'ఒకే దేశం-ఒకే ఎన్నికలు' విధానాన్ని స్వాగతించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. తరచూ ఎన్నికల వల్ల నాయకుల దృష్టి అంతా వాటి పైనే ఉంటుందని, ప్రజలపై ఉండదని పేర్కొన్నారు. శనివారం కృష్ణా జిల్లా డోకిపర్రులోని వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఎండీ కృష్ణారెడ్డి-సుధ దంపతుల ఆహ్వానం మేరకు వచ్చిన ఆయన అనంతరం వారితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కృష్ణారెడ్డిని పీ4 ఫార్ములా కింద గుడ్లవల్లేరు మండలాన్ని దత్తత తీసుకోవాలని కోరగా ఆయన సమ్మతించారని సీఎం వెల్లడించారు. ఈ మండలంలో 51,573 జనాభా ఉందన్నారు. వారి ఆర్థిక ఉన్నతికి కృషి చేయాలని కృష్ణారెడ్డికి సూచించామన్నారు. దీనిపై ప్రభుత్వం ఒక ఫార్ములా తయారు చేసిందని, కలెక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేక కార్యక్రమంగా రూపుదిద్దుతామని చెప్పారు.
ఇంకా చదవండి: వైసీపీకి వరుస షాక్ లు.. పార్టీకి రాజీనామా చేయనున్న మాజీ మంత్రి! దానికి కారణం అదేనా?
రాష్ట్రంలోనే ఇదో కొత్త ప్రాజెక్ట్ అని సీఎం అభివర్ణించారు. మళ్లీ సంక్రాంతికి వచ్చి ఈ విజన్ డాక్యుమెంట్కు పరిపూర్ణ రూపం ఇస్తామన్నారు. ఈ మండలానికి ప్రభుత్వపరంగా ఇచ్చే నిధులన్నీ మంజూరు చేస్తామని, మేఘా సంస్థ పర్యవేక్షణలో సర్వతో ముఖాభివృద్ధి సాధించేలా అమలు చేస్తామని తెలిపారు. ఈ దత్తత కార్యక్రమాన్ని స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్, ఆదర్శంగా రూపొందిస్తామని వెల్లడించారు. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో నంబర్-1గా ఉంటుందని, దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంటుందని, ఆ విజన్తో పని చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రఘురామకృష్ణ చిత్రహింసల కేసులో కిలక మలుపు! గుంటూరు జీజీహెచ్లో...!
వైకాపా మాజీ ఎంపీ హౌస్ అరెస్ట్ సంచలనం! పులివెందులలో పోలీసుల ప్రత్యేక నిఘా!
18 వేల మందికి అమెరికా డీపోర్టేషన్! ఆందోళనలో భారతీయులు! టాప్ కేటగిరి తెలుగు వారే!
మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు! అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం!
ఏపీ ప్రజలకు అలర్ట్.. ఇక వారికే పెన్షన్లు - అలా కట్ చేయండి! కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: