Pilot alert: లక్నో ఎయిర్‌పోర్టులో తప్పిన విమాన ప్రమాదం.. పైలెట్ అప్రమత్తతతో!

తెలుగు ఇండస్ట్రీలోకి 'దేవదాస్' సినిమాతో అడుగుపెట్టిన హీరో రామ్ పోతినేని, తన తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు. తన డ్యాన్స్‌తో అభిమానులను థియేటర్‌లలో కేకలు వేయించగల సత్తా ఉన్న రామ్, 'రెడీ', 'కందిరీగ', 'నేను శైలజ', 'ఇస్మార్ట్ శంకర్' వంటి సినిమాలతో సూపర్ హిట్‌లను సొంతం చేసుకున్నారు. అయితే, ఇటీవల కాలంలో ఆయన నటించిన కొన్ని చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. 2024లో వచ్చిన 'డబుల్ ఇస్మార్ట్' కూడా ప్రేక్షకులను నిరాశపరిచిందని చెప్పాలి.

Nara Devansh: ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ అందుకున్న నారా దేవాన్ష్!

పి. మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆంధ్రా కింగ్ తాలూకా' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఉపేంద్ర, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వి.టి.వి. గణేష్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Online Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. తొలిసారిగా ఆన్‌లైన్ నామినేషన్లు! ఈసీ కీలక నిర్ణయం..

ఈ చిత్రానికి వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తుండగా, సిద్ధార్థ నుని సినిమాటోగ్రాఫర్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్, మరియు అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

ఎయిర్ ఫ్రయర్ లో అద్భుతమైన రుచులతో వంటలు! ఇలా చేస్తే మాత్రం క్యాన్సర్ వచ్చే ప్రమాదం!

'ఆంధ్రా కింగ్ తాలూకా' చిత్రం నుంచి ఇటీవల విడుదలైన "నువ్వుంటే చాలే" అనే పాటను రామ్ స్వయంగా రాయడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే రామ్, ఈ మధ్య కాలంలో చాలా చురుకుగా ఉంటున్నారు.మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రామ్, భాగ్యశ్రీ ఇద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లలో పిజ్జా గురించి కొటేషన్స్ పోస్ట్ చేయడం. 

GHMC: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఇక పార్కింగ్ టెన్షన్ ఉండదు..!

దీనితో వీరిద్దరి మధ్య ఏదైనా ప్రేమ వ్యవహారం నడుస్తుందేమోనని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. "నువ్వుంటే చాలే" పాటలో కూడా రామ్ పిజ్జా గురించి ప్రస్తావించడం ఈ అనుమానాలను మరింత బలపరిచింది. ఈ చిత్రం ఈ ఏడాది నవంబర్‌లో విడుదల కానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.ఈ చిత్రం విడుదలైన తర్వాతే వారి మధ్య ఉన్నది  ప్రేమబంధమా లేక కేవలం పుకార్లా అనేది తెలుస్తుంది.

Women Jobs: చరిత్రలో తొలిసారి.. మహిళలకు ఆపరేటర్ ఉద్యోగాలకు ఆహ్వానం.. అర్హతలు ఇవే!

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో భాగ్యశ్రీ బోర్సే హవా నడుస్తుందని చెప్పాలి. సోషల్ మీడియాలో తన హాట్ పిక్స్‌తో ఆమె అభిమానుల సంఖ్యను పెంచుకుంటున్నారు. ఇటీవలే విడుదలైన విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' చిత్రం అంతగా విజయం సాధించకపోయినప్పటికీ, భాగ్యశ్రీ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. 'ఆంధ్రా కింగ్ తాలూకా' సినిమాతో ఆమె స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతారో లేదో చూడాలి. వీటితో పాటు ఆమె దుల్కర్ సల్మాన్ తో 'కాంత' అనే చిత్రంలో నటిస్తున్నారు.

British airways: బ్రిటిష్ ఎయిర్‌వేస్ కొత్త నిబంధనలు.. ఇకపై అలా చేస్తే!
Scooters: పెట్రోల్ స్కూటర్ vs ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇందులో ఏది బెస్ట్? ఎంత తేడా ఉందో చూస్తే షాక్.!
Amaravati Expressway: కేంద్రం గ్రీన్ సిగ్నల్! అమరావతి ఎక్స్ప్రెస్ హైవే... డీపీఆర్ రెడీ!
Bumper Offer: బంపర్ ఆఫర్! ఏపీలో కేవలం రూ.4.20 లక్షలకే ఇళ్ళు!
Colleges closed : ఈ నెల 15 నుంచి కాలేజీలు బంద్.. ఎందుకంటే!
Turakapalem: తురకాపాలెం వరుస మరణాలకు కారణం అదేనా.. చెన్నై ల్యాబ్ రిపోర్టు!