దేవుడిపై నమ్మకం ఉందని జగన్ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో జగన్ తీరును ఎండగట్టారు. "మీకు దేవుడిపై నమ్మకం లేకపోవచ్చు.. కానీ, ఆ దేవుడిని నమ్మే కోట్లాది మంది ఇక్కడ ఉన్నాం. తిరుమల అంశాన్ని ఒక పొలిటికల్ ఈవెంట్లా తయారు చేయడం బాధాకరం. దయచేసి మీరు చేసిన పాపాలు చాలు.. భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు. లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ జరిగిందనేది నిజం. అపచారం జరిగిందనేది నిజం. ఎవరూ కాదనలేని వాస్తవాలు. గతంలో తిన్న తిరుపతి లడ్డూకి, ప్రస్తుతం పంపిణీ చేస్తున్న లడ్డూకీ మధ్య తేడా భక్తులను అడిగితే తెలుస్తుంది. అంతకు మించిన పరీక్ష మరొకటి అక్కర్లేదు.
టెస్ట్లు పాస్ అయిన తర్వాతే నెయ్యి ట్యాంకర్లు కొండపైకి అనుమతిస్తారని చెబుతున్నారు. తిరుమలలో కొన్ని టెస్టులు మాత్రమే జరుగుతున్నాయని ఈవో స్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలో పాలకుడి మార్పుతోనే ప్రతి రంగంలో మార్పు మొదలైంది. ధర్మ ప్రచారం, ధర్మ పరిరక్షణలో కూడా మార్పు మొదలైంది. తప్పులు సరిదిద్దే క్రమంలోనే నిజాలు వెలుగులోకి వచ్చాయి. జగన్ ఇకనైనా రాజకీయాలు మానుకోవాలి. అన్యమతస్థులు శ్రీవారిని దర్శించుకోవాలంటే రిజిస్టర్లో సంతకం పెట్టాలి. మీరు ప్రజలతో చేయమంటున్న పూజలు అబద్ధం. ఘోరమైన తప్పులు చేసి కప్పిపుచ్చుకునేందుకు యత్నిస్తున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులందరినీ చట్టం ముందు ఉంచుతాం. భవిష్యత్లో ఎన్ని పాపాలు వెలుగులోకి వస్తాయో? ఆలస్యం అవుతుందేమో కానీ, శిక్ష నుంచి తప్పించుకోలేరు” అని కేశవ్ అన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విశాఖలో రెండ్రోజుల పాటు మంత్రి నారా లోకేశ్ పర్యటన! కొత్తగా నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన నేతలు!
ఏపీలో వైన్ షాపులకు రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్! గవర్నర్ రేపు ఆమోదముద్ర వేసే అవకాశం!
మరో శుభవార్త చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.. డైరెక్ట్ గా అకౌంట్లోకే రూ.1.05 లక్షలు! అది ఎవరెవరికంటే!
ఏడాదికి రూ.2 లక్షలకు పైగా జీతంతో ఉద్యోగాలు.. జాబ్ మేళా వివరాలివే! వయసు 19 పైన 30 లోపు!
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మరో ఎన్నికల హామీ నెరవేర్చిన ప్రభుత్వం! జగన్‌కీ చంద్రబాబుకీ తేడా ఏముంది?
వరద బాధితులకు గుడ్ న్యూస్.. ఆ రోజున ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.25వేలు!
మందుబాబులకు భారీ శుభవార్త.. సంబరాలే సంబరాలు! ఆ క్రమంలో మద్యం కొనుగోలు!
రైల్లో ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకెళ్తున్నారా.. జరిమానా చెల్లించాల్సిందే! ఎందుకంటే..
ఏపీలోకి జానీవాకర్, ఇంపీరియల్ బ్లూ, బ్లాక్ డాగ్, యాంటిక్విటీ వచ్చేశాయి! ఎవరికీ అనుమానం రాకుండా!
విశాఖ భూ వివాదంలో వైసీపీకి ఎదురుదెబ్బ! మున్సిపల్ శాఖ నుంచి స్పష్టమైన హెచ్చరిక!
అభయ్ నువ్వో సైకో .. బయటికిపో! బిగ్ బాస్ లో నాగార్జున! మిగతా వాళ్ల రిక్వెస్ట్ తో!
తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం! త్వరలో బీసీ పార్టీ!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ! ఎందుకో తెలుసా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: