PM Modi: తెలంగాణ ప్రజలను గమనిస్తున్నాను... ఈసారి వచ్చేది బీజేపీనే.. Modi: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం.. రైల్వేలు, రహదారులు, ఉద్యోగాల్లో భారీ పురోగతి! PM Modi: అవకాశవాద రాజకీయాలకు కాంగ్రెస్‌ కేరాఫ్ అడ్రస్.. బెంగళూరు సభలో ప్రధాని నిప్పులు! Chandrababu: చంద్రబాబు నివాసానికి ప్రధాని మోదీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న భేటీ! Vangalapudi Anitha: మదర్స్ డే వేడుకల్లో వృద్ధ మహిళలతో మమేకమైన హోం మంత్రి అనిత! Nara Lokesh: సింగపూర్‌లో మంత్రి లోకేష్ బిజీ బిజీ.. కీలక కంపెనీల సీఈవోలతో వరుస భేటీలు! షెడ్యూల్ ఇదే.. Tamil Nadu Politics: ఏపీలో టీడీపీ కోసం పనిచేసి... ఇప్పుడు విజయ్ క్యాబినెట్ లో మంత్రి అయింది.. ఎవరు అంటే..? Vijay: ఎంతటి ప్రయాణం.. ఎంతటి రాజకీయ నాటకం! సీఎం విజయ్‌కు రేవంత్ రెడ్డి, మంచు విష్ణు శుభాకాంక్షలు.. Chandrababu: ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రులతో కీలక భేటీలు! PM Modi: తమిళనాడు నూతన సీఎం విజయ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు.. అభివృద్ధిలో కలిసి నడుస్తామని హామీ! PM Modi: తెలంగాణ ప్రజలను గమనిస్తున్నాను... ఈసారి వచ్చేది బీజేపీనే.. Modi: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం.. రైల్వేలు, రహదారులు, ఉద్యోగాల్లో భారీ పురోగతి! PM Modi: అవకాశవాద రాజకీయాలకు కాంగ్రెస్‌ కేరాఫ్ అడ్రస్.. బెంగళూరు సభలో ప్రధాని నిప్పులు! Chandrababu: చంద్రబాబు నివాసానికి ప్రధాని మోదీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న భేటీ! Vangalapudi Anitha: మదర్స్ డే వేడుకల్లో వృద్ధ మహిళలతో మమేకమైన హోం మంత్రి అనిత! Nara Lokesh: సింగపూర్‌లో మంత్రి లోకేష్ బిజీ బిజీ.. కీలక కంపెనీల సీఈవోలతో వరుస భేటీలు! షెడ్యూల్ ఇదే.. Tamil Nadu Politics: ఏపీలో టీడీపీ కోసం పనిచేసి... ఇప్పుడు విజయ్ క్యాబినెట్ లో మంత్రి అయింది.. ఎవరు అంటే..? Vijay: ఎంతటి ప్రయాణం.. ఎంతటి రాజకీయ నాటకం! సీఎం విజయ్‌కు రేవంత్ రెడ్డి, మంచు విష్ణు శుభాకాంక్షలు.. Chandrababu: ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రులతో కీలక భేటీలు! PM Modi: తమిళనాడు నూతన సీఎం విజయ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు.. అభివృద్ధిలో కలిసి నడుస్తామని హామీ!

గల్లా జయదేవ్: రాజకీయాల నుంచి విరమించుకుంటున్నా! పారవేత్తలపై రాజకీయ వేధింపులు సరికాదు..

తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని లోక్ సభలో మాట్లాడుతూ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. తనకు ఎంపీగా అవకాశం కల్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు

Published : 2024-02-05 16:15:00

తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని లోక్ సభలో మాట్లాడుతూ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. తనకు ఎంపీగా అవకాశం కల్పించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతగా ఉంటానని చెప్పారు. తనను పార్లమెంటుకు పంపిన గుంటూరు ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. సభలో ఎందరో పెద్దలు తనకు మార్గదర్శకంగా నిలిచారని చెప్పారు. ప్రధాని మోదీ ఎంతో విజన్ ఉన్న నాయకుడని జయదేవ్ ప్రశంసించారు. పదేళ్ల మోదీ పాలనలో భారత్ ఎంతో పురోగమించిందని అన్నారు. అయోధ్య రామాలయాన్ని కట్టించి, భారతీయుల శతాబ్దాల కలను మోదీ నిజం చేశారని చెప్పారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో వ్యాపారులది కూడా కీలక పాత్ర అని ఎంతో మంది వ్యాపారవేత్తలు చట్ట సభలకు ఎన్నికవుతున్నారని జయదేవ్ తెలిపారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

వ్యారవేత్తలపై రాజకీయ కక్షలు సరికాదని... వారిపై రాజకీయ వేధింపులను నివారించాలని కోరారు. దేశం, రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు పాత్రను పోషిస్తూనే ఉంటానని చెప్పారు. రాముడు 14 ఏళ్లు వనవాసం చేసినట్టు తాను కూడా రాజకీయాల్లో విరామం తీసుకుంటున్నానని... కొన్నాళ్ల తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయని... స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జయదేవ్ అన్నారు. ఏపీలో దొంగ ఓట్లపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు మరింత బాధ్యతతో విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. అమరావతి రైతులకు ఇప్పటికీ తన మద్దతు ఉందని చెప్పారు. తన నియోజకవర్గ అభివృద్ధికి, అమరావతిని స్మార్ట్ సిటీగా నిలిపేందుకు కృషి చేశానని అన్నారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →