ముఖేష్ అంబానీ: దాదాపు ఏడాది కాలం నుంచి రిలయన్స్ గ్రూప్ చాలా వేగంగా తన వ్యాపార విస్తరణను అన్ని విభాగాల్లో ముందుకు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో అనేక పేరున్న కంపెనీలను విలీనం చేసుకుంటూ వేగంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో మరో డీల్ జరగటం గమనార్హం. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ కంపెనీ తాజాగా మరో భారీ డీల్ ఫైనల్ చేసింది. వాస్తవానికి కంపెనీ 82 ఏళ్ల రావల్‌గావ్ షుగర్ ఫామ్‌కు చెందిన కాఫీ బ్రేక్ అండ్ పాన్ పసంద్ వంటి మిఠాయి బ్రాండ్‌లను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. రావల్‌గావ్ షుగర్ ఫామ్స్ మాంగో మూడ్, కాఫీ బ్రేక్, టుట్టి ఫ్రూటీ, పాన్ పసంద్, చోకో క్రీమ్, సుప్రీమ్ వంటి బ్రాండ్‌లను కలిగి ఉంది. అంబానీ తాజా డీల్ ద్వారా వీటికి సంబంధించిన ట్రేడ్‌మార్క్‌లు, తయారీ రెసిప్పీ, ఇతర హక్కులను డీల్ కింద రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ RCPL దక్కించుకుంది. RCPL అనేది రిలయన్స్ గ్రూప్ రిటైల్ యూనిట్ అయిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. తాజా డీల్ విలువ దాదాపు రూ.27 కోట్లకు జరిగింది. దీంతో కంపెనీకి చెందిన బ్రాండ్‌ల ట్రేడ్‌మార్క్‌లు, మేధో సంపత్తి హక్కులను అంబాని సంస్థకు బదిలీ చేసేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదించిందని స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారంలో రావల్‌గావ్ షుగర్ ఫామ్ తెలిపింది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
అయితే రావల్‌గావ్ షుగర్ ప్రతిపాదిత ఒప్పందం తర్వాత కూడా ఆస్తి, భూమి, ప్లాంట్, భవనం, పరికరాలు, యంత్రాలు వంటి ఇతర ఆస్తులన్నీ తమ వద్దే ఉంటాయని తెలిపింది.. ఇటీవలి సంవత్సరాల్లో మార్కెట్లో పెరిగిన పోటీ కారణంగా తమ మిఠాయి వ్యాపారాన్ని కొనసాగించడం కష్టతరంగా మారటంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది. అలాగే మార్కెట్లో చాలా వాటాను కంపెనీ కోల్పోయిన సంగతి తెలిసిందే. స్టాక్ మార్కెట్‌లో లిస్టెడ్ కంపెనీ అయిన రావల్‌గావ్ షుగర్ షేర్లు రూ.785 స్థాయి వద్ద కొనసాగుతున్నాయి. అంబానీకి చెందిన రిలయన్స్ ఈ కంపెనీని కొనుగోలు చేస్తున్నట్లు తెలియటంతో షేర్లలో ఒక్కసారిగా బూమ్ కనిపించింది. నవంబర్ నెలలో ఈ షేరు ధర రూ.1,157.25కి పెరిగింది... ఇది స్టాక్‌లో 52 వారాల గరిష్ఠ ధరగా నిలిచింది. అలాగే మార్చి 2023లో కంపెనీ షేరు ధర 52 వారాల కనిష్ఠమైన రూ.596.20కి చేరుకుంది.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి