చంద్రబాబు పాలనలో నీటిపారుదల వ్యవస్థ 100రోజుల్లో కళకళ
- జగన్ ఐదేళ్ల పాలనలో నీరు లేక ప్రాజెక్టులన్నీ వెలవెల
- జగన్ సొంత నియోజకవర్గానికి నీరు ఇవ్వలేని అసమర్థుడు
- రాయలసీమ నీటి ప్రాజెక్టులన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి
- రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి
అమరావతి:
వైసీపీ హయాంలో నీటి పారుదల ప్రాజెక్టుల్ని గాలికొదిలేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డెప్పగారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘ జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టుల మీద అవగాహన లేకపోవడం వల్లే గత ఐదు సంవత్సారాల్లో నీటి ప్రాజెక్టులు మూలన పడ్డాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ప్రాజెక్టులను అభివృద్ధి దిశగా నడిపారు. పడిన ప్రతి నీటి చుక్కను ఎలా సద్వినయోగం చేసుకోవాలో రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, కాలువలు ఎలా నింపాలనే ప్రణాళిక ఏర్పాటు చేసుకున్న ప్రణాళికలను చూస్తే వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ప్రజలు అర్ధం చేసుకోవాలి. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.12,400 కోట్లు ఖర్చు చేస్తే జగన్మోహన రెడ్డి ప్రభుత్వం కేవలం రూ.2,012 కోట్లు ఖర్చు చేశారు. అది కూడా ప్రాజెక్టుల నిర్వహణకు కాకుండా, భూసేకరణకు మాత్రమే ఖర్చు చేసి ప్రాజెక్టులను గాలికొదిలేశారు.
ఇంకా చదవండి: గనుల రెడ్డి అడ్డంగా బుక్.. వేల కోట్ల దోపిడీ! హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించి అరెస్టు!
ప్రాజెక్టుల నిర్వహణ చేతకాక శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కేంద్రం చేతులకు అప్పజెప్పారు. రాయలసీమ నీటిపారుదల వ్యవస్థను గత ఐదేళ్లు నిర్లక్ష్యం చేశారు. శ్రీశైలం నుండి మొదలయ్యే నీటి వ్యవస్థ నిర్వహణను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి రాయలసీమకు ద్రోహం చేశారు. రాయలసీమ నాది, కడప నాది అని చెప్పే జగన్ గాలేరు,నగరి, హంద్రీనీవా, వెలుగుగంగ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా గాలికొదిలేశాడు. 2014-19 వరకు హంద్రీనీవాలో టీడీపీ ప్రభుత్వం దాదాపు రూ.4,182కోట్లు ఖర్చు చేస్తే, వైసీపీ ఐదేళ్ల పాలనలో కేవలం రూ.515కోట్లు ఖర్చు పెట్టారు. 3వేల క్యూసెక్కుల నీరు పోవాల్సి ఉండగా, కనీసం 1,500క్యూసెక్కులు కూడా వెళ్లలేని దుస్థితికి తీసుకొచ్చాడు. రాయలసీమ దుర్భిక్ష మిషన్ అనే పేరుతో రూ.33,800కోట్లతో భారీ ప్రాజెక్టు పేరుతో టెండర్లు పిలిచి కనీసం ప్రారంభించలేదు. కానీ హడావుడి చేశారు. కడప జిల్లాలో రూ.12వేల కోట్లతో జీఓలు ఇచ్చి, ఒక్క పని కూడా మొదలు పెట్టలేదు అంటే జగన్ ఎంత చేతకానివాడో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. పోలవరం ప్రాజెక్టు పనులు టీడీపీ ప్రభుత్వం 75శాతం పూర్తిచేస్తే, వైసీపీ పాలనలో ఒక్క శాతం కూడా పనులు ముందుకు కదల్లేదు. పోలవరం పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. కృష్ణాడెల్టాకు వచ్చే నీరు శ్రీశైలం నుండి రాయలసీమకు నీరు వస్తే రాయలసీమ సంతోషంగా ఉంటుంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో పోలవరం డయాఫ్రం వాల్ ను దెబ్బతీశారు. నేడు మరోసారి డయాఫ్రం వాల్ ను కట్టాల్సిన పరిస్థితిని జగన్ తెచ్చాడు.
ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9
వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులను రివర్స్ టెండరింగ్ పేరుతో తన అనుయాయులకు టెండర్లు కట్టబెట్టిన వ్యక్తి జగన్. వైసీపీ పాలనలో సంపదను సృష్టించలేక, కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. టీడీపీ హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కుప్పంకు నీరు తీసుకురావాలని పుంగనూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా నీటి కోసం చంద్రబాబు రూ.475కోట్లు మంజూరు చేసి ఖర్చు చేస్తే జగన్ కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు నిలిపేసి కక్షసాధించాడు. 2024 ఎన్నికల సమయంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ లో తాత్కాలిక గేట్లు పెట్టి, మోటార్లతో నీళ్లు పెట్టి కుప్పం రైతులను జగన్ మోసం చేశాడు. కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు, పింఛ ప్రాజెక్టులు జగన్ అసమర్ధతనం వల్ల కొట్టుకుపోయాయి. ఈ ప్రాజెక్టు పునరుద్ధరణకు జగన్ కనీసం టెండర్లు కూడా పిలిచిన పరిస్థితి లేదు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన సమయంలో చనిపోయిన వారి కుటుంబాలను కూడా జగన్ పరామర్శించిన దాఖలాలు లేవు, వారి కుటుంబాలను ఆదుకోలేదు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అన్నమయ్య డ్యామ్ ప్రాజెక్టు బాధితులను ఆదుకున్నారు. నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా మృతుల కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కడపజిల్లాలో అన్నమయ్య, గాలివీడు మండలంలోని వెలిగల్లు ప్రాజెక్టు కాలువలు ప్రారంభంకాలేదు, జెర్రికోన, అడవికోన, శ్రీనివాసపురం రిజర్వాయర్, రాయలసీమలోని గాలేరునగరి, హంద్రీనీవా పనులను జగన్ గాలికొదిలేశాడు. వీటిని పూర్తిచేయడం కోసం చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. ఊహించని రీతిలో వరదలు వస్తే, వరద నుండి ప్రజలను 10రోజుల పాటు కంటి మీద కునుకు లేకుండా కాపాడుకున్న ఘనత చంద్రబాబుది. వరదల వల్ల నష్టపోయిన వారికి పరిహారం ఇచ్చి ఆదుకుంటున్నారు. వరద నీటితో ప్రాజెక్టులను నింపి, ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టిన సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు. గండికోట ప్రాజెక్టు, చిత్రావతి, పైడిపాలె రిజర్వాయర్లను వరద నీటితో చంద్రబాబు నింపారు. గండికోట రిజర్వార్ 27 టీఎంసీల సామర్థ్యం ఉంటే 26 టీఎంసీలతో మొట్టమొదటిసారి నింపిన ఘనత చంద్రబాబుది, కూటమి ప్రభుత్వానిది. బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు 17టీఎంసీలకు 10 టీఎంసీలతో నిండుగా ఉంది. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ప్రాజెక్టులకు నీరు పుష్కలంగా అందుతోంది. ఈ ఏడాది రైతుల కళ్లల్లో ఆనందం కనబడుతోంది. చెరువుల్లోనూ నీటిని నింపి ఖరీఫ్, రబీకి పుష్కలంగా నీరు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిది. రాయలసీమలో వర్షపు నీటితో పండుగ వాతావరణం కనబడుతోంది. జగన్ పాలనలో వర్షపు నీరు వస్తే ప్రాజెక్టులు కొట్టుకుపోయేలా చేస్తే, కూటమి ప్రభుత్వం ప్రాజెక్టులను సమర్థవంతంగా నింపి ప్రజలకు నీటిని అందుబాటులోకి తెస్తున్నారు. పులివెందులలో పైడిపాలెం, చిత్రవతి ప్రాజెక్టులు నేడు నిండుకుండల్లా ఉన్నాయి. వైసీపీ పాలనలో చుక్క నీటిని కూడా తీసుకొచ్చిన పరిస్థితి లేదు. రాయలసీమ రైతుల్లో ధైర్యాన్ని 100రోజుల్లోనే నింపిన ఘనత కూటమి ప్రభుత్వానిది. నీటిపారుదల వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించిన ఘనత చంద్రబాబుది అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరుతున్నాను అన్నారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్ లెవల్ ఆఫీసర్స్ బదిలీ! ఎందుకో తెలుసా?
ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక రేషన్ టెన్షన్ లేనట్లే! ఇదే జరిగితే, ఏర్పాటు చేస్తే లబ్దిదారులకు!
పోలీస్ శాఖలో భారీగా ప్రక్షాళన.. 16 మంది IPS అధికారుల బదిలీ!
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి లోకేశ్ ఘాటు విమర్శలు! వైకాపా డ్రామాలకు బుద్ధి చెబుతాం!
అత్యాచారం కేసు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట!
నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం.. ఎంత దొంగలించారు? ఎవరు?
అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి! మరీ ఇంత దారుణమా - అసలు ఏమి జరిగింది అంటే!
విద్యార్థులకు సీఎం గుడ్ న్యూస్! పోస్టుల భర్తీ ప్రమాణాలు పెంచేలా చర్యలు!
విశాఖలో రెండ్రోజుల పాటు మంత్రి నారా లోకేశ్ పర్యటన! కొత్తగా నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన నేతలు!
ఏపీలో వైన్ షాపులకు రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్! గవర్నర్ రేపు ఆమోదముద్ర వేసే అవకాశం!
మరో శుభవార్త చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.. డైరెక్ట్ గా అకౌంట్లోకే రూ.1.05 లక్షలు! అది ఎవరెవరికంటే!
ఏడాదికి రూ.2 లక్షలకు పైగా జీతంతో ఉద్యోగాలు.. జాబ్ మేళా వివరాలివే! వయసు 19 పైన 30 లోపు!
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మరో ఎన్నికల హామీ నెరవేర్చిన ప్రభుత్వం! జగన్‌కీ చంద్రబాబుకీ తేడా ఏముంది?
వరద బాధితులకు గుడ్ న్యూస్.. ఆ రోజున ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.25వేలు!
మందుబాబులకు భారీ శుభవార్త.. సంబరాలే సంబరాలు! ఆ క్రమంలో మద్యం కొనుగోలు!
రైల్లో ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకెళ్తున్నారా.. జరిమానా చెల్లించాల్సిందే! ఎందుకంటే..
ఏపీలోకి జానీవాకర్, ఇంపీరియల్ బ్లూ, బ్లాక్ డాగ్, యాంటిక్విటీ వచ్చేశాయి! ఎవరికీ అనుమానం రాకుండా!
విశాఖ భూ వివాదంలో వైసీపీకి ఎదురుదెబ్బ! మున్సిపల్ శాఖ నుంచి స్పష్టమైన హెచ్చరిక!
అభయ్ నువ్వో సైకో .. బయటికిపో! బిగ్ బాస్ లో నాగార్జున! మిగతా వాళ్ల రిక్వెస్ట్ తో!
తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం! త్వరలో బీసీ పార్టీ!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ! ఎందుకో తెలుసా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: