Police department: పోలీసు శాఖను సాంకేతికంగా బలోపేతం చేస్తున్నాం.. సీఎం చంద్రబాబు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి దురుసు గురించి ప్రపంచం మొత్తానికి తెలిసిందే. ఆయన మాట్లాడే తీరు, మాటలలో ఉండే ఆగ్రహం, అహంకారం, వ్యంగ్యం తరచూ వివాదాస్పదమవుతుంటాయి. అయితే ఇప్పుడు ఆయన వైట్‌హౌస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ కూడా అదే రీతిలో వ్యవహరిస్తున్నారని అమెరికా మీడియా చెప్పింది. ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించేందుకు త్వరలో ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య హై లెవెల్ మీటింగ్ జరగబోతుందని వార్తలు వచ్చాయి. ఈ సమావేశం హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో జరగబోతోందని సమాచారం.

ముఖ్యమంత్రి కుటుంబంతో దీపావళి సంబరాలు.. రాష్ట్రా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎం!!

ఈ నేపథ్యంలో ఓ అమెరికన్ జర్నలిస్ట్ కరోలిన్ లెవిట్‌కి మెసేజ్ పంపి ఈ మీటింగ్ కోసం ఆ లొకేషన్ ఎవరు ఎంపిక చేశారు? అని ప్రశ్నించాడు. దానికి ఆమె సీరియస్‌గా కాకుండా వ్యంగ్యంగా స్పందిస్తూ, "మీ అమ్మ చేసింది! (Your mom did!) అని రిప్లై ఇచ్చింది. కరోలిన్ ఇచ్చిన ఈ రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవడంతో విమర్శల వెల్లువ మొదలైంది. ప్రొఫెషనల్ స్థాయిలో వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలా ప్రైవేట్ జోక్ మాదిరిగా మాట్లాడడం అప్రతిష్టకరమని నెటిజన్లు మండిపడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ క్లౌడ్ సర్వీసుల్లో అంతరాయం! ఎందుకంటే!

అయితే కరోలిన్ తన సమాధానాన్ని సరదాగా ఇచ్చానని చెప్పినా, అమెరికన్ మీడియాలో ఇది పెద్ద వివాదంగా మారింది. “ప్రజా ప్రతినిధిగా, ముఖ్యంగా వైట్‌హౌస్ సిబ్బందిగా ఉంటూ ఈ రకమైన భాష వాడటం అనవసరం” అని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. కొందరు అయితే “ఇది ట్రంప్ టీమ్ యొక్క మెంటాలిటీని చూపించే ఉదాహరణ” అని వ్యాఖ్యానించారు.

H1B Visa: లక్ష డాలర్ల షాక్ నుంచి టెకీలకు రిలీఫ్..! హెచ్-1బీ వీసాపై కొత్త మార్గదర్శకాలు..!

ట్రంప్ పరిపాలనలో ఈ తరహా అసభ్య వ్యాఖ్యలు, దూషణలు కొత్తవి కావు. ఎన్నికల ప్రచారం సమయంలోనూ, అధికారంలో ఉన్నప్పుడూ ఆయన తరచూ మీడియా ప్రతినిధులపై, రాజకీయ ప్రత్యర్థులపై కఠినమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన బృందంలోని సభ్యులు కూడా అదే శైలిలో మాట్లాడుతున్నారని అమెరికా పత్రికలు వ్యంగ్యంగా రాశాయి.

Chandrababu: నేడు విదేశీ పర్యటనకు చంద్రబాబు! ఏపీ పెట్టుబడులే లక్ష్యంగా మూడు దేశాల్లో కేంద్ర సదస్సులు!

ఇక ట్రంప్-పుతిన్ మీటింగ్‌పై ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోవడమా లేదా మరింత మంటలు చెలరేగుతాయా అన్నది ఈ చర్చలపై ఆధారపడి ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఈ మీటింగ్‌కు ముందే అమెరికా అంతటా కరోలిన్ వ్యాఖ్యలపై చర్చ నడుస్తుండడం ట్రంప్ బృందానికి ఇబ్బంది కలిగించే అంశంగా మారింది.

మెగాస్టార్ చిరంజీవి ఇంట దీపావళి సందడి - అంబరాన్నంటిన టాలీవుడ్ తారల హంగామా!!

మొత్తానికి, ట్రంప్ ఎంత కఠినంగా మాట్లాడుతారో ఆయన సెక్రటరీ కూడా అంతే దురుసుగా వ్యవహరిస్తోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. “ట్రంప్ టీమ్ అంటే అహంకారానికి మరో పేరు” అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు వైట్‌హౌస్‌లో ట్రంప్ మాత్రమే కాదు ఆయన సెక్రటరీ కూడా హాట్ టాపిక్ అవుతున్నారు!

ఖతర్ తెలుగు ప్రవాసీ ఎన్నికల్లో సంచలనం! 73% ఓట్లు కైవసం చేసుకున్న...
ఈరోజు బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల – 24 క్యారెట్ రేటు ఎంత అంటే?
Praja Vedika: నేడు (21/10) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్! వారికి ఎంతో ఉపయోగం... కేవలం రూ.20 పైసలకు మాత్రమే!
ప్రయాణికులకు సూచన.. ఆ రైల్వే స్టేషన్ పేరు మార్పు.. మొఘల్ చక్రవర్తి పేరు తొలగించిన ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ!
అనగనగా ఒక రాజు ప్రోమోతో నవీన్ పోలీసెట్టి దుమ్ము రేపాడు! సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్!!
ఏపీ సీఎం చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ భేటీ! వాటిపై ప్రత్యేక చర్చ!