F&O Trading: F&O ట్రేడింగ్‌ నిలిపే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు — స్పష్టత ఇచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!! డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వాటిపై రూ.30వేలు, రూ.12వేలు వరకు భారీ సబ్సిడీ! Super Moon visible: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది.. ఈ రాత్రి బీవర్ సూపర్ మూన్ కనువిందు! Movie update: పెద్ది నుంచి ‘చికిరి’ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ — రామ్ చరణ్ హుక్ స్టెప్‌కి సోషల్‌ మీడియాలో హైప్!! Andhra Pradesh: రాయలసీమలో రూ.22,000 కోట్ల పెట్టుబడులు — SAEL ఇండస్ట్రీస్ ప్రాజెక్టులతో భారీగా ఉద్యోగావకాశాలు!! New Year 2026: న్యూ ఇయర్ 2026 ట్రావెల్ ట్రెండ్.. బీచ్‌లు లాంతర్లు, లగ్జరీ పార్టీలు.. మీ గమ్యం ఏది! healthy skin remedies: బ్యూటీ క్రీమ్స్ ఎందుకు? చర్మానికి సొరకాయ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు!! Liquor: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు..! బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు సీరియస్‌..! 140 మీటర్ల వెడల్పు, 6 వరుసల రోడ్డు.. అమరావతి ORRపై కీలక అప్‌డేట్! 40 గ్రామాల్లో భూసేకరణ... Movie update: జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ! “డ్రాగన్” కోసం మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!! F&O Trading: F&O ట్రేడింగ్‌ నిలిపే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు — స్పష్టత ఇచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!! డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వాటిపై రూ.30వేలు, రూ.12వేలు వరకు భారీ సబ్సిడీ! Super Moon visible: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది.. ఈ రాత్రి బీవర్ సూపర్ మూన్ కనువిందు! Movie update: పెద్ది నుంచి ‘చికిరి’ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ — రామ్ చరణ్ హుక్ స్టెప్‌కి సోషల్‌ మీడియాలో హైప్!! Andhra Pradesh: రాయలసీమలో రూ.22,000 కోట్ల పెట్టుబడులు — SAEL ఇండస్ట్రీస్ ప్రాజెక్టులతో భారీగా ఉద్యోగావకాశాలు!! New Year 2026: న్యూ ఇయర్ 2026 ట్రావెల్ ట్రెండ్.. బీచ్‌లు లాంతర్లు, లగ్జరీ పార్టీలు.. మీ గమ్యం ఏది! healthy skin remedies: బ్యూటీ క్రీమ్స్ ఎందుకు? చర్మానికి సొరకాయ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు!! Liquor: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు..! బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు సీరియస్‌..! 140 మీటర్ల వెడల్పు, 6 వరుసల రోడ్డు.. అమరావతి ORRపై కీలక అప్‌డేట్! 40 గ్రామాల్లో భూసేకరణ... Movie update: జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ! “డ్రాగన్” కోసం మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!!

మహా శివ రాత్రి శుభాకాంక్షలతో! ఉపవాసం, జాగారం ఎందుకు చేస్తారు?

2024-03-07 22:15:00

భారతీయ హిందు సాంప్రదాయ పండగలన్నీ తిధులతోను, నక్షత్రాల తో ముడిపడి ఉంటాయి. కొన్ని పండగలకు తిధులు, మరికొన్ని పండగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి... మాఘమాసములో కృష్ణ పక్ష చతుర్ధశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్నరోజును మహా శివరాత్రిగా పరిగణింపబడునని శాస్త్రగ్రంధాలు తెలుపుతున్నాయి. అమావాస్యకు ముందు వచ్చే కృష్ణ పక్ష చతుర్ధశినాడే శివరాత్రి జరుపుకొవాలని శాస్త్ర నిర్ణయము.

సంక్రాంతి పండగ తర్వాత వచ్చే పండగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి. అన్ని పండగలు పగటి పూట జరుపుకుంటే ఈ పండగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాము. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శణమిచ్చే పవిత్ర పర్వదిన కాలం.

శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి. మనస్సును దైవ చింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిదర పోకుండా (జాగరణ) తో మేలుకొని భక్తిశ్రద్ధలతో అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తారు. అందుచేత శివరాత్రిగా పిలవబడుతుంది. ఇది హిందువులకు అత్యంత పుణ్య ప్రదమైన పర్వదినం రోజు.

మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి మూడు ఉన్నాయి.
1) ఉపవాసం ఉండటం 2) రాత్రి జాగరణ చేయడం 3) శివనామ స్మరణతో అభిషేకాలు చేయడం.

లింగోద్భవ కధ

శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కధ ఉంది. ఒకానొక రోజు బ్రహ్మ, విష్ణువుల మధ్య మాట మాట పెరిగి వారిరువురిలో ఎవరు గొప్పో అని తేల్చుకోవలనుకున్నారు. ఆ విషయంలో సయోగ్యత పొందక వాదన తారాస్థాయికి చేరింది. ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘ మాస చతుర్ధశి తిధి రోజు ఇద్దరికీ మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు.

బ్రహ్మ,విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆశివుని యొక్క ఆది, అంతం తెలుసుకోవలని విష్ణువు వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివలింగ అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్ళాడు. మరోవైపు బ్రహ్మ తన హంస వాహనమెక్కి ఆకాశమంతా తిరుగడం ప్రారంభించాడు. వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క మొదలు ఏదో చివర ఏదో తెలియక వెతుకుతూ అలసిపోయారు.

చివరికి ఇక లాభం లేదనుకుని ఇద్దరు కలసి శివుని వద్దకు చేరుకొని మేము నీ శక్తిని తేల్చుకోలేకపోతున్నాము అని అడగగా... శివుడు చిరునవ్వు నవ్వి మీలో ఎవరు గోప్ప అనే పోటీతో వాదోప వాదనతో ఉన్నదానిని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజరూపంతో వివరించి చెబుతాడు. అపుడు బ్రహ్మ విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు.ఆ రోజే మహాశివరాత్రి అయినదని పురాణ కధనం.

మననం చేసేవారిని కాపాడేది మంత్రం అంటారు కాబట్టి పరమేశ్వరుణ్ణి మనస్సులో నిరంతరం మననం చేసుకోవడం వలన అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి. శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం. ఈ సమయంలో గనక శివున్నిఅభిషేకిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి.

శివుడు అభిషేక ప్రియుడు. స్వామికి భక్తితో నీళ్ళతో అభిషేకం చేసిన చాలు తమ భక్తుల భక్తికి స్వామి పొంగిపోతాడు అందుకే శివున్ని బోళాశంకరుడని పేరు. భగవత్ పూజకు భక్తి ప్రధానం అని అర్ధం చేసుకోవాలి. సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివ నామాలను, శివపురాణం మొదలగునవి చదువుకుంటే విశేష శుభఫలితాలు పొందుతారు అని మన శాస్త్రాలు తెలుపుతున్నాయి.

మీ అందరి పైన ఆ శివయ్య కృప ఉండాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రవాసి తరుపున శివరాత్రి శుభాకాంక్షలు.

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →