విమానం రన్‌వేపై ఉండగా కాలిపోయింది.
కొత్త సంవత్సరం తొలి రోజున జపాన్‌లో భారీ భూకంపం సంభవించడంతో బాధితుల సహాయం నిమిత్రం సామగ్రి తీసుకొచ్చిన కోస్ట్‌గార్డ్ విమానాన్ని ఈ జేఏఎల్ 516 విమానం ఢీకొన్నట్లు రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది.
రన్ వేపై ల్యాండ్ అయిన తరువాత ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది.
కాలిపోతున్న విమానం కిటికీలు, దిగువ భాగం నుంచి మంటలు వస్తున్న దృశ్యాలు జపాన్ టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి.
జపాన్‌కు చెందిన వార్తాసంస్థ ఎన్‌హెచ్‌కే అక్కడి అధికారులను ఉటంకిస్తూ ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించింది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
హనెడా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన తరువాత జపాన్ కోస్ట్‌గార్డ్‌కు చెందిన మరో విమానాన్ని ఢీకొనడం వల్ల మంటలు చెలరేగి ఉండొచ్చని ఎన్‌హెచ్‌కే తెలిపింది.
ప్రమాదానికి గురైన ప్రయాణికుల విమానం హోక్కడో విమానాశ్రయం నుంచి స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు బయలుదేరింది.
హనెడా ఎయిర్‌పోర్ట్‌కు సాయంత్రం 5.40కి చేరుకున్న ఆ విమానం ల్యాండ్ అయిన వెంటనే మంటల్లో చిక్కుకుంది.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి