National Highways: ఇకపై హైవేల వెంట క్యూఆర్ కోడ్లు..! ఒక స్కాన్‌తో అన్ని సమాచారం మీ చేతుల్లోనే..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టు పరిశ్రమను తిరిగి బలోపేతం చేయడానికి కీలక చర్యలు చేపట్టింది. గతంలో నిర్లక్ష్యం కారణంగా దాదాపు క్షీణించిన ఈ రంగాన్ని మళ్లీ అభివృద్ధి దిశగా నడిపేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ముఖ్యంగా మల్బరీ సాగు (మేడిపండు ఆకులు) చేసే రైతులకు, అలాగే పట్టు పురుగుల పెంపకం చేసే వారికి భారీ రాయితీలు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ రాయితీలు అన్ని వర్గాల రైతులకు వర్తించనున్నాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ రైతులకు మరింత ఎక్కువ శాతం రాయితీలు ఇవ్వడం ద్వారా వారిని ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది.

Telecom sector : మళ్లీ పెరగనున్న మొబైల్ టారిఫ్‌లు.. డిజిటల్ ఇండియాపై ప్రభావం!

మల్బరీ సాగు కోసం ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీలు అందిస్తోంది. ఎకరా భూమిలో సాగుకు రూ.30 వేల యూనిట్ ధరగా నిర్ణయించగా, ఇందులో ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ.27 వేల వరకు సబ్సిడీ ఇవ్వనున్నారు. ఇతర రైతులు కూడా రూ.22,500 వరకు రాయితీ పొందగలరు. అంతేకాకుండా, పట్టు పురుగుల పెంపకానికి అవసరమైన షెడ్ల నిర్మాణంపై కూడా భారీ రాయితీలు లభించనున్నాయి. షెడ్–1 నిర్మాణానికి రూ.4.50 లక్షల ఖర్చు అయితే, ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ.4.05 లక్షలు సబ్సిడీగా లభిస్తాయి. ఇతర రైతులు రూ.3,37,500 వరకు సబ్సిడీ పొందుతారు. షెడ్–2 నిర్మాణ ఖర్చు రూ.3.25 లక్షలు కాగా, ఇందులో కూడా రైతులు భారీ రాయితీ పొందుతారు.

Narayanas own house: అమరావతిలో మంత్రి నారాయణ సొంత ఇంటికి.. సీఎం చంద్రబాబు నివాసానికి 100 మీటర్ల!

అలాగే, పట్టు పురుగుల పెంపకానికి అవసరమైన స్టాండ్లు, మల్బరీ సాగుకు అవసరమైన వ్యవసాయ యంత్ర పరికరాలపై కూడా రాయితీలు అందించబడతాయి. ఒక్కో స్టాండ్ ధర రూ.45,500 కాగా, ఇందులో ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ.40,950 రాయితీ ఇస్తారు. ఇతర రైతులకు రూ.34,125 రాయితీ అందుతుంది. అదే విధంగా, మల్బరీ సాగుకు అవసరమైన వ్యవసాయ యంత్ర పరికరాలపై కూడా ప్రత్యేక రాయితీలు లభిస్తాయి. ఒక్కో యూనిట్ ధర రూ.1 లక్షగా నిర్ణయించగా, ఇందులో ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ.90 వేల రాయితీ, ఇతర రైతులకు రూ.50 వేల రాయితీ ఇవ్వనున్నారు.

అక్టోబర్ 4 నుంచి అమలు… బ్యాంకింగ్ రంగంలో భారీ మార్పు!

రైతులు ఈ రాయితీలు పొందాలంటే తమ సమీప రైతు సేవా కేంద్రాలు (RSKs) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అదనపు సమాచారం కోసం పట్టు పరిశ్రమశాఖ సహాయకులు గ్రామ స్థాయిలో అందుబాటులో ఉంటారు. రైతులు ఈ సబ్సిడీలను ఉపయోగించుకుని పట్టు పరిశ్రమలో కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ఒకప్పుడు నిర్లక్ష్యం కారణంగా వెనుకబడిన ఈ రంగం ఇప్పుడు మళ్లీ అభివృద్ధి దిశగా అడుగులు వేయనుంది. పట్టు పురుగుల పెంపకం, మల్బరీ సాగు రైతులకు లాభదాయకంగా మారడం మాత్రమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త ఊపు ఇస్తుంది.

టమాటా వైరస్ కలకలం.. 200కు పైగా కేసులు - 50కి పైగా పాఠశాలల్లో! చిన్నారుల తల్లిదండ్రులకు తీవ్ర ఆందోళన!
Adhaar Update: ఆధార్ అప్‌డేట్ ఛార్జీలు భారీగా పెరిగాయి..! ఖాతాదారులకు ముఖ్య గమనిక!
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. PPO జారీకి కొత్త గడువు! కొత్త రూల్స్ అమలు! కుటుంబ సభ్యులకు అండగా..
అన్నం vs రోటీ... రాత్రి భోజనానికి ఏది మంచిది?
Vijay tvk: కరూర్ తొక్కిసలాట ఘటనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ప్రారంభ దశలోనే సీబీఐ విచారణ కోరడం సరికాదు!
డబ్బు డబుల్.. రిస్క్ జీరో! పోస్టాఫీస్ స్కీమ్ - నెల నెలా రూ.10 వేలు పెడితే.! 5 ఏళ్ల తర్వాత ఎంత వస్తుందో తెలుసా?