Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? Dhulipalla Narendra: కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని.. వైసీపీ అరాచకాలపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? Dhulipalla Narendra: కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని.. వైసీపీ అరాచకాలపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం!

వైకాపా హయాంలో నకిలీ రుణాల దందా! స్త్రీనిధి రుణాల్లో గుట్టుచప్పుడు కాకుండా దోపిడీ! సైకో నేతలే దోపిడీదారులు?

వైకాపా ప్రభుత్వంలో అనకాపల్లిలో పలు బ్యాంకుల నుంచి సుమారు రూ.7 కోట్లకు పైగా పక్కదారి పట్టించారు. గ్రామైక్య సంఘాల లీడర్లే (వీఓఏ) నకిలీ సంఘాల సృష్టికర్తలు. అప్పట్ల

Published : 2024-09-28 09:17:00

వైకాపా ప్రభుత్వంలో అనకాపల్లిలో పలు బ్యాంకుల నుంచి సుమారు రూ.7 కోట్లకు పైగా పక్కదారి పట్టించారు. గ్రామైక్య సంఘాల లీడర్లే (వీఓఏ) నకిలీ సంఘాల సృష్టికర్తలు. అప్పట్లో వారి అక్రమాలకు నేతలు అండగా నిలవడంతో చర్యలకు మీనమేషాలు లెక్కిస్తూ వచ్చారు. ఎన్నికల ముందు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి రావడంతో వీవోఏలుగా తప్పించారు. వారితో అంటకాగిన ఒక ఏపీఎం, ఇద్దరు సీసీలను సస్పెండ్ చేశారు. ఆరు నెలలకే మరలా వారిని గుట్టుచప్పుడు కాకుండా విధుల్లోకి తీసుకుని అల్లూరి జిల్లాకు పంపించేశారు. కూటమి ప్రభుత్వం మరలా నకిలీ రుణాలపై ఆరాలు తీయడంతో వెలుగు అధికారుల్లో గుబులు రేగుతోంది.
'వెలుగు'చూడని అక్రమాలెన్నో!
బ్యాంకు లింకేజీలోనే కాదు స్త్రీనిధి రుణాలు కూడా పక్కదారి పట్టించారు. వైకాపా నేతలు కొందరు బినామీ పేర్లతో ఈ రుణాలు వాడేసుకున్నారు. దేవరాపల్లి, చోడవరం, గొలుగొండ, పాడేరు మండలాల్లో స్త్రీనిధి, ఉన్నతి రుణాల అక్రమాలు అనేకం చోటుచేసుకున్నాయి. అప్పట్లో స్థానికంగానే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు ఉండడంతో అక్రమాలు వెలుగుచూస్తే పార్టీకి ఇబ్బందని బయట పెట్టనివ్వలేదు. క్షేత్రస్థాయి సిబ్బందిపై తాత్కాలిక క్రమశిక్షణా చర్యలు తీసుకున్నా, రుణాల తీరును పర్యవేక్షించాల్సిన డీపీఎంలు, ప్రాజెక్టు మేనేజర్కు కేవలం తాఖీదులతోనే సరిపెట్టేశారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన రుణాలపై కూటమి సర్కారు ప్రత్యేక ఆడిట్ చేయాలని భావిస్తోంది. దీంతో అక్రమార్కుల్లో ఆందోళన మొదలైంది. బదిలీలపై వెళ్లిపోయినా బాధ్యులపై చర్యలు తప్పవని వెలుగు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.


ఇంకా చదవండిసహాయ‌నిధికి విరాళాల వెల్లువ‌! దాత‌లను అభినందించిన సీఎం చంద్ర‌బాబు! విరాళాలు ఇచ్చిన వారిలో..



టార్గెట్ల కోసం పత్రాలేవీ పరిశీలించకుండానే: బ్యాంకు లింకేజీలు, స్త్రీనిధి రుణాల విషయంలో వీవోఏలే కీలకంగా పనిచేస్తారు. ఒక బ్యాంకులో రుణాలు తీసుకున్న పొదుపు సంఘాలు మరో బ్యాంకుకు మారేటప్పుడు (మైగ్రేషన్) ఎక్కువ మొత్తంలో అప్పు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇదే లొసుగును వీవోఏ ప్రతినిధులు సొమ్ముచేసుకున్నారు. బ్యాంకర్లు కూడా తమ టార్గెట్లు కోసం పత్రాలేవీ పరిశీలించకుండానే రుణాలు ఇచ్చేశారు. ఇలా 40 పైగా నకిలీ సంఘాలతో రూ.7 కోట్లను నాలుగు బ్యాంకుల నుంచి వాడుకున్నారు. సాదారణంగా ఓ పొదుపు సంఘంలో ఆ గ్రామానికి, ఆ ప్రాంతానికి చెందినవారే ఉంటారు. ఈ నకిలీ గ్రూపులను పరిశీలిస్తే వేర్వేరు మండలాలకు చెందిన పది సభ్యులను ఒక గ్రూపుగా సృష్టించి వారి ఫొటోలు, ఆధార్ కార్డులు జతచేసి బ్యాంకులను బురిడీ కొట్టించారు. ఇందులో కొంతమంది సభ్యులు కూడా గ్రామైక్య సంఘం ప్రతినిధులతో లాలూచీ పడి వారి ఖాతాలో పడిన సొమ్ములో కొంత మినహాయించుకుని మిగతా మొత్తాన్ని వీవోఏ అధ్యక్ష, కార్యదర్శుల ఖాతాలకు మళ్లించినవారు ఉన్నారు. చాలామందికి తమ పేరిట రుణాలు వాడినట్లే తెలియదు.. వీటిపై ఫిర్యాదు వచ్చాక విచారణ జరిపి బాధ్యులను గుర్తించి నామమాత్రపు చర్యలకే పరిమితమయ్యారు..


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ! ఎందుకో తెలుసా?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక రేషన్ టెన్షన్ లేనట్లే! ఇదే జరిగితేఏర్పాటు చేస్తే లబ్దిదారులకు!

పోలీస్ శాఖలో భారీగా ప్రక్షాళన.. 16 మంది IPS అధికారుల బదిలీ!

జగన్ కు వరుసగా మరో షాక్! మీటింగ్ పెట్టి బ్రతిమిలాడుకుంటున్నా నో యూజ్! మరో ప్రముఖ మాజీ ఎమ్మెల్యే గుడ్ బాయ్!

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి లోకేశ్ ఘాటు విమర్శలు! వైకాపా డ్రామాలకు బుద్ధి చెబుతాం!

అత్యాచారం కేసు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట!

నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం.. ఎంత దొంగలించారుఎవరు?

అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి! మరీ ఇంత దారుణమా - అసలు ఏమి జరిగింది అంటే!

విద్యార్థులకు సీఎం గుడ్ న్యూస్! పోస్టుల భర్తీ ప్రమాణాలు పెంచేలా చర్యలు!

పవన్ కల్యాణ్ నుంచి పవర్‍‌ఫుల్ వ్యాఖ్యలు... అండగా నిలబడాలి! సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే!

విశాఖలో రెండ్రోజుల పాటు మంత్రి నారా లోకేశ్ పర్యటన! కొత్తగా నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన నేతలు!

మాజీ ఎంపీ సీఐడీ కస్టడీలో చిత్రహింసలు కేసులో కీలక మలుపు! రిటైర్డ్ ఎస్పీ ముందస్తు బెయిల్ కు హైకోర్టు షాకింగ్ తీర్పు!

ఏపీలో వైన్ షాపులకు రెండుమూడు రోజుల్లో నోటిఫికేషన్! గవర్నర్ రేపు ఆమోదముద్ర వేసే అవకాశం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



Spotlight

Read More →