా దాడిచేస్తే మేమెలా ఉద్యోగాలు చేయాలి. నాకు ప్రాణహాని ఉంది. నాపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీ, జిల్లా మత్స్య శాఖ అధికారిని కోరుతున్నాను' అని బాధితుడు పేర్కొన్నాడు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →