Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! Maoist: బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌..! ముగ్గురు మావోయిస్టుల మృతి..! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా! జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! Maoist: బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌..! ముగ్గురు మావోయిస్టుల మృతి..! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా! జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు!

ఏంటి ఈ బ్యాంకుల్లో మీరు ఫిక్స్ డిపాజిట్ చేశారా? అయితే లాభం పోయినట్లే! ఈ బ్యాంకుల్లో ఫిక్స్ చేస్తే వడ్డీ??

2024-02-20 14:43:00

బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తున్నారా? ఇక్కడ వడ్డీ రేట్లు ఒక్కో బ్యాంకులో ఒక్కోలా ఉంటాయి. అందుకే డిపాజిట్లు చేసే ముందు ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయనేది చెక్ చేసుకోవడం మంచిది. ప్రముఖ ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. వీటి గురించి చూద్దాం.

Fixed Deposit Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఎక్కువ వడ్డీ అందిస్తున్నాయి. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా వీటి కంటే వెనుకే ఉన్నాయి. జనరల్ సిటిజెన్లకు కూడా ఈ బ్యాంకులో అత్యధికంగా 8 శాతం, 8.50 శాతం, 9 శాతం కూడా ఇస్తున్నాయి.

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో డిపాజిట్లు చేయాలంటే చాలా మందికి కొంత భయం ఉంటుంది. అయితే ఇక్కడ కూడా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) కింద రూ. 5 లక్షల వరకు నగదుపై గ్యారంటీ ఉంటుంది. బ్యాంక్ దివాలా తీసినా లేదా ఇతర సంక్షోభ పరిస్థితుల్లో అసలు, వడ్డీ కలిపి ఇంతవరకు రావొచ్చు. ఇప్పుడు FD లపై ఎక్కువ వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్ చూద్దాం.

>> ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు రెగ్యులర్ సిటిజెన్లకు 7 రోజుల నుంచి పదేళ్ల వ్యవధి డిపాజిట్లపై 3.75 శాతం నుంచి 8 శాతం వరకు వడ్డీ అందిస్తోంది. 18 నెలల డిపాజిట్లపై అత్యధికంగా వడ్డీ వస్తోంది. ఇక సీనియర్ సిటిజెన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ పొందుతారు.

>> ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 3.50 శాతం నుంచి 8.50 శాతం వరకు వడ్డీ రేట్లు ఉన్నాయి. ఇక్కడ 444 రోజుల డిపాజిట్‌పై అత్యధికంగా 8.50 శాతం వస్తుంది.

>> ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 4 శాతం నుంచి 8.25 శాతంగా వడ్డీ రేట్లు ఉన్నాయి. రెండేళ్ల నుంచి మూడేళ్ల వ్యవధి డిపాజిట్లపై అత్యధిక వడ్డీ వస్తుంది.

>> ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 3 శాతం నుంచి అత్యధికంగా 8.61 శాతం వడ్డీ వస్తోంది. 750 రోజుల డిపాజిట్‌పై ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తోంది.

>> జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో FD వడ్డీ రేట్లు 3 శాతం నుంచి 8.50 శాతంగా ఉన్నాయి. 365 రోజుల డిపాజిట్‌పై అత్యధికంగా వడ్డీ వస్తుంది.

>> సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 4 నుంచి 8.65 శాతంగా వడ్డీ రేట్లు ఉన్నాయి.

>> ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 3.75 శాతం నుంచి 8.25 శాతంగా డిపాజిట్ వడ్డీ రేట్లు ఉన్నాయి. 560 రోజుల డిపాజిట్‌పై ఎక్కువగా 8.25 శాతం వడ్డీ అందుతోంది.

>> యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 4.50 శాతం నుంచి 9 శాతంగా ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఉన్నాయి. 1001 రోజుల డిపాజిట్‌పై అత్యధికంగా వడ్డీ పొందుతున్నారు. ఇక్కడ సీనియర్ సిటిజెన్లు అత్యధికంగా 9.50 శాతం వడ్డీ అందుకుంటుండటం విశేషం.

>> ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 7 రోజుల నుంచి 10 సంవత్సరాల టెన్యూర్ డిపాజిట్లపై 4 శాతం నుంచి 8.50 శాతం వడ్డీ వస్తోంది. 2 సంవత్సరాల నుంచి మూడేళ్ల వ్యవధి డిపాజిట్లపై అత్యధికంగా వడ్డీ అందుతోంది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →