కోల్కతా-చెన్నై జాతీయ రహదారి-16లో భాగంగా చిలకలూరిపేట వద్ద నిర్మించిన ఆరు వరుసల బైపాస్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఈ హైవేపై వెళ్లే వాహనాలు చిలకలూరిపేట పట్టణంలో నుంచి వెళ్లాల్సి వచ్చేది. దీనికి ప్రత్యామ్నాయంగా 16.38 కి. మీ. మేర ఆరు వరుసలతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఐఐ) ఈ బైపాస్ ను నిర్మించింది. దీనిపై రెండు రోజులుగా వాహనాలను అనుమతిస్తున్నారు. వాస్తవానికి గత నెల 29న ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశాఖ పర్యటన సందర్భంగా చిలకలూరిపేట బైపాస్ను వర్చువల్గా ప్రారంభించాల్సి ఉంది. అయితే ఆయన పర్యటన రద్దుకావడంతో బైపాస్ ఆరంభం ఆగిపోయింది. తాజాగా ఎన్హెచ్ఎఐ ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రాజెక్టు డైరెక్టర్ టి.పార్వతీశం ఈ బైపాస్కు కొబ్బరికాయకొట్టి వాహనాలను అనుమతించారు. ఈ రహదారి అంచనా విలువ రూ.907 కోట్లుకాగా, భూసేకరణకు వెచ్చించిన నిధులు కాకుండా, సివిల్ పనులకు రూ.725 కోట్లు ఖర్చుచేశారు.
• చిలకలూరిపేట బైపాస్లో అనేక అధునాతన సదుపాయాలు కల్పించారు. అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విధానంలో భాగంగా ప్రతి కి.మీ.కు ఓ సీసీ కెమెరా ఏర్పాటు చేశారు.
ఇంకా చదవండి: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక ప్రకటన! నామినేటెడ్ పోస్టుల మరో జాబితా సిద్దం - దక్కేది వీరికే!
• ఈ హైవేలో స్పీడ్ కెమెరాలతోపాటు.. స్పీడ్ డిస్ప్లేలు ఏర్పాటు చేశారు. స్పీడ్రన్ దాటి వాహనం వెళ్లిన తర్వాత అది ఎంత వేగంతో వెళుతోందనేది డిస్ప్లేలో కనిపిస్తుంది. గంటకు 100 కి.మీ. వేగంతో వాహనాలు వెళ్లేలా డిజైన్ చేయగా.. వాహనాల వేగపరిమితి మాత్రం 80 కి.మీ. కే అనుమతిస్తారు.
• ఈ బైపాస్కు పక్కనే ఓ మెగావాట్ సామర్థ్యంతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీనిద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను గ్రిడ్కి అనుసంధానం చేశారు. బైపాస్లో వినియోగించే లైటింగ్, ఇతర అవసరాలకు ఆ విద్యుత్న వినియోగిస్తారు. కేజీబీవీలకు నిర్వహణ నిధులు విడుదల
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో నీరు, విద్యుత్తు ఛార్జీలకు నిధులు విడుదల చేస్తూ సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని 81 టైప్-3 కేజీబీవీలకు రూ.16.90 కోట్లు, మరో 145 టైప్-4లకు రూ.2.90 కోట్లను విడుదల చేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రజలకు ముఖ్యమైన వార్త.. ప్రభుత్వం నిన్నటి నుంచి 3 రోజులపాటూ! అవన్నీ ఉచితంగా పొందండి!
జగన్ కి షాక్.. విజయసాయిరెడ్డిపై క్రిమినల్ కేసు! ఎవరు పెట్టారు అంటే?
నెల్లూరులో అలా చేసే వారికి కఠిన చర్యలు తప్పవు! మంత్రి కీలక వ్యాఖ్యలు!
ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా! ఇది తప్పక తెలుసుకోండి - లేదంటే.. ప్రమాదమే!
కొడాలికి మరో బిగ్ షాక్...14 రోజుల రిమాండ్ - నెల్లూరు సబ్‌జైలుకు తరలింపు! అసలేం జరిగిదంటే!
ఆళ్ల నాని టీడీపీలోకి ఎంట్రీ పై చంద్రబాబు క్లారిటీ! పలువురు వైసీపీ నేతలు కూటమి పార్టీలోకి!
ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు! మంత్రి లోకేశ్ సమక్షంలో గూగుల్ తో కీలక ఒప్పందం!
బీఆర్ఎస్‌కు ఊహించని షాక్! కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: