ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా గెలుపు కోసం స్వీడన్ నుంచి వచ్చి ఐదు నెలలపాటు క్షేత్రస్థాయిలో పనిచేసిన ఎన్నారై ఉన్నం నవీన్ కుమార్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు గౌరవించారు. ఉండవల్లి నివాసానికి సోమవారం ఆయన్ను ఆహ్వానించి రోజంతా తనతో ఉండే అవకాశాన్ని కల్పించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేసిన ఎన్నారైల కృషి స్ఫూర్తిదాయకమని నవీనన్ను అభినందించారు. ఈ సందర్భంగా సోమవారం సీఎం నిర్వహించిన పలు సమీక్షల్లో నవీన్ పాల్గొన్నారు. తెదేపా ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేశారు. ఈ క్రమంలో కుప్పం, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, చంద్రగిరి నియోజకవర్గాల్లో నవీన్ పనిచేశారు సుమారు 1800 మంది ప్రభావశీల వ్యక్తులతో ఫోన్లో మాట్లాడారు. 'కష్టపడి పనిచేసి, అత్యుత్తమ ప్రతిభకనబరిచిన ఎన్నారైలకు చంద్రబాబుతో ఒక రోజంతా ఉండే అవకాశం కల్పిస్తామని (డే విత్ సీబీఎన్) గతంలో హామీ ఇచ్చాం. అందుకే నవీన్కు అవకాశం కల్పించాం' అని తెదేపా ఎన్నారై అధ్యక్షుడు వేమూరి రవి తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!
నిరుద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్! విశాఖ వస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్.. నెక్ట్స్ ఎవరు?
ఏమిటి.. పరగడపున ఈ పళ్లు తింటే! రోజువారీ ఆహారంలో - సమస్యలు తెచ్చుకున్నట్టేనట!
విజయవాడ ట్రాఫిక్ సమస్యలకు టెక్నాలజీ తోడు! డ్రోన్లు, ఎస్ఈడీ బోర్డులతో పోలీసుల ముందడుగు!
బూడిద తరలింపు వివాదం.. ఎమ్మెల్యేపై చంద్రబాబు ఫైర్! ఎందుకు అంటే!
మందుబాబులకు కిక్కే కిక్కు.. భారీగా తగ్గిన మద్యం ధరలు! ఆ వివరాలు మీ కోసం..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: